సామాజం గొప్పగా భావించే విషయాలు మన జీవితంలో లేనప్పట్టికీ మనం ఆనందంగా ఉండడం సాధ్యపడుతుందా? ఒకవేళ ఒకరు ఏమీ లేనప్పటికీ కూడా ఆనందంగా ఉంటున్నారంటే, మరి వారు మూ ర్ఖులా లేక మేధావులా? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవండి!  


మేధస్సుకీ, ఆనందానికీ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? మిమ్మల్ని మీరు నిజంగా ఒక ఆనందమయ జీవిగా మలచుకుంటే, మీరు ఒక మేధావి అయి ఉండాలి. ఎందుకంటే మీరు మీ జీవితపు ప్రాధమిక ఉద్దేశ్యాన్ని నెరవేర్చారు. అది మీ జీవితపు అంతిమ ఉద్దేశ్యం కాకపోవచ్చు. కానీ, మీరు కనీసం మీ జీవితపు ప్రాధమిక ఉద్దేశ్యాన్ని నెరవేర్చారు.

ఈ ప్రపంచంలో మీరు ఎవరిని మేధావి అంటారు?వారు చేయాలనుకున్న దానిని నెరవేర్చిన వారిని, వారు ఆడే ఆటలో గెలిచిన వారిని, ఒక నిర్దేశిత దారిని ఎంచుకుని గమ్యాన్ని చేరినవారిని మీరు మేధావులు అంటారు, అవునా, కాదా? ఇప్పుడు ప్రతి వ్యక్తీ ఆనందగా ఉండాలనుకుంటున్నాడు. కనుక, ఒక వ్యక్తి స్వతహాగానే అంటే కేవలం తన స్వభావపరంగానే ఆనందంగా ఉంటే, అతను ఖచ్చితంగా మేధావి అయ్యుండాలి.

సామాజికంగా, ఇతరులు ఎవరైనా అతనిని మూర్ఖుడు అనుకోవచ్చు. ఆ ఆనందంగా ఉన్న వ్యక్తిని చూసి మూర్ఖుడు అనుకునే అసలైన మూర్ఖుడికి జీవితంలో తను ఏమి కోల్పోతున్నాడో తెలియదు. ఒక వ్యక్తి తన జీవితంలో, 'ఒక వ్యాపారాన్ని నిర్మించుకోవాలి, డబ్బు సంపాదంచుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, ఇది కావాలి, అది కావాలి' అనే విషయాలను ఏ మాత్రం పట్టించుకోనంత ఆనందంగా ఉండవచ్చు. మంచి బట్టలు వేసుకుని, ఎక్కువ ధనం ఉన్నవారు ఈ వ్యక్తిని చూసి మూర్ఖుడనుకోవచ్చు. ఆనందంగా ఉన్న ఈ వ్యక్తి గురుంచి ‘అతను కేవలం ఆనందంగా ఉన్నాడు. చింపిరి గుడ్డలతో, వీధిలో ఉన్నా, అతను ఆనందంగా ఉన్నాడు. ఎంత మూర్ఖుడు!’ అని అనుకోవచ్చు. కానీ చూడండి ఎవరు నిజమైన మూర్ఖుడో.

అతి కష్టం మీద మీరు వీటన్నటినీ పోగుచేసుకుంటారు. ఎందుకంటే వాటితో మీరు ఆనందంగా ఉండాలనుకుంటున్నారు. కానీ మీరు ఆనందంగా లేరు. అలాంటప్పుడు మీరు మూర్ఖులా, లేదా ఎవరైతే ఏమీ చేయకుండానే, స్వతహాగానే ఆనందంగా ఉన్నాడో, అతను మూర్ఖుడా? ఎవరు తెలివైన వ్యక్తి? తాను ఏ ఉద్దేశం కోసమైతే పని చేస్తున్నాడో, ఆ ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకున్న వ్యక్తే తెలివైన వ్యక్తి. అవునా, కాదా? కాబట్టి సామాజికంగా మీరు అతని గురించి ఏమనుకున్నా దానికి విలువ లేదు. కనుక, ఆనందంగా ఉన్న వ్యక్తి స్పష్టంగా ఒక మేధావి!

మీరు అసలు ఏ ఆలోచనలూ లేకుండా పూర్తి అప్రమత్తతో ఉన్నప్పుడు అదే నిజమైన మేధస్సు. అప్పుడు మేధస్సు పూర్తిగా భిన్నమైన పద్ధతిలో పని చేస్తుంది.

బాధలో ఉండే వారే ప్రపంచంలో మేధావులుగా చెలామణీ అవుతున్నారు. ఎందుకంటే వారి మనసులలో పిచ్చి ప్రశ్నలు, జటిలతలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు, వారికి బాధను, భారాన్ని కలిగించే ఈ అనవసరమైన జటిలతలు మేధస్సుగా కీర్తించబడుతున్నాయి. కేవలం హద్దులేని మానసిక చర్యలను మేధస్సుగా భావిస్తారు, కానీ అది మేధస్సు కాదు. మీరు అసలు ఏ ఆలోచనలూ లేకుండా పూర్తి అప్రమత్తతో ఉన్నప్పుడు అదే నిజమైన మేధస్సు. అప్పుడు మేధస్సు పూర్తిగా భిన్నమైన పద్ధతిలో పని చేస్తుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు
"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.