విజయ సాధన చిట్కాలు – 5/5

what

మనం చేసే ప్రతిదాంట్లో  ‘నాకేమిటి’, ‘నా సంగతేమిటి’ అని ఆలోచిస్తుంటాం. మనం బయటికి చెప్పకపోయిన ఈ ఆలోచన మన బుర్రలో తిరుగుతూనే ఉంటుంది. ఈ ‘నాకేమిటి’ అన్నదాని గురించి సద్గురు ఏమంటున్నారో తెలుసుకోవాలంటే  విజయసాధనకు సద్గురు అందిస్తున్న ఈ ఐదవ చిట్కాను  తప్పక చదవండి!


చిట్కా – 5 :”నాకేమిటి” అనే లెక్కలని ఒదిలేయండి!

success5

 మీ సొంత అవసరాలను దాటి మీరు చూడగలిగితే, మీ జీవిత పరిధిని విస్తృతం చేసుకుంటే, మీరు తప్పకుండా ఒక గొప్ప మనిషి అవుతారు 

మీరేదో గొప్పవారు కావాలని కోరుకోవలసిన అవసరం లేదు.  మీ సొంత అవసరాలను దాటి మీరు చూడగలిగితే, మీ జీవిత పరిధిని విస్తృతం చేసుకుంటే, మీరు తప్పకుండా ఒక గొప్ప మనిషి అవుతారు. మీరు కొంత మంది మనుషులను గమనిస్తే, వారు గొప్పతనాన్ని కోరుకున్నందు వల్ల వారు గొప్పవారు కాలేదు, వారు “నా సంగతి ఏమిటి” అన్న విషయాన్ని దాటి జీవితాన్ని చూడటం వల్ల  గొప్పవారయ్యారు.

మీరు మీ మనసు నుండి “నా సంగతి ఏమిటి?” అన్న ఈ ఒక్క లెక్కను తీసివేసి, మీ పూర్తి సామర్ధ్యం మేరకు పని చేస్తే, మీరు ఎదో ఒక విధంగా గొప్పవారు అవుతారు. ఎందుకంటే మీరు సహజంగానే “నేను నా చుట్టూ ఉన్న జీవితాలకూ, జీవులకూ  ఏమి చేయగలను?” అని ఆలోచిస్తారు. కాబట్టి మీరు సహజంగానే మీ శక్తిసామర్ధ్యాలను మెరుగు పరచుకుంటారు. ఎందుకంటే చేయవలసింది ఎంతో ఉంది!

ప్రేమాశీస్సులతో,
సద్గురుఅనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert