జ్ఞానోదయం కోసం మీరు హిమాలయాలకు  వెళ్ళవలసిన అవసరం లేదని, మీరు చేయవలసింది మీలోకే తిరగడమని సద్గురు చెబుతున్నారు..

ప్రశ్న : ఎంతోమంది పిలవబడతారు. కానీ కొద్దిమంది మాత్రమే ఎంచుకోబడతారు...!

సద్గురు : నేనేమంటానంటే ఎంతోమంది పిలవబడతారు, కానీ కొద్దిమంది మాత్రమే ఎంచుకుంటారు. కొద్దిమంది మాత్రమే నిజంగా ఈ దోవ తీసుకోవాలనుకుంటారు. కొంతమంది మాత్రమే ఎంచబడడం కాదు; కేవలం కొద్దిమంది మాత్రమే ఈ అడుగుని తీసుకోవాలనుకుంటారు. ప్రజలు నన్ను, "దీని కోసం ఎన్ని అడుగులు వెయ్యాలి " అని అడుగుతారు. వారికి,  నేను కేవలం ఒక్క అడుగు మాత్రమే అని చెప్తాను..అంతే..! ఎందుకంటే నిజానికి ఉన్నది ఒక్కటే అడుగు - కదా..? మీరు, బయటికి ఎన్నో లక్షల అడుగులు వేశారు. కానీ మీరు అంతర్ముఖంగా వెయ్యవలసినది, ఒక్క అడుగు మాత్రమే..! కానీ, మీరు ఆ ఒక్క అడుగు తీసుకోలేకపోతున్నారు.

ఇది అంతర్ముఖమైన అడుగు. దీనికీ మీరు హిమాలయాల్లో ఉన్నారా లేక బొంబేలో ఉన్నారా అన్నదానికి ఎటువంటి సంబంధమూ లేదు.

ఇందుకోసం మీరు పూర్తిగా వెనుదిరిగి, ఈ అడుగుని వెయ్యాలి. కానీ, మీరు ఇలా వెనక్కి తిరగడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే, మీరు బాహ్య ప్రపంచంలో ఎన్నో పెట్టుబడులు పెట్టేశారు. మీరు అంతర్ముఖులైతే, మీరు మీ బాహ్య ప్రపంచాన్ని కోల్పోతారని అర్థం కాదు. ఇది మీకు అక్ఖర్లేని భయం. ఒక్కోసారి, ఈ భయం ఆధ్యాత్మికత మీద ఉన్న రకరకాల అపార్థాలతో పోషించబడుతోంది. ప్రజలు మీకు ఎప్పుడూ ఏమి చెప్పారంటే, మీరు ఆధ్యాత్మికులుగా మారాలంటే, మీరు అన్నిటినీ విడిచిపెట్టి వెళ్లిపోవాలి - అని. మీరు ఆధ్యాత్మిక పథంలోకి రావాలంటే, హిమాలయాల్లోని గుహకు వెళ్ళాలి - అని.

ఇది అంతర్ముఖమైన అడుగు. దీనికీ మీరు హిమాలయాల్లో ఉన్నారా లేక ముంబైలో ఉన్నారా అన్నదానికి ఎటువంటి సంబంధమూ లేదు. ముంబై అయినా, హిమాలయాలయినా సరే, మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారన్నది మీ ఎంపిక. అది కేవలం ఒక బాహ్యమైన విషయం. దీనికీ ఆధ్యాత్మికతకూ ఎటువంటి సంబంధమూ లేదు.   మీరు,  కొండల్లో ఉండాలి అని అనుకుంటే, అది మీ ఇష్టం. దాని వల్ల ఉండే ఉపయోగాలూ, కష్టాలూ ఉన్నాయి. అలానే  మీరు ముంబయిలో ఉండాలనుకుంటే కూడా, దానికుండే ఉపయోగాలూ దానితో వచ్చే కష్టాలూ దానికి ఉంటాయి.

కాకపోతే చాలా కాలం పాటూ, మనకు భారతదేశంలో విడాకుల పద్ధతి లేదు కాబట్టి, ప్రజలు ఒక గౌరవకరమైన పద్ధతిలో వారి కుటుంబాన్ని వదిలి పెట్టడానికి ఆధ్యాత్మిక పథం అన్నది ఎంచుకున్నారు. మీరు, “నేను ఆధ్యాత్మికుడిగా మారుతున్నాను” అని చెప్పడం మీ కుటుంబాన్ని గౌరవంగా వదిలిపెట్టడం. ఇది, మీకు ఒక వంక. ఈ వంకని ప్రజలు ఎంతో కాలం వాడారు. ఇప్పుడు, మీకు అటువంటి వంకలు అవసరం లేదు. కదూ..???

ప్రేమాశీస్సులతో,
సద్గురు