ప్రశ్న: సద్గురు ఆరు సంవత్సరాల క్రితం నేను ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాము చేస్తున్నప్పుడు నేను ఎంతో పారవశ్యంతో ఇదే నిర్వాణానికి మార్గం అని అనుకున్నాను. నేను అక్కడికి చేరుకుంటానని 'సంతోషంగా అనుకున్నాను. సరే తరువాత ఎవరో వచ్చి ‘‘లేదు, లేదు, ఇంకొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవికూడా నువ్వు చేయాలి’’ అన్నారు. నేను, సరే అని ఓపిగ్గా ఆ ప్రోగ్రామ్స్ అన్నికూడా చేశాను. తరువాత ‘మీరు ఎటువంటి ప్రయోజనాన్ని ఆశించకుండా మీరు ఈ సాధనను చేస్తూ ఉండండి’ అని మీరు చెప్పడం విన్నాను. సరే, నేను చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను ఎక్కడో చదివాను, ఇంకా విన్నాను అది ఏంటంటే ‘మీ ఎదురుకుండా ఒక క్షణమైనా సరే ఎవరైతే కూర్చుంటారో, అంటే మీతో ఉండే వాళ్లకి భీమా దొరికినట్టే’ అని మీరు చెప్పారు. వాళ్ళని మీరు కడతేరుస్తారని చెప్పారు. ఇప్పుడు నేను అయోమయంలో ఉన్నాను. ఇప్పుడు నేను ఇవన్నీ చేయాలా లేకపోతే ఎలాగైనా నాకు పాసుపోర్టు దొరికింది కదా అందుకని… ఇది మీరు నాకు నిజంగా చెప్పాలి.. సద్గురూ! నాకు తెలుసుకోవాలని ఉంది.

సద్గురు : ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారు అంటే రేపొద్దున్న లేచి నేను శాంభవి చేయాలా, అక్కర్లేదా? అని.  మీరు చేయాలి, మీరు చేయాలి, మీరు చేయాలి . మీరు నిర్వాణం అంటే ఏమిటో అర్ధం చేసుకోవాలి. 'నిర్వాణం అంటే ఉనికే లేకుండా ఉండడం అంటే మీరు లేకుండా పోవడం.' ఇది ముక్తికి ఒక రకమైన ప్రతికూల పదజాలం. ఇలాంటి పదాలు పదజాలం యోగాలో వాడతాము. యోగాలో అనుకూలమైన పదాలు, మంచి పదాలు, ప్రతికూలమైన పదాలు కూడా వాడతాం. కానీ గౌతముడు మాత్రం కేవలం ఇలాంటి పదాలనే వాడారు. ఎందుకంటే ఆయన తన పని తొందరగా ముగించుకోవాలని తొందరలో ఉన్నారు. ఆయన దీన్నంతా ఎంతో అందంగా చేయాలి అని ఆలోచించలేదు. ఈయన ప్రపంచాన్నంతా  మునులుగా, తాపసులుగా తయారుచేయాలని అనుకున్నారు. ఈయన స్త్రీలను ఆయన సంఘంలోకి ఎప్పుడు అనుమతించలేదు. ఎందుకంటే, ఆయన ఏమనుకున్నారంటే ఒకసారి పురుషులందరూ తాపసులు ఆయిపోయారనుకోండి అప్పుడు ఎలాగైనా సరే స్త్రీలకు ఇంక ఏమి చేయనవసరం లేదని అనుకున్నారు. కానీ అది అలా పనిచేయలేదు. ఆయన జీవితాన్ని తక్కువగా అంచనా వేశారు.

