మీ నాయకత్వం యాదృచ్ఛికమైనదైతే, అది ఒక గొప్ప మార్గదర్శకత్వం లేక సామర్ధ్యం వల్ల వచ్చింది కాకపొతే అలాంటప్పుడు నాయకత్వం లేకపోవటమే మంచిదని నేను అనుకుంటున్నాను. ఒక మూర్ఖమైన నాయకుడు ఉండటం కంటే అసలు నాయకుడే లేకపోతే జనాలు ఎదోకటైనా చేస్తారు కదా? ఒక మూర్ఖమైన నాయకుడు ఉపద్రవాన్ని తీసుకురాగలడు, అదే ఆ నాయకుడు లేకపోతేనే జనాలకు ఎక్కువ మేలు జరగవచ్చు. అది కొంచం గందరగోళంగా ఉండచ్చు, అయినా కూడా వాళ్ళు ఏదైనా మంచి పనే చేయచ్చు. ముఖ్యంగా నాయకుడు అంటే అర్ధం ఏమిటంటే మీకు తెలిసో తెలియకో చాలా మంది ప్రజల భవిష్యత్తును మీ చేతులోకి తీసుకోవటం. మీరు ఆ బాధ్యతను తీసుకున్నట్లే. నాయకుడు అని నేను అన్నప్పుడు మీరు ఒక దేశానికో లేక ఒక పెద్ద ప్రజల సమూహానికో నాయకుడు కానవసరం లేదు. మీరు ఒక కుటుంబాన్ని నడుపుతున్నారా; అయితే మీరు కూడా ఒక నాయకుడే, అవునా? ఒక విధంగా మీరు మరో ఇద్దరి జీవితాలను మీ చేతిలోకి తీసుకున్నారు, అవునా?

ముఖ్యంగా నాయకుడు అంటే అర్ధం ఏమిటంటే మీకు తెలిసో తెలియకో చాలా మంది ప్రజల భవిష్యత్తును మీ చేతులోకి తీసుకోవటం 

కనుక మరొక జీవి బాధ్యతను మీరు తీసుకున్నారంటే మీరు కూడా ఒక నాయకుడే. అది ఏ పరిమాణంలో ఉంది అనేదే ప్రశ్న. ఎవరి సామర్ధ్యాన్ని బట్టీ వాళ్ళు ఆ పరిమాణంలో నాయకత్వాన్ని ఎంచుకుంటారు కాని అందరూ ఎదో ఒక విధంగా ఒక నాయకుడే. కనీసం మీ భవితవ్యాన్ని మీ చేతిలోకి తీసుకున్నా కూడా మీరు ఒక నాయకుడే కదా? మీరు ఒక హోబో అయితే మాత్రమే మీరు ఒక లీడర్ అవ్వలేరు. హోబో అంటే ఏమిటో మీకు తెలుసా? అమెరికా నుంచి వచ్చిన ఒక పర్యాటకుడు యూకే ను సందర్శించటానికి వచ్చాడు. స్థానికంగా ఉండే ఒక వ్యక్తి అతనితో మాట్లాడుతూ ఒక బంగళా గురించి చెప్తూ ఇలా అన్నాడు, “ఇక్కడ ఒక దొర(అరిస్త్రోక్రాట్) ఉంటాడు.”

ఈ అమెరికన్ “అంటే ఏమిటి?” అని అడిగాడు...."దొర(అరిస్త్రోక్రాట్) అంటే తెలియని ఒక వ్యక్తి ఉంటాడా?", అని ఈ ఇంగ్లీష్ వ్యక్తి ఆశ్చర్యపోయాడు.
“ఓహ్, మీకు దొర అంటే తెలియదా? దొర అంటే అతను ఏ పని చేయనవసరం లేదు. అన్నీ అతనికి ఏదోక విధంగా వస్తాయి. అతనికి ప్రతీ సారి ఎక్కడో ఒక మంచి స్థానమే ఉంటుంది. అతను ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి స్థానం దొరుకుతుంది, పైగా అతను ఏ పని చేయడు, అతను వేరే వారి మీద ఆధారపడి బ్రతుకుతాడు.” అని ఆ ఇంగ్లీష్ వ్యక్తి అన్నాడు. ‘ఓహ్ అలాగా, అమెరికాలో మేము వారిని హోబో అని అంటాము.’

అదీ హోబో అంటే. మీరు ఒక హోబో అయితే తప్ప ఎదో ఒక స్థాయిలో మీరు ఒక నాయకుడే కదా? ఒకసారి మీరు ఒక నాయకుడే అని మీరు అర్ధం చేసుకున్న తరువాత, అంటే మీరు మీ భవితను మీ చేతిలోకి తీసుకున్నా లేక కొంత మంది జీవితాల్ని మీ చేతిలోకి తీసుకున్నా సరే, ఇది ఒక బాధ్యతే.

మీరు ఒక బృందానికి నాయకత్వం వహించాలంటే మీరు మొదటిగా చేయాల్సింది వాళ్ళందరూ మీతో ప్రేమలో పడేలా చేయడం. 

మీరు ఒక బృందానికి నాయకత్వం వహించాలంటే మీరు మొదటిగా చేయాల్సింది వాళ్ళందరూ మీతో ప్రేమలో పడేలా చేయడం. అవునా? అయితే మనం దాన్ని ఎలా చేయాలి? వాళ్ళకి ఒక ప్రేమ టాబ్లెట్ ఇవ్వాలా? అలాంటివేవి లేవు కదా. వాళ్ళందరూ మీతో ప్రేమలో పడాలంటే ముందుగా మీరు వాళ్ళందరితో ప్రేమలో పడాలి. తక్షణమే పడాలి. మీరు వెంటనే పడాలి, వాళ్ళు వాళ్ళకి అవసరమైనంత సమయం తీసుకుంటారు. వాళ్ళు మెల్లిగా, చాలా మెల్లిగా దగ్గరవుతారు. వారికి ఆ అవకాశం ఉంది. మీరు ఒక సారి లీడర్ అవ్వగానే మీకు ఆ స్వతంత్రం లేదు; ఆ అవకాశం ఉంది వాళ్ళకే అని మీరు అర్ధం చేసుకోవాలి. కానిఆ అవకాశం మీకు లేదు.

మీ జీవితంలో రోజూ ఎక్కువ సమయం గడిపేది అక్కడే కదా. మీరు మరెక్కడైనా కంటే మీరు పని చేసే చోటే ఎక్కువ సమయం గడుపుతారు కదా? మీలో చాలా వరకూ ఇంతే కదా? మరే ఇతర విషయం కంటే మీరు పని చేసే చోట గడిపే సమయమే ఎక్కువ. ఇది ఇలా ఉన్నప్పుడు ఇది ఒక అందమైన అనుభూతిగా మార్చుకోవటం ముఖ్యమే కదా?

ప్రేమాశీస్సులతో,
సద్గురు