పిల్లల పెంపకం ప్రతీ తల్లిదండ్రుల జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. పిల్లలు పుట్టిన తరువాత తల్లిదండ్రుల జీవితం అంతా పిల్లల చుట్టే తిరుగుతూ ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో. ఒక సందర్భంలో పిల్లల పెంపకం గురించి సద్గురు ఐదు సూత్రాలను తెలియజేసారు. ఈ సూత్రాలలో  మూడవ సూత్రాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.


సూత్రం - 3 : మీ పిల్లల నుండి మీరు నేర్చుకోండి

చాలామంది తల్లిదండ్రులు   పిల్లలు పుట్టగానే, వారు భోధించడం మొదలు పెట్టాలనుకుంటారు. నిజానికి, పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు, అది మనం వారికి భోధించాల్సిన సమయం కాదు, వారి నుండి మనం నేర్చుకోవాల్సిన సమయం. ఎందుకంటే మీరు మిమల్ని, మీ పిల్లల్ని పరిశీలించి చూస్తే, ఎవరు ఎక్కువ అనందంగా ఉంటారు ? మీ పిల్లలే కదా? అందుకని, అది వారి నుండి మనం నేర్చుకునే సమయమే కానిీ, మనం వారికి నెర్పే సమయం కాదు.

parenting3

  జీవితం విషయానికి వచ్చేసరికి, మీ పిల్లవాడికే మీకంటే ఎక్కువ తెలుసు

మీరు మీ పిల్లలకి నేర్పగలిగేది ఏదైనా ఉందంటే అది ఎలా బ్రతకాలి అనేది మాత్రమే. అది కూడా కొంత వరకే. కాని జీవితం విషయానికి వచ్చేసరికి, మీ పిల్లవాడికే మీకంటే ఎక్కువ తెలుసు. పిల్లవాడు తనంతట తానే జీవితాన్నిఅనుభవంతో తెలుసుకుంటాడు. తనే జీవ చైతన్యమని అతడికి బాగా తెలుసు. మీరు మీ మనస్సు మీద బలవంతంగా ఆపాదించిన నిర్బంధాలన్నీ తొలగించి చూస్తే, మీ ప్రాణ శక్తికి కూడా ఎలా ఉండాలో తెలుస్తుంది.మీరు కూడా అంత హాయిగా ఉంటారు. కాని మీ మనసుకే ఆ నిర్బంధాలని వదిలి ఎలా ఉండాలో తెలీదు. పెద్దవారే లేనిపోనివి ఊహించుకొని కష్టాలని అనుభవిస్తారు. పిల్లలు అలా చేయరు. కాబట్టి మీరు వారికి శిక్షణ ఇవ్వనవసరం లేదు . మీరే వారికి శిష్యులై వారిలా స్వచ్చంగా, ఆనందంగా ఉండటం నేర్చుకోవాలి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

https://pixabay.com/en/animal-elephant-baby


పిల్లల పెంపకం గురించి సద్గురు అందించిన మొదటి సూత్రాన్ని ఇక్కడ చదవండి!

పిల్లల పెంపకంలో మెళకువలు - 1/5 - అనుకూల వాతావరణాన్ని కల్పించండి!

పిల్లల పెంపకం గురించి సద్గురు అందించిన రెండవ సూత్రాన్ని ఇక్కడ చదవండి!

పిల్లల పెంపకంలో మెళుకువలు 2/5 -మీ పిల్లల అవసరాలు తెలుసుకోండి!

పిల్లల పెంపకం గురించి సద్గురు అందించిన నాల్గవ సూత్రం ఇక్కడ చదవండి!

పిల్లల పెంపకంలో మెళకువలు – 4/5 - పిల్లలని స్వేచ్ఛగా, స్వతంత్రంగా పెరగనివ్వండి!