సరే, ఏది ఏమైనా,  'నిర్వాణం' అంటే "లేకుండా ఉన్నది, ఉనికి లేనిది".  మనకి యోగ శాస్త్రంలో ఇలానే నిర్వికల్ప ఇంకా ఎన్నో 'నిర్' తో మొదలయ్యే పదాలు ఉన్నాయి. కానీ ఎన్నో మంచి పదాలు కూడా ఉన్నాయి. ముక్తి, మోక్షం ఇలాంటి పదాలు. ఎంతో మంచి పదాలు. మిమ్మల్ని ప్రభావితం చేయాలి అనుకుంటే, అప్పుడు ఇలాంటి మంచి పదాలు వాడతాం. మీరు తగినంత ప్రభావితం అయ్యారు అనుకుంటే, అప్పుడు ఈ పదజాలం వాడం. ఇది ఎలాంటిది అంటే, మీకు ఇది తెలుసు కదా  - మీరు మీ భార్యను, భర్తను వివాహానికి ముందరగానే కలుసుకున్నారనుకోండి, మీరు వారితో కొన్ని విషయాలు చెప్తారు. కానీ పెళ్లి అయిన తరువాత, కొన్ని రోజుల తరువాత ఏది నిజమో అది చెప్పడం మొదలుపెడతారు. అందుకే మీరు ఇంట్లో జరుగుతున్నవి జాగ్రత్తగా వినవలసినవి.  ఎందుకంటే ఒక్కోసారి అవి నిజం కావచ్చు. ఒక్కోసారి అవి పక్షపాతంగా ఉండచ్చు. కానీ దీన్లో కొంత నిజం కూడా ఉండచ్చు. ఒక విషయం ఏంటంటే మీలో ఎన్నో అంశాలు ఉండి ఉండచ్చు. కానీ ఒక అంశాన్ని పట్టుకుని వాళ్ళు ఎప్పుడూ దాన్ని గురించే మాట్లాడుతూ ఉండి ఉండచ్చు. వేరే విషయాల గురించి పట్టించుకోకుండా.  కానీ, దానికి కూడా నిజం ఉంది కదా. ఎందుకంటే ఎటువంటి నటన లేనప్పుదే వారు మిమ్మల్ని ఎంతో దగ్గరగా చూస్తారు.

మీరు కేవలం మీ జీవితం జీవిస్తే చాలు. పొద్దున్న 'శాంభవి' చేసుకోండి, కొంచెం హఠ యోగా చేసుకోండి, మీ జీవితాన్ని జీవించండి.

బయట ప్రపంచంలో ఉన్నవారు మిమ్మల్ని మీరు బయట ప్రపంచానికి సిద్ధంగా ఉన్నప్పుడే చూస్తారు. కానీ ఇంట్లో ఉన్నవారు మాత్రం మీరు ఎటువంటి నటనకు సిద్ధంగా లేనప్పుడు, ఇంకా మీరు దుర్బలంగా ఉండే స్థితిలో చూస్తారు. నిర్వాణం అంటే ఏమి లేని స్థితి. మీరు ఎక్కడ నుంచి మాయమై పోవాలనుకుంటున్నారు? మీరు లేకుండా పోవాలనుకుంటున్నారా..? మీరు కోరుకునేది అదేనా?  చాలాసార్లు ఇంట్లో ఎన్నో విషయాలు జరిగినప్పుడు మీరు నేను లేకుండా పోతే బావుండు అనుకుంటారు అవునా కాదా? ఒకవేళ అదేదో చాలా ఎక్కువ అయిపోతుందనుకోండి, మీకు అవతల మనిషి ఎంతో ముఖ్యమైనప్పుడు, జరగవలసినవి సరిగా జరగకపోతుంటే మీరు లేకుండా పోవాలి అనుకుంటారు. కొంత కాలం తరువాత జరగవలసినవి సరిగ్గా లేవనుకోండి అవతల వారు లేకుండా పోతే బావుండు అని అనుకుంటారు(నవ్వులు). లేదులేండి, నేను కొంచెం మోటుగా చెప్తున్నాను అంతే.

సరే, మీరు విషయం అర్ధం చేసుకోవాలి. ఈ మానవ జీవితం ఎన్నో కోణాలతో ఎన్నో వ్యవస్థలతో వచ్చింది. భౌతికమైన వ్యవస్థలో, కొంచెం ఫై పైన ఉండే సాఫ్ట్ వెర్ ని మనం ప్రారబ్ధం అంటాం. ఇంకొంచెం లోతుగా ఉండే సాఫ్ట్ వెర్, దాన్ని మనం సంచితం అంటాం. ఇంకా బాగా లోతుగా నిశితంగా ఉన్న సాఫ్ట్ వెర్, ఇది విజ్ఞాన మయ కోశ పొరలలో ఉంటుంది. ఎన్నో పొరలు పొరలుగా ఈ వ్యవస్థలో ఉన్నాయి. ఈ జీవితం ఏవిటో దీన్ని ఇలా తయారుచేసే విధంగా ఎన్నో పొరలు ఉన్నాయి. ఈ జీవితం ఎంతో సున్నితమైనది.

ఈ అనేక పొరలలో ఉన్న వ్యవస్థలన్నీ పూర్తిగా విడదీసేయబడాలి. ఇది కనక లేకుండా పోవాలి అనుకుంటే మీరు కేవలం భౌతిక వ్యవస్థను మాత్రం విడదీసేశారనుకోండి మిగతావన్నీ అలానే ఉంటాయి. అవన్నీ కూడా విడదీయడం ఇంకా ఈ సూక్ష్మమైనవి ఇవన్నీ భౌతికమైన వాటికంటే ఇంకా ఎంతో బలమైనవి. భౌతిక వ్యవస్థ ఏముంది తల మీద ఒక్కటి ఇస్తే అంతే అది విరిగిపోతుంది. కానీ మిగతావన్నీ అలాంటివి కాదు. అవన్నీ సూక్ష్మమైనవి. ఇంకా ఎంతో బలమైనవి కూడా. సహజంగా మీకు అవన్నీ ఏమిటో అన్న ఎరుక లేదు. అందుకని అవి ఎలా విడదీసుకోవాలో మీకు తెలీదు.
అందుకని నేను మీరు ఒక్క క్షణం నాతో పాటు కూర్చున్నారు అంటే వేరే  ఆలోచించకుండా మీరు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నట్లయితే అప్పుడు మీరు వీటన్నిటి గురించి కూడా మీరు చింతించక్కరలేదు.

మీరు కేవలం మీ జీవితం జీవిస్తే చాలు. పొద్దున్న 'శాంభవి' చేసుకోండి, కొంచెం హఠ యోగా చేసుకోండి, మీ జీవితాన్ని జీవించండి. ఇది ఎందుకు చెయ్యాలి అంటే ఇది ఈ జీవితం జీవించడానికి. మీకు తొందరగా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని ఉందనుకోండి దానికి మరో విధమైన సాధన ఉంది. అది కూడా చేయచ్చు. కానీ నేను అది మీకు చెప్పడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే ఇవాళ్టి ప్రపంచంలో అలాంటివి చేస్తే నాకు సమస్యలు ఎదురౌతాయి. అందుకని మీరు ఈ సాధనను ఒక స్థాయిలో చేయండి.

మీరు ఈ పాములు నిచ్చెనలు ఉండే ఆట ఆడారా?  "వైకుంఠపాళి " ? ఇప్పుడు ఈ ఆటలో మీరు ఐదు వేస్తే పైకి వెళ్తారు, ఆరు పడింది మీరు కిందకు దిగి వచ్చేస్తారు మళ్ళీ పైకి వెళ్తారు, మళ్ళీ మూడు వేశారు మళ్ళీ కిందకు వచ్చారు మళ్లీ నాలుగు వేస్తారు ఇంక ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ చివరి వరుస, ఆఖరి లైను ఒకటి ఉంది ఒకసారి మీరు అక్కడకు వెళ్ళారనుకోండి ఇంక అక్కడినుంచి కిందకు వచ్చే ప్రసక్తే లేదు. కాకపోతే అక్కడినుంచి ఒకటి,ఒకటి, ఒకటి పడాలి.

మీరు ఈ కిందకు రాకుండా నేను మిమ్మల్ని చూసుకోగలను కానీ మీరు ఈ ఒకటి, ఒకటి, ఒకటి వేసుకోవడం అన్నది మీ బాధ్యత.

అందుకని ఒకసారి మీరు ఆ చివరి వరుస లోకి వచ్చిన తరువాత ఇంక కిందకు వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే మీరు ఆ చివరి గడిలో ఉండేలాగా. కానీ అక్కడినుంచి ఒకటి ఒకటి ఒకటి వేసుకుంటేనే మీ ఆట పూర్తి అవుతుంది. లేకపోతే మీరు అక్కడే కూర్చునే ఉంటారు. కింది వరుసలో ఆడుతున్నవారు పైకి వచ్చేసి మీకంటే ముందరే ముందుకు వెళ్లిపోవచ్చు. కానీ మీరు ఇంకా అక్కడే కూర్చుని ఉండచ్చు. మీరు అలా ఒకటి, ఒకటి, ఒకటి వేసుకోకపోతే అలాగే ఉండిపోవచ్చు. కాకపొతే కిందకు వచ్చే ప్రసక్తి ఉండదు. మీరు ఈ కిందకు రాకుండా నేను మిమ్మల్ని చూసుకోగలను కానీ మీరు ఈ ఒకటి, ఒకటి, ఒకటి వేసుకోవడం అన్నది మీ బాధ్యత. దీనికి మీరు ఏం చేయక్కరలేదు ఊరికే అక్కడ ఎదురు చూస్తూ ఉండాలి . మీకు కావాల్సిన ప్రతిభ ఏమి లేదు, ఊరికే దాన్ని అలా వేస్తూ వేస్తూ ఉంటే ఎప్పుడో ఒకటి, ఒకటి వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఏదో ఒకటి అవుతుంది. కానీ ఇందులో ఉన్న భీమా ఏంటంటే - మీరు కిందకి జారిపోరు.

ఒకసారి కనక మీరు కిందకు వెళ్ళరు అన్న ధీమా మీకు ఉంటే ఏమీ జరగదు, మీకు కొంచెం సమయం కావాలి అంతే. కాని అది ఒక అవకాశమే..! అయితే, కొంత సమయం మీరు అంత పైకి వెళ్లి భూమ్ అని కిందకు వచ్చేసే అవకాశం ఉందనుకోండి అప్పుడు మీకు వేరే విధమైన ఆత్రుత, వేరే విధమైన ఒత్తిడి ఉంటుంది.

మేము మీకు ఏమి హామీ ఇవ్వగలం అంటే మిమ్మల్ని పై వరుసకు తీసుకు వెళ్ళగలం. కానీ అక్కడ మీరు ఎదురుచూడాలి. ఎందుకంటే ఇంకా వేరే వాళ్లు లైన్ లో ఉన్నారు కదా మీకు అక్కడ ఒకటి, ఒకటి అలా పడాలి.  దీనికి ఏమి నైపుణ్యం అవసరం లేదు. మీరు పొద్దున్న హఠ యోగ చేయండి, ఎందుకంటే మీ ఎముకలు త్వరగా బిగిసి పోకుండా ఉండటానికి. శాంభవి చేయండి, ఎందుకంటే జీవితం చైతన్యవంతంగా ఉండడం కోసం, ఇంక ఎదురు చూడండి కనీసం కిందకు వెళ్ళరు. అది మీ జీవితం లో లేదు.

ఇది మీకు సరిపోదా? నా అంతట నేనే కనుక ఇది పగులగొట్టాలనుకోండి, అది చేయకూడదు అని కాదు కానీ మేము అలాంటి పనులు చేయం. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రతి జీవం కూడా మార్గం కనుక్కోవాలి. అంతవరకు కల్పించుకోవక్కర్లేదు అనవసరరంగా. మేము కనుక అలాంటి పని చేసినట్లయితే ఎవరికైతే ‘భౌతిక శరీరం లేదో’ అలాంటి వారితో మాత్రమే చేస్తాం. ఎవరికైతే శరీరం ఉందో వారితో మేము అలాంటి పనులు చేయం. మీ జీవితంలో కొంత భాగమైనా మీరు పాలుపంచుకోవాలి, అది మీ విధి, కాదా?

ప్రేమాశిస్సులతో,
సద్గురు.