మహాభారతం సిరీస్ లోని నాల్గవ భాగంలో మానవ వ్యవస్థలోని వివిధ రకాల అగ్నులు,  వాటిని పరివర్తన చేయగల అవకాశాల గురించి సద్గురు  వివరిస్తున్నారు.

Sadhguruమన సంప్రదాయంలో అనుకూలమైన పరిస్థతులు సృష్టించాలనుకుంటే మొట్ట మొదట మనం చేసేది దీపం వెలిగించడం. మీలో ఎంతమంది రోజూ దీపం వెలిగిస్తారు? కేవలం దీపం వెలిగించి మీరు అక్కడ కూర్చుంటే - ఏ దేవుడినీ నమ్మనవసరం లేదు - అది మార్పు తీసుకు వస్తుందా?  దీపం వెలిగించిన వెంటనే దీపపు జ్వాల చుట్టూ ఒకరకమైన లింగ శరీరం సహజంగా ఏర్పడుతుంది. అలా లింగ శరీరం ఉన్న ప్రదేశంలో ఉత్తర, ప్రత్యుత్తరాలు చేయడానికి పరిస్థితులు మెరుగవుతాయి. మీరు భగవంతుడితో సంభాషించడానికి ముందు తగిన వాతావరణం సృష్టించాలి. అదిలేనప్పుడు మీరు ఒక గోడతో మాట్లాడుతున్నట్లవుతుంది.

ఆరుబైట మంట వేసి (camp fire)దాని చుట్టూ కూర్చుని చెప్పుకున్న కధలకు ఎక్కువ ప్రభావం ఉంటుందని మీరు ఎప్పుడైనా గమనించారా? వెనుకటి కధాకారులకి ఈ విషయం తెలుసు. పరిసరాలనూ, కధను కూడా మీరు మెరుగ్గా స్వీకరించడానికి చేసే చిన్న చిన్న ప్రయత్నాలు ఇవి. మీరు తగినంతగా ధ్యానం చేస్తే మీ చుట్టూ లింగ శరీరం పెరుగుతూ ఉంటుంది.

అగ్ని వివిధ రకాలు. జీవితమే జ్వాల. సూర్యుని అగ్ని వల్లనే ఈ గ్రహం మీద జీవనం సాధ్యపడుతున్నది. మానవ శరీరంలో అగ్ని, జఠరాగ్నిగా వ్యక్తమౌతున్నది. మీకు ఆకలి వేసేది జఠరాగ్నివల్లనే. జీర్ణకోశంలోని అగ్ని, లైంగిక పరమైన అగ్ని. జీర్ణకోశంలోని అగ్ని సంతృప్తి చెందిన తరువాతనే లైంగిక అగ్ని రాజుకుంటుంది. ఆకలి కడుపుతో ఉన్న వాడికి లైంగిక పరమైన ధ్యాస ఉండదు. జఠరాగ్నిని పరివర్తన చేస్తే అది చిత్తాగ్నిగా మార్పు చెందగలదు. బుద్ధి పరంగా పదును పెరుగుతుంది. మీ బుద్ధి పెరుగుతున్నందు వల్ల, ఆహార, లైంగిక సంబంధమైన ఆసక్తి తగ్గుతుంది.

యోగులను కొంత కాలం పూడ్చి పెట్టడం, (కొద్దిసేపు ఉపిరి ఆపి వేయడం, గుండె ఆపివేయడం)  వారు విషం లేక పాదరసం త్రాగడం వంటి విషయాలు మీరు వినే ఉంటారు.

ఈ చిత్తాగ్నిని భూతాగ్నిగా పరివర్తించవచ్చు. భూతాగ్ని మౌలికమైన అగ్ని. యోగి మౌలికపరమైన అగ్నితోనే ఉంటాడు. యోగులను కొంత కాలం పూడ్చి పెట్టడం, (కొద్దిసేపు ఉపిరి ఆపి వేయడం, గుండె ఆపివేయడం)  వారు విషం లేక పాదరసం త్రాగడం వంటి విషయాలు మీరు వినే ఉంటారు. ఇవన్నీ వారు యోగులని చూపించుకోవడానికే, ఎందుకంటే యోగులు కాకుంటే ఇవి వారికి మరణం తెస్తాయి. మీ భూతాగ్ని పదునుగా, క్రియాశీలంగా లేకపోతే మీరు పంచభూతాలను స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదు. సర్వాగ్ని అని మరొకటుంది- ఇప్పుడు దాని జోలికి మనం వెళ్ళవద్దు. ఈ మూడింటిలో, ప్రతి ఒక్కరిలోనూ కొంత జఠరాగ్ని ఉండి తీరుతుంది.

చితాగ్ని ప్రజ్వరిల్లితే మీ మేధస్సు అగ్నిలా ఉండగలదు - అది మీ తావుని వెలుగులతో నింపుతుంది. కామిక్ పుస్తకాలలో కూడా ఒక పాత్రకి కొత్త ఆలోచన వచ్చినప్పుడు దానిని లైటు బల్బుతో పోలుస్తారు, ఎందుకంటే మేధస్సు రగులుకుంటే అకస్మాత్తుగా వెలుగు వస్తుంది. దీనితో మీరు వేడిని కూడా పొందవచ్చు. మౌలికాగ్ని మీలో రగులుతుంటే అది వేరుగా ఉంటుంది- అది సీతలాగ్ని. మీలో మౌలికాగ్ని ఉన్నప్పుడు, జీవిన ప్రక్రియ మీద మీకు పట్టు ఉంటుంది. ఎలా జన్మిస్తారో, ఎలా జీవిస్తారో, ఎలా మరణించాలనుకుంటున్నారో లేక మరణించ కూడదనుకుంటున్నారో, ఇక ఇవన్నీ మీ ఎంపిక అవుతాయి.

ఈ కధతో పాటు, ఈ అవకాశం ఉపయోగించుకుని, మీరు మీ జఠరాగ్నిని చితాగ్నిగా, చితాగ్నిని భూతాగ్నిగా మార్చుకోవాలని నా కోరిక.

మహాభారతంలో మీకు మూడు రకాల వ్యక్తులు తటస్థపడతారు. విపరీతమైన జఠరాగ్నితో రగులుతూ ఉండేవారు - తినాలన్న కోరిక, సొంతం చేసుకోవాలన్న కోరిక, లైంగిక పరమైన కోరిక, జయించాలన్న కోరిక. ఇంకొందరు అసాధారణమైన చిత్తాగ్ని కలిగి ఉన్నారు. వారి బుద్ధి ఎటువంటిదంటే మామూలు మనుష్యులు 1000 సంవత్సరాల తరువాత చూడగలిగినది వీరు ఇప్పుడే  చూడగలరు. ఇంకొందరు భూతాగ్ని కలిగి ఉన్నారు. వీరికి తమ జీవితంపై పూర్తి పట్టు ఉంది. ఎప్పుడు, ఎలా పుట్టాలి, ఎలా జీవించాలి, ఎప్పుడు మరణించాలి, జీవన మరణ ఎంపికలు కూడా వీరి చేతుల్లోనే ఉంది. ఈ మూడు రకాల మనుష్యులను కలసినప్పుడు మీరు వారిపై న్యాయాన్యాయ నిర్ణయాలు చేయకండి. వీరందరికీ పోషించవలసిన పాత్రలున్నాయి.

ఈ కధతో పాటు, ఈ అవకాశం ఉపయోగించుకుని, మీరు మీ జఠరాగ్నిని చితాగ్నిగా, చితాగ్నిని భూతాగ్నిగా మార్చుకోవాలని నా కోరిక. మనం ఒక ప్రాధమిక భూతశుద్ధి ప్రక్రియని చేద్దాము, అది మీలో కొంత భూతాగ్నిని చేర్చుతుంది. మీలో భూతాగ్ని ఉండడంవల్ల లాభమేమిటంటే మీరు దీపం వెలిగించనవసరంలేదు, యగ్న హోమాలు చేయనవసరం లేదు గుళ్ళూ, గోపురాలకు వెళ్ళనవసరం లేదు. నేను మీరు చేయనవసరం లేదు అంటున్నాను, చేయకూడదు అని కాదు ఎందుకంటే మీలో మౌలికాగ్ని ఉన్నప్పుడు మీ అంతట మీరే అస్థిత్వం అయిపోతారు.

ఈ కధలో, కృష్ణుడు ఈ మూడు అంశాలకు మధ్యా తిరగటం, సమర్ధించటం మీరు చూస్తారు.

ఈ కధలో, కృష్ణుడు ఈ మూడు అంశాలకు మధ్యా తిరగటం, సమర్ధించటం మీరు చూస్తారు. జఠరాగ్నితో ఉండాలని కోరుకుంటే మొత్తం జఠరాగ్నిగా - తినడం, పోరాడటం, ప్రేమించడం మరెవ్వరూ చేయనట్లుగా చేస్తాడు. చితాగ్నిగా ఉన్నప్పుడు అతనికి మించిన ముందు చూపు ఉన్నవారు లేరు. భూతాగ్నిగా ఉంటే సంపూర్ణంగా అదే. మూడు ఆటలలో దిట్ట. మీరు మూడింటినీ కొద్దిగానన్నా స్పృశించాలని నా కోరిక.

భారత అధ్యాత్మిక సంప్రదాయంలో యోగులు తమ జఠరాగ్నిపై, చిత్తాగ్నిపై పట్టు సాధించి పూర్తిగా భూతాగ్నిగా మారదలచినప్పుడు, వారు తమ సొంత అగ్నిని దగ్గరుంచుకుంటారు, సామాన్యంగా దానిని ధుని అంటారు. ఆ అగ్నిచుట్టూ ఉండేది, ఆ అగ్ని కన్నా ఎంతో ముఖ్య మైనది. ప్రాధమికంగా, భూమికి సంబంధించిన ఒక వస్తువు మండడం వల్లనే అగ్ని పుడుతుంది మన ఆసక్తి దాని మీద కాదు. దాని చుట్టూ ఒక రెండంగుళాల శక్తివంతమైన లింగరూపం గోళం ఉంది, అది మరింత శక్తివంతమైనది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు