విజయ సాధన చిట్కాలు – 1/5

5052886953_93141366fa_b

విజయం మీతో ఎప్పుడూ దోబూచులాడుతుందని మీరు అనుకుంటుంటే, బహుశా మీరు ఒక కొత్త పద్ధతిలో ప్రయత్నించాల్సిన సమయం ఆసన్నమయిందని అర్ధం. మీరు చేసేదేదైనా, దాంట్లో  మీరు విజయం సాధించేందుకు సహాయపడే  కొన్ని చిట్కాలను ఒక సందర్భంలో  సద్గురు తెలియజేసారు.  వాటిల్లో మొదటిదాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.


చిట్కా – 1 : అదృష్టాన్ని మర్చిపోండి, సంకల్పంతో జీవించండి!

success7

మీరు సంకల్పం, సామర్ధ్యాలతో జీవిస్తున్నప్పుడు, ఏది జరిగినా, జరగకపొయినా కనీసం మీరు చేయగలిగిందైనా  మీ నియంత్రణలో ఉంటుంది.

ఏదో కొన్ని విషయాలు అదృష్టవశాత్తు జరగవచ్చు. కానీ మీరు ప్రతిసారీ ఆ అదృష్టం కోసం మాత్రమే ఎదురు చూస్తూ ఉంటే, మీకు మంచి జరిగే సమయం వచ్చే లోపు, మీరు స్మసానానికి చేరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏ పనులైనా వాటంతట అవే జరగడానికి వాటి సమయం అవి తీసుకుంటాయి మరి! ఉదాహరణకి,  కోటి సార్లల్లో ఒక సారి, ఒక గోడ గుండా కూడా మీరు నడవగలుగుతారు, ఎందుకంటే అణువుల స్పందించే విధావం వలన మీరు అలా నడచే అవకాశం ఉందని  క్వాంటం సిద్ధాంతం చెబుతోంది. కాని కోటి సార్లల్లో ఆ ఒక్క సమయం – ఆ అణువుల స్పందన కావలిసిన  క్రమంలో జరిగే సమయం వచ్చే వరకు, మీరు మీ బుర్రని బద్దలు కొట్టుకున్న అలా నడవలేరు. మీరు అదృష్టంపై ఆశతో జీవిస్తే, మీకు భయాందోళనలు కూడా కలుగుతాయి. మీరు సంకల్పం, సామర్ధ్యాలతో జీవిస్తున్నప్పుడు ఏది జరిగినా, జరగకపొయినా, కనీసం మీరు చేయగలిగిందైనా  మీ నియంత్రణలో ఉంటుంది.  ఇలా జీవించడమే  మరింత స్దిరమైన జీవన విధానం!

ప్రేమాశీస్సులతో,
సద్గురు

ఇంకా చదవండి.. విజయ సాధన చిట్కాలు -2

flickr@dgles/Fingers Crossedఅనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert