సద్గురు: ఈరోజుల్లో, యువత యోగ ధ్యానం వైపు మొగ్గు చూపిస్తున్నారు. యువత అంటే ఇంకా రూపకల్పన లో ఉన్న మానవాళి. వీరు ఇంకా రూపు దిద్దుకుంటున్నారు. రూపు దిద్దుకుంటున్న స్థితిలో ఉండడం వల్ల, వారిని వారు ఎలా కావాలంటే అలా మలచుకోగలరు. ఇది ఒక గొప్ప అవకాశం. యువత అఖండమైన శక్తి కలిగి ఉంటుంది. ఈ సమయం లో వారిని వారు ఎంతో అందమైన మానవులుగా లేదా ఎంతో వికృతమైన వారిగా - ఏ విధంగా నైనా తీర్చిదిద్దుకోవచ్చు. ఒక అద్భుతమైన సంభావ్యతగా లేదా ఓ విపత్తుగా పరిణమించవచ్చు. 

కుటుంబంలో యుక్త వయసులోని వారు ఉన్నప్పుడు, పెద్దవారు ఎదో తెలియని ఆందోళన చెందుతుంటారు. ఎందుకంటే యువకులు అద్భుతమైన మానవులుగా వికసించనూ గలరు లేదా ఓ విపత్తుగానూ పరిణామం చెంద గలరు. ఈ రెండిటిలో ఏదైనా జరిగెందుకు అవకాశం ఉంది. ఇది పెద్దవారిలో భయాన్ని కలిగిస్తుంది, ఎందుకంటే యువత ఇంకా రూపు దిద్దుకుంటున్న స్థితి లోనే ఉంది కాబట్టి. మార్పుకి సిద్ధంగా ఉన్నవారు యువత. ఇది ఓ అద్భుతమైన అవకాశం.

యవ్వన దశలో అఖండమైన శక్తి ఇంకా మేధస్సనే కుసుమాలు వికసిస్తాయి. కాని అదే సమయంలో, వారి తెలివి వారి హార్మోన్ ల కారణంగా దారిమళ్లించబడెందుకు అవకాశం ఉంది. ఇది యువతతో ఉన్న ప్రధాన సమస్య.

ఇక అప్పటినుండి వారు మరో విషయం గురించి ఆలోచించలేరు. లైంగికత జీవితంలో భాగం కాబట్టి వారు దానిని వెలివెయ్యకర్లేదని, వారి నిర్బంధనల నుండి దూరంగా ఉండేందుకు కావలసిన ఎరుక, చైతన్యం, కలిగి ఉండాలని, మనం వారికి భోదించ గలిగితే, వారు ఓ గొప్ప సంభావ్యతగా పరిణామం చెందగలరు. లేకపోతే వారు వారి నిర్బంధనలకి లోనవుతారు. అలాకాకుండా, వారు కాస్త ఎరుకతో నడుచుకుంటే, మానవాళికి గొప్ప భవిష్యత్తు ఉంటుంది.