పదకొండేళ్ల ఖుషీని కలుసుకోండి. ఇప్పుడు ఖుషీ తన ఉప-యోగా తరగతులతో చండీగడ్‌ను ఊపివేస్తోంది.

చండీగడ్ అమ్మాయి పదకొండేళ్ల ఖుషీ తీరిక లేకుండా ఉంది. ఆమె తోటి స్కూలు పిల్లలు సెలవులు గడపడంలోనో, వీడియో గేమ్స్ ఆడడంలోనో తలమునకలుగా ఉంటే ఖుషీ ఏం చేస్తోంది. చాలా ఉత్సాహంగా ఉప-యోగా బోధిస్తూ ఉంది. యోగ శాస్త్రాన్ని అందరికీ అందించే ఈశా ఫౌండేషన్ ప్రయత్నంలో భాగం ఇది. 

ఖుషీ తన అనుభవం ఇలా చెప్పింది:

‘‘మా అమ్మ యోగాభ్యాసం చేస్తూ ఉంటే చూస్తూ ఉండేదాన్ని. మా అమ్మ ఈశా ఫౌండేషన్లో యోగా నేర్చుకుంది. యోగా చేస్తే లాభమేమిటి అని అడుగుతూండేదాన్ని. “యోగా అభ్యాసం చేస్తూ ఉంటే ఎంతో ప్రశాంతత కలుగుతుంది నాకు. శాంతి, సంతోషం కలుగుతాయి” అని చెప్పింది అమ్మ. నన్ను కూడా ఉప-యోగా వర్క్‌షాపులో పాల్గొనమని అమ్మ సూచించింది. వర్క్‌షాప్ ఏప్రిల్‌లో జరిగింది. నేను హాజరయ్యాను. యోగాభ్యాసాలు నేర్చుకున్నాను. యోగా ఎట్లా బోధించాలో కూడా నేర్చుకున్నాను. నాకు రెండు సందేహాలుండేవి, నా టీచర్లు ఆ సందేహాలు తీర్చారు. ఇక నేను వెనక్కి తిరిగి చూడలేదు.

ఇటీవలే స్నేహాలయలో 80మంది విద్యార్థులకు ఒక యోగా సెషన్ నిర్వహించాను. ఆరోగ్యం, సాఫల్యం, శాంతి, సమతుల్యత మొ।।న వాటికోసం వాళ్లకు 7 భిన్నమైన ఆసనాలు నేర్పాను. విద్యార్థుల్లో చాలామంది నన్నుచూసి ఆశ్చర్యపోయారు. ఒక పదకొండేళ్ల బాలిక ఇంత శక్తిమంతమైన యోగాభ్యాసాలెలా నేర్పుతున్నదని వాళ్లకు ఆశ్చర్యం. తరగతి మొదలైన తర్వాత వాళ్లు నిజంగా చాలా ఆనందించారు. చాలామందికి నాదయోగం, దిశాచాలనం ఎంతో నచ్చాయి.

నేను ప్రతి సోమవారం ఉప-యోగా క్లాసు తీసుకోవాలి’’ అంటూ ఖుషీ గర్వంగా తన సొంత అభ్యాసాలకోసం సిద్ధమవసాగింది.

ఉప-యోగా అంటే ఏమిటి?

సద్గురు: ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో - యోగాభ్యాసం చేసేవాళ్లలో కూడా చాలామందికి ఉప-యోగా అన్నది ఒకటి చేయవచ్చునని తెలియదు.

ఇది మీకు శారీరక, మానసిక ప్రయోజనాలిస్తుంది. కాని ఆధ్యాత్మిక కోణాన్ని స్పృశించదు.

అసలు యోగా కేవలం వ్యాయామ రూపం కాదు. దీనికి అంతకంటే ఉదాత్తకోణం ఉంది. భౌతిక కోణాన్ని మించిన ఒక కోణాన్ని మీలో సజీవ వాస్తవం చేసే సాంకేతికత ఇది. మీ జీవితంలో ఒక ఉన్నత సంభావ్యతను కలిగించేది యోగా. ఒక మార్పు తీసికొని వచ్చే శక్తి కలిగింది ఏదైనా సరే దాన్ని మనం తప్పుగా ఉపయోగిస్తే నష్టాన్ని కలిగించే శక్తి కూడా దానికి ఉంటుంది. అందుకే చాలా నిబద్ధత కలిగిన వాతావరణంలోనే యోగాని ఉపయోగించాలి. అయితే ఉప-యోగాకి ఆ స్థాయి నిబద్ధత అవసరంలేదు. మీరు దాన్ని అపసవ్యంగా చేసినా అది సమస్యనేమీ కలిగించదు, అసలు మీరు దాన్ని తప్పుగా చేయనేలేరు - అది అంత తేలిక!

భారతీయ భాషల్లో ఉపయోగం అనే ఒక మాట ఉంది. అంటే ప్రయోజనకరం అని అర్థం. కాని దాని అసలు ‘ఉపయోగం’ అంటే యోగాకి సంసిద్ధం చేసేది అని అర్థం. దీన్ని అయిదు నిమిషాల్లో నేర్చుకోవచ్చు. ఎక్కడైనా చేయవచ్చు. లాభాలు అనేకం - శారీరికంగా మెరుగ్గా ఉంటారు, మానసికంగా చురుగ్గా ఉంటారు. పైగా దీనికోసం మీకు ఎటువంటి పరికరాలూ అవసరం లేదు.

ఉప-యోగా లాభాలు

  • కండరాలకు వ్యాయామం ఇస్తుంది, కీళ్లకు కందెన ఇస్తుంది, శరీర వ్యవస్థను క్రియకు ప్రేరేపిస్తుంది.
  • నాడీ కణాల పునరుజ్జీవనాన్ని, జ్ఞాపకశక్తిని, చురుకుదనాన్ని మెరుగుపరుస్తుంది.
  • నిద్రావసారాలను తగ్గిస్తుంది, వెన్నెముకను చైతన్యవంతం చేస్తుంది.
  • ఆరోగ్యం, శక్తి కలిగిన భావం కల్పిస్తుంది, గాఢమైన ప్రశాంత భావనను కలిగిస్తుంది.

 

సంపాదకుని సూచన: ‘సంపూర్ణ పరివర్తనకు 5 నిమిషాల యోగా పరికరాలు’ పరిశీలించండి. సంతోషం, శాంతి, ఆరోగ్యం, సాఫల్యం మొదలైన ప్రయోజనాలను ఇచ్చే ఉప-యోగా తేలిక అభ్యాసాలివి. ఆన్లైన్  isha.sadhguru.org/yogaday లో నేర్చుకోవచు. లేదా మీరు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, లేదా అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఒక వర్క్‌షాపులో పాల్గొనవచ్చు, వర్క్‌షాపును నిర్వహించవచ్చు లేదా ఈ అభ్యాసాలను నేర్పే శిక్షణ పొందవచ్చు.