మానవ మేధస్సుకి జీవితం గురించి, దానికి అతీతంగా ఏముందో  తెలుసుకోవాలన్న తపన సహజంగానే ఉంటుంది. అందువల్ల ఆధ్యాత్మికతను అసలు మీరు ఎలా తప్పించుకోగలరు? మీరు కాని వాటితో మీరు గుర్తింపులను ఏర్పరచుకుంటున్నారు కాబట్టే ఆధ్యాత్మికతను మీరెప్పటినుంచో తప్పించుకోగలుగుతున్నారు. నేను మీరు కాని వాటితో అన్నప్పుడు వాటిలో మీ శరీరం, మనస్సు కూడా ఉన్నాయి. మీరు ఏదైతే కాదో దానితో  మీరు ఒకసారి గుర్తింపు ఏర్పరచుకున్నాక, మీ తెలివి వక్రీకరించబడుతుంది. అది దేనినీ ఉన్నది ఉన్నట్లుగా  చూడలేదు, అది ఆ గుర్తింపుల ద్వారానే చూస్తుంది. ఉదాహరణకు మీరు ‘నేనొక స్త్రీని’ అన్నారనుకోండి, ఇక మీ ఆలోచనా, మీ అనుభూతి, అన్నీ ఒక స్త్రీలాగానే ఉంటాయి. అంటే మీరు కొన్ని శరీరావయాలతో గుర్తింపు ఏర్పరచుకున్నారన్న మాట. మీరు ‘నేనొక హిందూవును’ లేదా ‘నేను భారతీయుడిని’ అన్నారనుకోండి ఇక మీరు దానిని దాటి ఆలోచించలేరు.

మీరు పిల్లలకు ఆధ్యాత్మికతను బోధించ వలసిన పనిలేదు. మీరు వారికి నేర్పిన ట్రిక్కులన్నీ చెరపివేయండి, వారిని వాటినుంచి తప్పించండి.

అందువల్ల మీరు ఒక సారి గుర్తింపులను ఏర్పరచుకుంటే మీ తెలివి వక్రమై పోతుంది. అది దేనినీ సజావుగా చూడలేదు. అందుకే మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం అవుసరమౌతోంది. తెలివి వక్రీకరణకు లోనుకాకపోతే, ఆధ్యాత్మికత సహజ సిద్ధమౌతుంది. అందువల్ల పిల్లలు దేనితోనూ, ఆఖరికి మీతో కూడా గుర్తింపును ఏర్పరచుకోకబోతే, తమ మనస్సుతో దేనితోనూ గుర్తింపుకు లోను కాకబోతే, వారు సహజంగానే ఆధ్యాత్మికంగా ఉంటారు, వాళ్లకి ఎవరూ ఆధ్యాత్మికతను బోధించనక్కరలేదు. అలా చేయాలనుకోవడం మొక్కకు పూలు పూయడం నేర్పబోవడంలాంటి పిచ్చి పనే అవుతుంది. అక్కడ నీరు, సూర్యరశ్మి, పోషణ లేక పోవచ్చు, కాని పూలు పూయడం గురించి ఒక మొక్కకు నేర్ప నక్కర లేదు. కొందరు తమ మూలంగానే పూలు పూస్తున్నాయి అంటుంటారు. అది నిజం కాదు. పూలు పూయడమన్నది మొక్కకు ఉన్న సహజ స్వభావం.  సహజ పరిస్థితులలో ఉన్నప్పుడు మొక్కలు పూలు పూయక మానవు. అడవిలో ఉన్న మొక్కలన్నీ వెల్లివెరిసి ఉంటాయి..కదూ,,?,  అదే విధంగా, మీరు పిల్లలకు ఆధ్యాత్మికతను బోధించ వలసిన పనిలేదు. మీరు వారికి నేర్పిన ట్రిక్కులన్నీ చెరపివేయండి, వారిని వాటినుంచి తప్పించండి. వారు పహజంగానే ఆధ్యాత్మికంగా ఉంటారు. ఒక విధంగా ఆధ్యాత్మికత గురించి మనం ప్రజలకు గుర్తు చెయ్యవలసిన అవసరం వచ్చిందంటే అది సిగ్గు పడవలసిన విషయం.  మనకి ఆధ్యాత్మికత నిత్యజీవితంలో ఒకభాగం అయిపోవాలి.

