దివ్యత్వానికి మార్గం

path

మనం శారీరకంగా జన్మ ఎత్తడం, మన తల్లి గర్భం నుండి బయటకి రావడం అనేది మనకి అవకాశాల వెల్లువకు ఆరంభం. శారీరక పుట్టుక మిమ్మల్ని కేవలం ఒక జంతువులాగా ఈ ప్రపంచంలోకి తీసుకువస్తుంది. అయితే, మిమ్మల్ని మీరు మాత్రమే ఒక సంపూర్ణ మానవుడిగా లేదా ఒక దివ్యత్వానికి అవకాశంగా మలచుకోగలరు. ఇది ఎవరికి వారే చేసుకోగలిగినది. ఒక మనిషి తనంతట తానుగా, ఎరుకతో అవసరమైన అవగాహన ఏర్పరచుకొని, తనలోని జంతువుని చంపి, తనలోని దివ్యత్వాన్ని వికసింపజేసినప్పుడే ఆ జన్మ ధన్యమవుతుంది. ఈ అవకాశం మన జీవితంలోని ప్రతిక్షణం లోనూ మనకి ఉంటుంది.

ఒక అవకాశం వాస్తవరూపం లోకి రాక పోతే, అది ఒక విషాదం. మొలకెత్తని విత్తనం, వికసించని పుష్పం ఒక విషాదం. అవకాశం లేనప్పుడు అది వేరే విషయం. కాని మీరు ఒక రాయి వికసించాలని ఊహించట్లేదు, ఒక గాడిద విజ్ఞానం పొందాలని అనుకోవటం లేదు. మనం ఒక పుష్పించే మొక్కనే పుష్పించాలనుకుంటున్నాము, ఒక మనిషినే తన అత్యుత్తమ స్వభావానికి వికసించాలని అనుకుంటున్నాము. ఈ అవకాశాన్ని నిద్రాణంగానే ఉంచేస్తే, అది చాలా విషాదం.

ఒకరు తమ నిర్బంధాలను అధిగమించి, ఆ నిర్బంధపు స్వభావాన్ని అధిగమించటానికి కృషి చేస్తూ ఒక ఎరుక ఉన్న మనిషి కావటానికి ప్రయత్నించడమే గొప్ప విశేషం.

బ్రహ్మచర్యమంటే దివ్య మార్గంలో నడవటం. దివ్య మార్గంలో నడవటమంటే ఎలా ఉంటుంది? అది ఏమిటంటే, వారు వారి నిర్బంధపు స్వభావాలను అధిగమించి స్పృహతో జీవన ప్రక్రియలోకి వెళ్ళటం. ఆ ప్రయత్నమే చాలా పవిత్రమైనది. వారు వారి పరిమితులను నేడే దాటుతారా లేక పదేళ్ళ తరువాత దాటుతారా? విషయం అది కాదు. ఒకరు తమ నిర్బంధాలను అధిగమించి, ఆ నిర్బంధపు స్వభావాన్ని అధిగమించటానికి కృషి చేస్తూ ఒక ఎరుక ఉన్న మనిషి కావటానికి ప్రయత్నించడమే గొప్ప విశేషం. ఈ కృషే చుట్టూ పక్కల ఉన్న వారందరికీ ఎనలేని అవకాశాలను సృష్టిస్తుంది.

ప్రాచీన కాలంలో మన సాంప్రదాయంలో వివేకం గలవారు, ప్రపంచంలో 30% మంది సన్యాస మార్గంలో వెళ్లాలని నిర్ణయించారు. మనం ఎక్కడా దానికి దరిదాపుల్లో కూడా లేము. చాలా మంది యోగులు గతంలో దీనిని పునరుద్ధరించడానికి ప్రయత్నించారు. వందల వేల మందిని సన్యాస మార్గంలోకి తెచ్చిన యోగులలో అగస్త్యులు ఒకరు. వారి కృషి ఫలితాన్ని మనం ఈ రోజుకీ ఇంకా అనుభవిస్తున్నాము. ముందు తరాలు గొడ్డు పోకుండగా నేడు ఈశా ఫౌండేషన్ చేస్తున్న కృషి కూడా అటువంటిదే. ఈ ప్రపంచంలో ముందు తరాల వారు కేవలం తిని, తాగి, పునరుత్పత్తి చేయటమే కాకుండా వారు అంతర్గత ఉన్నతి కై కృషి చేసుకోవచ్చు.

మనని జంతువులనుండి వేరు చేసే ఒకే ఒక విషయం- అవి నిర్బంధంగా పని చేస్తాయి, మనం ఎరుకతో పని చేస్తాము. మనం మన జీవితాల నుండి నిర్బంధాలను పూర్తిగా తొలగించుకోగలిగితే, జీవితం యొక్క ప్రతి అంశాన్ని ఎరుకగల ప్రక్రియగా మార్చుకోగలిగితే, మన  జీవితం దివ్యమవుతుంది. ఆ వ్యక్తి ముక్తి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. అది అతని హక్కు. అది దేవుడు ఇచ్చే వరం కాదు. అది అతని హక్కు, దానిని అతను పొందవలసినదే, ఎవరూ దానిని ఆపలేరు.

ప్రేమాశీస్సులతో,
సద్గురుఅనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *