భారతదేశంలో ప్రేమను, ఆప్యాయతను భౌతికంగా చూపించడం అంత ఎక్కువగా ఉండదని,  ప్రేమను వ్యక్త పరచడం ఒక నిర్బంధంలా కాక, మనం దీన్ని ఎరుకతో చేయడం ఎంత ముఖ్యమో ఇక్కడ మనకి వివరిస్తున్నారు. భారత సంస్కృతిలో మనం ప్రేమను, ఆప్యాయతను భౌతికంగా వ్యక్త పరచడం పాశ్చాత్య దేశాలలో కంటే తక్కువ. సద్గురు, “ఒకర్ని కౌగిలించుకోవడం అన్నది మనం ఎరుకతో చేయాల్సిన పని అది నిర్బధంగా మారకూడదు” అని మనకి ఇక్కడ సద్గురు చెప్తున్నారు.

ప్రశ్న :- భారత సంప్రదాయంలో భౌతికంగా ఒకరినొకరు తగలడం, ముట్టుకోడం అన్నది అంత సాధారణంగా జరగదు. ఉదాహరణకి యూ.ఎస్ లో ఇది ఎక్కువగా ఉంటుంది. మనం మన కుటుంబానికి చెందనివారితో భౌతికంగా స్పర్శ  పట్ల మీ అభిప్రాయం ఏంటి సద్గురు?

సద్గురు :- ప్రజలకి వారి భావాలను ఎల్లప్పుడూ వ్యక్త పరుచుకోవాలని ఉంటుంది. అలానే ఎంతోమంది ప్రజలకు, వేరే వారు వారి పట్ల అటువంటి భావాలు ప్రదర్శించాలన్న అవసరం కూడా ఉంటుంది. మీరు కనక భారత సంస్కృతికి చెందిన వారైతే సహజంగానే మీకు ఇటువంటి ఆవశ్యకత ఉండదు. ఎందుకంటే మనలో చాలామంది ఇంటి దగ్గర చాలా గారాబం చేయబడుతూ ఉంటాం. అందుకని బయటకు వచ్చినప్పుడు మనకది అంత అవసరంగా అనిపించదు. ఇది కేవలం ఒక సాంప్రదాయానికి చెందింది  మాత్రమే కాదు. ఇది మనిషికి వ్యక్తిగతంగా ఉండే ఆవశ్యకత.

కౌగిలి అనేది మీరు వేరే వారిని మీలో ఇముడ్చుకోడం. అది ఉన్నపళ్ళంగా, సహజంగా జరగాలి.

కౌగిలి అనేది మీరు వేరే వారిని మీలో ఇముడ్చుకోడం. అది ఉన్నపళ్ళంగా, సహజంగా జరగాలి. మీకు నిజంగా ఎవరినైనా కౌగిలించుకోవాలి అనిపిస్తే అది అద్భుతం. కానీ అది ఒక సామాజికమైన నియమమో, నిబద్దతో అవ్వక్కరలేదు. మీరు ఎవరినైనా చూసినప్పుడల్లా వారిని కౌగిలించుకోవాలి అన్నది ఒక సామాజిక నిబద్ధతగా మారక్కరలేదు. అది అలా జరిగినప్పుడు అందులో ఉన్న సౌందర్యం కాస్త పోతుంది. ఒకరిని కౌగలించుకోవడమో, ముట్టుకోవడమో అన్నది కచ్చితంగా అంత మంచి పని కాదు. ముఖ్యంగా మీరు మీ శక్తిని ఒక నిర్దిష్ట విధానంలో ఉంచుకోవాలి అనుకున్నప్పుడు మీరు భౌతికంగా ప్రతిరోజు ఎక్కువమందిని ముట్టుకోవడం అనేది మీకు అంత సహకారంగా ఉండదు. కానీ అది మీ మనస్సులో ఒక లోతైన భావనగా ఏర్పడి మీకు వేరే వారి గురించి అలా అనిపించినప్పుడు, అలా చేయడం ఎంతో అందమైన పని.

ప్రేమాశీస్సులతో,
సద్గురు