భారతీయ సంప్రదాయంలో శివుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. వాటిలో ప్రతీ ఒక్కటీ అంతర్గత పరిణితికి ఒక శక్తివంతమైన అవకాశాన్ని సూచిస్తుంది. వీటిలోకొన్నిరూపాల వెనుక ఉన్న అంతరార్ధాన్నిసద్గురు మనకి వివరించారు.  ఆ రూపాలను గురించి మనం ఈ వారం ఈ సీరీస్ లో  తెలుసుకుందాం....వీటితో పాటు సౌండ్స్ ఆఫ్ ఈశా వారి త్రిగుణ్ సిడి నుంచి మీకు ఓ స్తోత్రాన్ని కూడా అందిస్తున్నాం..విని ఆనందించగలరు..!!


కాలభైరవుడు - ఇది ఒక రౌద్ర రూపం..!!

కాలభైరవుడు  శివుని ఒక రౌద్ర రూపం – కాలాన్ని నాశనం చేయడం కోసం ఆయన చేరుకున్న స్థితి. భౌతిక వాస్తవాలన్నీ కాలంలోనే ఉంటాయి.ఇప్పుడు నేను మీ కాలాన్ని నాశనం చేస్తే, ఇక అన్నీ అయిపోయినట్లే కదా ?

అంతిమ క్షణం వచ్చినప్పుడు ఎన్నో జన్మలలో అనుభవించ వలసిన నొప్పి, బాధ ఒక్క క్షణంలోనే ఒకేసారి ఎంతో తీవ్రంగా జరిగిపోతాయి.

భైరవ యాతనను సృష్టించటానికి తగినట్లుగా తయ్యారయ్యి శివుడు, కాలభైరవుడిగా మారాడు. “యాతన” అంటే భరించలేని వేదన అని అర్ధం. అంతిమ క్షణం వచ్చినప్పుడు ఎన్నో జన్మలలో అనుభవించ వలసిన నొప్పి, బాధ ఒక్క క్షణంలోనే ఒకేసారి ఎంతో తీవ్రంగా జరిగిపోతాయి. ఆ తర్వాత ఇక గతం అనేది ఏది మిగిలి ఉండదు. మీ కర్మను (అంటే సాఫ్ట్ వేర్ ను  ) తొలిగించటం అనేది నొప్పితో కూడుకున్నది. కాని ఇది మీ అంతిమ క్షణంలో జరుగుతుంది. దీనిలో మీ ఇష్టాయిష్టాలు ఏమీ ఉండవు. ఆయన దాన్ని వీలైనంత తక్కువ సమయంలో జరిగేలా చూస్తాడు. బాధ త్వరగా ముగిసిపోవాలి. అది తక్కువ సమయంలో పూర్తి  కావాలంటే బాధని ఏంతో తీవ్రతరం చేయాల్సివస్తుంది అంటే బాధ తారాస్థాయికి చేరుకోవలసిందే . ఆ బాధ అంతగా తీవ్రంగా లేకపోతే ఈ యాతన ఎప్పటికీ పూర్తికాదు.

కాలభైరవ అష్టకం

https://soundcloud.com/soundsofisha/kalabhairavashtakam?in=soundsofisha/sets/trigun

ప్రేమాశీస్సులతో,
సద్గురు