కంగనా: సద్గురు, మనం ప్రయత్నంతో కర్మ బంధనాలను విడిచిపెట్టాలని మీరంటున్నారు, అదే సమయంలో అందరినీ కలుపుకుపోవాలని , అన్నిట్లో లీనమవ్వాలని కూడా  చెబుతున్నారు. ఒకే సమయంలో ఈ రెండూ ఎలా కుదురుతాయి..?

సద్గురు:నమస్కారం కంగనా!. ఇవి ఒకదానికొకటి ఎదురోస్తున్నాయని ఎందుకు అనుకుంటున్నారు? కర్మ అంటే, మనం శారీరికంగా, మానసికంగా, భావాత్మకంగా, శక్తి పరంగా చేసే పనుల వల్ల కలిగిన స్మృతి. ఇంకోలా  చెప్పాలంటే, మీరు తెలీకుండా తయారు చేసుకునే ఒక సాఫ్ట్ వేర్.అది మీ జీవితాన్ని ఎన్నో స్థాయుల్లో శాసించే జ్ఞాపకాల పుట్ట.  

 

మీకు శారీరిక జ్ఞ్యాపకం ఉంది, మానసిక జ్ఞ్యాపకం ఉంది, ఇంకా శక్తి పరంగా కూడా జ్ఞ్యాపకాలు ఉన్నాయ్- ఇవన్నీ కలిసి మీ జీవితాన్ని శాసిస్తాయ్. అంటే, మీలో ఈ స్మృతులు.. ఎంత ఎక్కువగా ఉన్నా సరే, దానికి హద్దులు ఉంటాయి. మీ జ్ఞాపకానికి ఒక సరిహద్దు ఉంటుంది.  

కర్మ అనేది ఒక సరిహద్దు. ఆ సరిహద్దుల్లో మాత్రం, కర్మ అనేది చాలా ఉపయోగమే

అంటే కర్మ అనేది ఒక సరిహద్దు. ఆ సరిహద్దుల్లో మాత్రం, కర్మ అనేది చాలా ఉపయోగమే-అది ఎన్నో విషయాలకు ఉపయోగపడుతుంది. దానివల్ల మీరు ఆటోమాటిక్ గా ఎన్నో పనులు చేయగలరు శ్రమలేకుండా.

కానీ మీరు విస్తరించాలనుకున్నప్పుడు ఆ హద్దులే సమస్యవుతాయి. మీరు మీ ఇంటి చుట్టూ ఒక గిరి గీస్కున్నారనుకోండి, మీరింకా విశాలంగా ఉండాలనుకుంటే చాలా తేలిక, ఇంటి బయటకి వెళ్ళాలి అంతే. ఒకవేళ, మీకు ఏవో బెదిరింపులొచ్చి, మీకు ప్రాణ భయం ఉందనుకోండి, మీ ఇంటి చుట్టూ ఒక పెద్ద కోటరీ కడతారు. 

ఏకాత్మ అంటే అందరితో స్నేహంగా ఉండటం కాదు. మీ వ్యవస్థ  అన్నిటితో మమేకమవ్వాలి

అప్పుడు మీకు భద్రత ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ మీకు ఏ రకమైన బెదిరింపులూ లేవనుకోండి, మీరు ఇంకా విశాలంగా జీవించాలనుకుంటారు. అలా అనుకున్నప్పుడు మీ చుట్టూ ఉన్న ఈ పెద్ద గోడే మీకు అడ్డమౌతుంది-దాన్ని జరపడం కష్టం అవుతుంది. ఆ ఒక్క కోట గోడ వల్లే మీరు విస్తరించకుండా ఉండిపోతారు.

అదే విధంగా కర్మ లేదా కర్మ స్మృతి కూడా ఒక అడ్డుగోడ లాంటిది. దాన్ని సడలించి, మీ వ్యవస్థలో ఏకాత్మ భావన తీసుకురావాలి. ఏకాత్మ అంటే అందరితో స్నేహంగా ఉండటం కాదు. మీ వ్యవస్థ  అన్నిటితో మమేకమవ్వాలి. 

మమేకమవ్వడం లేదా Inclusiveness అంటే ఏదో, మీరు చెయ్యవలసిన పని కాదు. అది ఈ సృష్టి సహజ లక్షణం. మీరు చేతనతో దాన్ని గ్రహించాలి. కర్మ అనేది మీ ఉనికి యొక్క లక్షణం.

మనం ఇక్కడ ఉన్నారు, చెట్టు వదిలే గాలి నేను పీలుస్తున్నాను, నేను వదిలే గాలి చెట్టు పీలుస్తోంది. అసలు చాలా మందికి ఈ లావాదేవీ గురించే తెలీదు. ఈ లావాదేవీ జరుగుతోందనే స్పృహ మనకుంటే, ఇక్కడ ఇలా కూర్చుని ఊపిరి పీల్చటమే ఎంతో అద్భుతమైన అనుభూతి అవుతుంది. కానీ మీకా ఎరుక లేనప్పుడు కూడా ఆ చెట్టు వదిలిన oxygen మీకు లభిస్తూనే ఉంది. కానీ మీరు దాన్ని అనుభవించట్లేదు.

ఏకాత్మ భావనలో ఉండటం అంటే మీరేదో కొత్తగా చేయడమని కాదు. మీరు ఈ సృష్టి తత్వం పట్ల ఎరుకతో ఉండడం. ఆ చెట్టుకి, ఈ మట్టికి జరిగేదే మీకూ జరుగుతుంది. ‘ఇది నేను’ అని మీరు దేన్నైతే అనుకుంటారో అది నిజానికి మీరు నడిచే ఈ మట్టి. మమేకమవ్వడం లేదా inclusiveness అంటే ఏదో, మీరు చెయ్యవలసిన పని కాదు. అది ఈ సృష్టి సహజ లక్షణం. మీరు చేతనతో దాన్ని గ్రహించాలి. కర్మ అనేది మీ ఉనికి యొక్క లక్షణం. మీరు మీకున్న కర్మ ప్రతిబంధకాల పట్ల కూడా ఎరుక కలిగి ఉండాలి. ఈ ఎరుక మీకుంటే, జీవితం తనను తానే నిర్వహించుకుంటుంది.

సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి. UnplugWithSadhguru.org.

Youth and Truth Banner Image