ప్రశ్న: అసలు ఇది ఎందుకు? మనందరం ఎల్లప్పుడూ కూడా ముక్తిని పొందాలనుకుంటున్నాము. మనం దేని నుంచి ముక్తిని పొందాల కుంటున్నాం? మనం ముక్తిని పొందడం కోసం ఎందుకు ఎదురు చూస్తున్నాము.

సద్గురు: మీలో అనంతమైపోవాలనుకునేది ఏదో ఉంది. మీకు అనంతమవ్వాలన్న ఆకాంక్ష కలిగినప్పుడు ఏ పరిమితి ఉన్నా సరే అది మీకు బంధనే కదా! మీరు కనక దాని పట్ల ఎరుకతో ఉన్నా, లేకపోయినా ఈ బంధనవల్ల కలిగే ప్రభావం మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. కొంతమంది దీన్ని ఎరుకతో చూస్తారు, “నేను ఈ విధంగా ఎందుకు ఇలా బంధించబడి ఉన్నానో” అని. కొంతమంది వారి చుట్టూరా ఉన్న వారితో కేవలం కోపం తెచ్చుకోవడం ద్వారా దీన్ని చూస్తారు. ఇది జరగడం మీరు గమనించారా? కొంతమంది మనుషులు ఒక నిర్బంధనను అనుభూతి చెందినప్పుడు, “నేను ఎందుకు నేను నిర్బంధనను అనుభవిస్తున్నాను” అని ఆలోచిస్తారు. కొంత మందికి అది తెలియనే తెలియదు. వారికి ఇలా నిర్బంధనగా అనిపించినప్పుడు, వారు కోపం తెచ్చుకుంటారు. ఇది వివిధ రకాలుగా వ్యక్తపరచడం. కానీ,మౌళికమైన ఆకాంక్ష ఏవిటంటే మీరు ఈ బంధనల నుంచి విముక్తి పొందాలని.

ఈ భూమికి కట్టేయాలనుకునే తాళ్లను - వాటిని మీరు తెంచేసుకోవడం నేర్చుకుంటే అప్పుడు పైకి వెళ్లడం అనేది అదే జరుగుతుంది

మిమ్మల్ని ఏదైతే అందుకు అనుమతించడం లేదో అది నిర్బంధనే. అది బంధనే. ఇప్పుడు మనం బంధనాలు తొలగించుకోవడం గురించి మాట్లాడదాం. ఎందుకంటే ముక్తి గురించి మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. మీకు అది ఏవిటో తెలీదు. మీకు అపరిమితత్వం అంటే ఏవిటో తెలీదు. మీకు తెలిసిందల్లా  మీ పరిమితులే. ఇప్పుడు మీరు ఆకాశానికి వెళ్లాలనుకున్నారనుకోండి, మీరు ఆకాశం గురించి ఆలోచించకూడదు. మిమ్మల్ని ఈ భూమి మీద ఏది పట్టి ఉంచుతోందో దాన్ని అర్ధం చేసుకోవాలి. మిమ్మల్ని ఈ భూమికి కట్టేయాలనుకునే తాళ్లను - వాటిని మీరు తెంచేసుకోవడం నేర్చుకుంటే అప్పుడు పైకి వెళ్లడం అనేది అదే జరుగుతుంది. కానీ మీరు ఎల్లప్పుడూ అపరిమితత్వం గురించి ఊహించుకుంటూ ఉంటే మీరు ఊహల్లో మునిగిపోతారు తప్పితే, అక్కడికి ఎప్పటికి చేరుకోలేరు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు