మనం సాధారణంగా ఆనందాన్ని ఒక లక్ష్యంగా భావిస్తూ, దానిని వివిధ మార్గాల్లో పొందాలని ప్రయత్నిస్తాం. దీని గురించి సద్గురు ఏమంటున్నారో తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవండి.


మీరు సేకరించిన వాటితోనే మిమ్మల్ని మీరు గుర్తించుకుంటున్నారు. సేకరణ ఈ జీవితాన్ని సంపన్నం చేయవచ్చు, జీవితపు ప్రతి అంశంలో ధనవంతులు ఎవరు? ఎవరైతే ఎక్కువ సేకరించారో వారే, అవునా, కాదా? అందువల్ల సేకరణ వల్ల ఇబ్బంది లేదు, అది మీ జీవితాన్ని సంపన్నం చేస్తుంది. కానీ మిమ్మల్ని మీరు, మీరు సేకరించిన వాటిగానే గుర్తించుకుంటున్నారు. మీరు కేవలం వస్తువులనే సేకరించగలగుతారు కాబట్టి, మిమ్మల్ని మీరు ఆ విధంగా ఒక వస్తువుగా దిగజార్చుకుంటున్నారు.

మీరు మనుషులను కూడా సేకరించుకుంటారని నాకు తెలుసు, కానీ మీ ఉద్దేశ్యంలో వారు కూడా వస్తువులే. ఎందుకంటే వారు మీ ఆస్తి. అవునా, కాదా? మనుషులు మీ ఆస్తి. మీ భర్త, మీ భార్య, మీ పిల్లలు, వారంతా మీ ఆస్తి. మీ అహానికి జీవంలేని వస్తువుల సేకరణ సరిపోదు కాబట్టి మీరు జీవం ఉన్న వాటిని కూడా సేకరిస్తారు; లేకపోతే మీకు హాయిగా ఉండదు. వారు ప్రాణంతో ఉన్న జీవులే కావచ్చు కానీ, మీ ఉద్దేశంలో అవి మీ స్వాధీనంలో ఉన్న వస్తువులు.

కాబట్టి, సేకరించడం అనేది దానికై అదే ఒక సమస్య కాదు, కానీ మిమ్మల్ని మీరు, మీరు సేకరించిన దానితో గుర్తించుకోబడటం, మిమ్మల్ని మీరు ఒక వస్తువుగా దిగజార్చుకోవటమే సమస్య. ఈ గుర్తింపులో, మిమ్మల్ని మీరు ఒక వస్తువుగా తగ్గించుకోవడంలో మీరు మీ స్వంత ఉనికిని కోల్పోతారు. మీరు మీకై మీకు అస్థిత్వం ఏమీ లేనట్లు, కేవలం ఒక సేకరణగానే జీవిస్తారు. ఎందుకంటే మిమ్మల్ని మీరు దానితో అలా గుర్తించుకుంటారు.

మీరు మీ సేకరణలోని ఏ భాగం తోటి గుర్తించబడకపోయినా, మీకొక ఉనికి ఉంది. మీకొక పెద్ద ఉనికి ఉంది, ఏ సేకరణా లేని శక్తివంతమైన ఉనికి ఉంది. కానీ మీరు గుర్తించబడటాన్నే ఎంచుకున్నారు. ఎందుకంటే మీ ఉనికి యొక్క విస్తృతత్వాన్ని చవి చూడటానికి, మిమ్మల్ని మీరు ఒక్క క్షణం కూడా అనుమతించు కోలేదు.

మీరు ఒక వస్తువుతో గుర్తింపబడి, దానిగా మారిపోయారు, కొంతకాలానికి మీకు అది సరిపోయినట్లుగా అనిపించడంలేదు. అందుకని మీరు ఇంకొక దాన్ని సేకరించారు. అది కూడా కొంత కాలం వరకే బాగా అనిపించి, తరువాత సరిపోనట్లుగా అనిపించింది. అలా మీరు మరొకటి, మరొకటి, మరొకటి సేకరిస్తూనే ఉన్నారు.

మీరు అలా నక్షత్ర మండలాలనన్నింటినీ సేకరించినా కూడా మీకు సరిపోనట్లుగానే అనిపిస్తుంది. ఎందుకంటే మీలో ఉన్నది చిన్న, చిన్న వాటికి సంతృప్తి చెందదు. ఎందుకంటే దాని స్వభావం సృష్టికర్త స్వభావమే.

మీరు అలా నక్షత్ర మండలాలనన్నింటినీ సేకరించినా కూడా మీకు సరిపోనట్లుగానే అనిపిస్తుంది. ఎందుకంటే మీలో చిన్న చిన్న వాటికి సంతృప్తి చెందనిదేదో ఉన్నది. దాని స్వభావం సృష్టికర్త స్వభావమే. మీలో ఏదైతే ఉన్నదో, ఏదైతే సృష్టికి ఆధారభూతమైనదో, దాన్ని ఎటువంటి గుర్తింపుకు పరిమితం చేయలేము.

మీరు దానిని ఒక గుర్తింపుతో ముడి పెట్టిన క్షణం, అది సంఘర్షణ పడుతుంది. ఈ ఘర్షణే మీరు అనుభవించే ఆనందలేమి లేదా బాధ. మీరు దానిని అన్ని గుర్తింపుల నుండి వేరు చేస్తే, మీరు ఆనందం వెనకాల పరుగెత్తనక్కర లేదు. అదేదో లక్ష్యం కాదు మీరు సాధించటానికి. అది ఆకాశం నుండి వేలాడే పండు కాదు. అది దానంతట అదే మీకు సొంతమయ్యే ఒక లక్షణం.

 

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.