ఒక తల్లి ఏ విధంగా అయితే ఉదయం లేచాక పిల్లలకు పళ్ళుతోముకోవాలని నేర్పుతుందో అదే విధంగా ఏ శ్రమా లేకుండా, తనకు తెలియకుండానే తల్లి పిల్లలకు ఆధ్యాత్మిక ప్రక్రియ నేర్పగలగాలి. మన సంస్కృతిలో ఒకటి రెండు తరాలకు ముందు కూడా అది అలానే ఉండేది. ఇప్పటికి కూడా భారత దేశంలో మతవిషయాలు ఏ ఒక్క సంస్థ అజమాయిషీలోనూ లేవు. ఈ దేశంలో ఒక మత పెద్ద అంటూ ఎవరూ లేరు. ప్రపంచంలోని మిగతా ప్రాంతాలలోలాగా మతాన్ని అజమాయిషీ చేసేవారూ, నిర్దేసించేవారూ ఇక్కడ ఎవ్వరూలేరు. ఇది ప్రజల జీవనంలో ఒక భాగం. తమకు తెలిసిన విధంగా అందరూ బోధిస్తారు.

మీరు పిల్లలకు ఆధ్యాత్మికతను బోధించ వలసిన పనిలేదు. మీరు వారికి నేర్పిన ట్రిక్కులన్నీ చెరపివేయండి, వారిని వాటినుంచి తప్పించండి.

ఆధ్యాత్మిక ప్రక్రియ అన్నది మనకి జీవితంలో భాగంగా రుపుదిద్దబడింది. అది అజమాయిషీ లేకుండా ఎందుకు వదిలిపెట్టబడిందంటే అది ఒక మతంలా ఎప్పుడూ నిర్దేశంచబడలేదు. ఆధ్యాత్మిక ప్రక్రియలన్నవి మనిషి అభ్యన్నతికోసం ఉన్న వివిధ విధానాలే. భూమ్మీద ఈ దేశమొక్కటే దేవుడులేని దేశం, ఎందువల్లనంటే దేవుడు ఈ విధంగా ఉండాలన్న ఖచ్చితమైన అభిప్రాయం ఇక్కడ ఏమీ లేదు. అందరూ తమకు నచ్చినదేనినైనా ఆరాధించవచ్చు. ప్రజలు అన్నిరకాల వాటినీ ఆరాధిస్తున్నారు. ఈ దేశంలో మత విరోధి అంటూ ఎవరూ లేరు, ఎందవల్లనంటే ప్రతివారికీ, ఏదో ఒకదాని పట్ల ప్రేమ, భక్తులు ఉన్నాయి. ఒకరు తమ తల్లిని ప్రేమిస్తారు, ఒకరు తమ దేవుడుని ప్రేమిస్తారు, మరొకరు డబ్బును ప్రేమిస్తారు, ఇంకొకరు తమ పనిని ప్రేమిస్తారు, ఇంకకరు తమ కుక్కని ప్రేమిస్తారు, మరొకరు తమ ఆవుని ప్రేమిస్తారు. ఏది ఏమైనా అతను ఆధ్యత్మిక మార్గంలో ఉన్నట్లే.

ఉన్న ఒకే తేడా వారి ఆధ్యాత్మిక మార్గం బలహీనమైందా, బలమైందా అన్నదే. అంతే కాని ఆధ్యాత్మిక మార్గంలో లేనివారు ఎవ్వరూలేరు. అందరూ తమ తమ విధానాల్లో మార్గంలోనే ఉన్నారు, కదూ? అందువల్ల మీరు మీ పిల్లల జీవితాల్లోకి ఆధ్యాత్మికతను తీసుకువద్దామనుకుంటే, ఇంటి దగ్గర బోధించడం ప్రారంభించవద్దు. “దేవుడిని ప్రేమించండి, భక్తిగా ఉండండి” అని చెబితే మీ పిల్లలు మిమ్మల్ని ద్వేషిస్తారు. మీ జీవితంలో ప్రతి విషయాన్నీ స్పృహతో చేయండి. మీ జీవితంలోకి ఒకవిధమైన ప్రేమ, సున్నితత్వం, దయ తీసుకురండి. వారుకూడా అందులో భాగమైపోతారు, ఎందువల్లనంటే వీటిని వద్దనుకునే వారెవరూ ఉండరు కదా. తమ చుట్టూ, తమ లోపల కూడా హాయిగా ఉండాలనుకోని వారు ఎవరు ఉంటారు? మీ పిల్లలకు కూడా అదే కావాలి. మీరు అటువంటి పరిసరాలను సృష్టించండి, వారు వాటిని ప్రేమించి ఆ గుణాలను వారు కూడా గ్రహిస్తారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

Pexels