సద్గురు: వ్యక్తి ఎరుక, కావాల్సినంత పదునుగా, తీక్షణంగా అయితే, తమ శ్వాస గురించి వారు సహజంగానే ఎరుకతో ఉంటారు. శ్వాసించటం అనేది శరీరం యొక్క యాంత్రిక ప్రక్రియ. అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అసలు మనిషి దాని ఎరుక లేకుండా ఎలా ఉంటారో అన్నది, ఆశ్చర్యపడవలసిన విషయము. కానీ ఒకసారి ఈ శ్వాస మీరు ఎరుకలోకి వస్తే, అది ఎంతో అద్భుతమైన ప్రక్రియ అవుతుంది. అందుకే ఈ శ్వాసమీద ధ్యాస పెట్టడం అనేది ఈనాడు చాలా ఎక్కువమంది సాధన చేయడంలో ఆశ్చర్యంలేదు. అది ఎంతో సహజంగా చాలా సులువుగా జరుగుతున్నదంటే కారణం, దానికి ఏవిధమైన ముందస్తు తయారీ అవసరం లేదు.

మీరు కాస్తంత స్పృహతో, చేతనతో ఉంటే, శ్వాస సహజంగానే మీ ఎరుకలోకి వస్తుంది. నాకు 6, 7 సంవత్సరాల వయసులో, నేను ఈ శ్వాసను అనుభూతి చెందడం, ఆనందించడం జరిగింది. నా చిన్న ఛాతీ, పొట్ట భాగలు పైకి, క్రిందికి ఎప్పుడూ సంకోచ, వ్యాకోచాలు చెందడం నాకెంతో ఆసక్తిగా ఉండేది. దానితోనే గంటలు, గంటలు గడిపే వాడిని. ఈ ధ్యానం అనే ప్రక్రియ, ఆ తర్వాత ఎంతో కాలానికి నా జీవితంలోకి వచ్చింది. కానీ మీరు కాస్త చైతన్యంతో ఉంటే, ఆగకుండా జరిగే ఈ శ్వాస ప్రక్రియను, మీరు గుర్తించకుండా ఉండలేరు.

నా చిన్న ఛాతీ, పొట్ట భాగలు పైకి, క్రిందికి ఎప్పుడూ సంకోచ, వ్యాకోచాలు చెందడం నాకెంతో ఆసక్తిగా ఉండేది. దానితోనే గంటలు, గంటలు గడిపే వాడిని.

తమ శరీరాలు, శ్వాసకోశాలు నొప్పితో, ఎక్కువగా కొట్టుకున్నప్పుడు మాత్రమే, సామాన్యంగా చాలామంది శ్వాసను గుర్తిస్తారు. ఈ మామూలు శ్వాస ప్రక్రియను ఎక్కువమంది గుర్తించడం లేదు, దానికి కారణం వారికి శ్రద్ధ పెట్టే గుణం లేకపోవడం వల్లనే. ఈ కాలంలో చాలామంది జనం, ఈ అజాగ్రత్త, శ్రద్ద పెట్టకపోవడాలను, ఓ పెద్ద క్వాలిఫికేషన్ లాగా చూసుకుంటున్నారు.

మీ జీవితంలోకి శ్రద్ధ తీసుకురావడం

మీ జీవితంలోకి, ముఖ్యంగా మీ పిల్లల జీవితంలోకి ఈ శ్రద్ధను తీసుకురావడం చాలా ముఖ్యం. అది ఆధ్యాత్మికమైనా, భౌతికమైనా, ఈ ప్రపంచంలో ఏదైనా మీకు ప్రతిఫలం చూపేది, మీరు తగినంత శ్రద్ధ చూపించినప్పుడే.

శ్వాస ఒక యాంత్రిక ప్రక్రియ. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు, విడుస్తున్నప్పుడు మీ శరీరం ఒకరకంగా ఒక రకమైన సంకోచ వ్యాకోచాలలోకి పోతుంది. మీరు ఏదో మీ మానసిక చెత్తలో పూర్తిగా మునిగిపోతే తప్ప, దీనిని మీరు గుర్తించకుండా ఎలా ఉంటారు?

ఇలా శ్వాస మీద ధ్యాస పెట్టడం అనేది, దానిని బలవంతంగా చేయటం అవుతుంది. కానీ అది మిమ్మల్ని ఎరుకతో ఉంచుతుంది. ఇక్కడ ముఖ్యం ఏమిటంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం కాదు, మీ ఎరుకను పెంచడం ద్వారా, మీరు సహజంగానే ఈ శ్వాసను మీ స్పృహలోకి తీసుకు రావడం. శ్వాస ఒక యాంత్రిక ప్రక్రియ.

మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు, విడుస్తున్నప్పుడు మీ శరీరం ఒకరకంగా ఒక రకమైన సంకోచ వ్యాకోచాలలోకి పోతుంది. మీరు ఏదో మీ మానసిక చెత్తలో పూర్తిగా మునిగిపోతే తప్ప, దీనిని మీరు గుర్తించకుండా ఎలా ఉంటారు? మీరు ఈ ఆలోచనలో, మనో భావాలలో పూర్తిగా మునిగిపోతే తప్ప ఇలా జరగదు. మీరు ఏ ఆలోచనలు లేకుండా అలా కూర్చుంటే, మీరు శ్వాస ప్రక్రియను గమనించకుండా ఉండలేరు. ఇలా దేనినో మీ ఎరుకలోకి తీసుకోవటం అనేది, అదేదో మీరు చేసే ప్రక్రియ కాదు. దానిలో ఏ విధమైన ప్రయత్నమూ లేదు.

మేము ఏదైనా ప్రక్రియ నేర్పినప్పుడు, మేము ‘మీ శ్వాస మీద దృష్టి పెట్టండి’ అంటాము. ఎందుకంటే, కావాల్సినంత ఎరుక అక్కడ లేదు. అలా కాక, మీరు అలా (ఏ ఆలోచనలూ లేకుండా) కూర్చుంటే, మీరు మీ శ్వాస గురించి, గమనం లేకుండా ఉండలేరు. అందువల్ల మీరు మీ ఆలోచనలలో కొట్టుకు పోకండి, అవి అంత ముఖ్యమైనవి కాదు అవి చాలా తక్కువ సమాచారం నుండి వచ్చినవి. మీరు శ్రద్ధ పెట్టి ఉంటే, మీకు అది ఎంతో పెద్ద అవకాశానికి దారితీస్తుంది. ప్రస్తుతం అసలు శ్వాస ప్రక్రియ అనేది చాలామందిలో స్పృహలో లేదు. వారికి ముక్కులో, శ్వాసకోశంలో నుంచి గాలి వెళ్తున్నప్పుడు ఆ అనుభూతి గురించిన ఎరుకలో మాత్రమే ఉంటారు.

మీరు ఇలా కూర్చునో, పడుకునో పూర్తి నిశ్చలంగా ఉంటే, ఈ శ్వాస ఎంతో పెద్ద ప్రక్రియ అవుతుంది, ఇంకా అది ఎప్పుడూ ఉంటుంది. జీవితంలో ప్రతిక్షణం జరిగే దీనిని, అసలు ఇంత మంది గుర్తించకుండా ఎలా ఉంటారో అన్నది ఆశ్చర్యకరమైనది. మీ శ్వాస మీద ఊరికే దృష్టి పెట్టడం అనేది ఒక మార్గము. శూన్య ధ్యాన ప్రక్రియలోకి ఉపదేశం పొందిన వారు, ఏమీ చేయకుండా ఉండే ఈ ప్రక్రియలోకి వెళితే, అప్పుడు ఈ శ్వాసప్రక్రియ ఎంతో పెద్ద విషయం అవుతుంది. మీరు అది పోయేదాకా మీరు గుర్తించడంలేదు కానీ, ఈ శ్వాసప్రక్రియ నిజానికి ఎంతో పెద్ద విషయం.

మీరు ‘భజగోవిందం స్తోత్రం’ వినే ఉంటారు అక్కడ ‘నిశ్చల తత్వం, జీవన్ ముక్తిహి’ అంటారు. దాని అర్థం ఏమిటంటే, ఏదో ఒక దాని పట్ల ఏ మాత్రం చంచలత్వం లేకుండా శ్రద్ధ పెడితే, అది ఏదైనా కానీ, ముక్తి అనేది లేక జ్ఞానం అనేది మీకు అందకుండా ఉండదు. మరో మాటలో చెప్పాలంటే మనిషికి ముఖ్యమైన సమస్య, శ్రద్ధ లేకపోవడం. మీరు ఎంత శ్రద్ధ, ఎంత తీవ్రంగా పెడుతున్నారు, ఆ శ్రద్ధ వెనుక ఎంత శక్తిని ధారపోస్తున్నారు అని దానిమీదే ఆధారపడి ఉంటుంది. ఈ సందర్భంలో ఎప్పుడూ నడిచే, మీ జీవితాంతం నడిచే చాలా అందమైన ప్రక్రియ శ్వాస. శ్వాస ఎప్పుడూ ఉంది, మీరు దానిగురించిన ఎరుకతో ఉండాలి అంతే.

ప్రేమాశీస్సులతో,

సద్గురు