మనం ఆనందంగా ఉండటానికి పరిస్ధితులను లేక చుట్టు ఉన్న వాటిని మార్చడం ఎంత వరకు సరైన పని? దీని గురించి సద్గురు ఏమంటున్నారో తెలుసుకోవాలంటే  ఈ  వ్యాసం తప్పక చదవండి.


మీరు నిర్బంధ అస్థిత్వం నుండి స్పృహతో కూడిన అస్థిత్వంలోకి మారితే, ఆనందంగా ఉండటం కష్టం కానే కాదు. మీకప్పుడు ఆనందంగా ఉండటం చాలా సహజం అవుతుంది.

ఇప్పుడు మీరు ఒక నిర్బంధిత వ్యక్తి, అంటే మిమ్మల్ని బయటి పరిస్ధితులు నిరంతరం అటూ ఇటూ నెడుతున్నాయి. కానీ మీరు ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నారు; అది ఎన్నటికీ తీరని ఆశ.

మీరు ఒక నిర్బంధిత వ్యక్తి అయినప్పుడు, మీరు ఆనందంగా ఉండాలంటే, ఈ ప్రపంచాన్నంతటినీ మీకు కావలసిన విధంగా మార్చవలసి ఉంటుంది. మరి ఈ ప్రపంచాన్నంతటినీ మీకు కావలసిన విధంగా మారిస్తే, ఇతరులు ఎవరూ ఆనందంగా ఉండరు. కాబట్టి మీరు ఆనందంగా ఉండకపోవటమే మంచిది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.