Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
మీ జీవితానుభూతి మీ చుట్టూ ఎవరున్నారు లేక ఏమి ఉంది అన్నదానిపై ఆధారపడి ఉండదు. మీరు ఎలా ఉన్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది.
ఈ ప్రపంచానికి మీరు చేయగల ఉత్తమమైన పని, మీరు సంతోషంతో ఇంకా ఆనందంతో నిండిన మనిషిగా ఉండడమే.
బాధ గురించిన భయాన్ని మీరు ఎప్పుడైతే అధిగమిస్తారో, అప్పుడు మీరు సహజంగానే జీవితాన్ని సంపూర్ణంగా శోధిస్తారు.
యోగ సాధనలు ఇంకా ధ్యానం యొక్క ఉద్దేశం అంతా, మరింత ఉన్నత స్థాయి ఉత్తేజానికి ఇంకా చైతన్యానికి చేరుకోవడం కోసమే.
మీకు విజయం కావాలంటే, ముఖ్యమైన విషయం, మీరే దానికి అడ్డంకి కాకుండా చూసుకోవడం.
మీకు తెలియని దేని గురించి అయినా ఒక అభిప్రాయానికి వస్తే, అది ఎప్పటికీ అజ్ఞానంలో ఉండిపోయేలా చేసుకోవడమే.
మనిషిగా ఉండడం అంటే ప్రతి జీవరాశిని సున్నితత్వంతో చూడగల సామర్థ్యం కలిగి ఉండడం.
మీకు నచ్చని విషయాలతో కూడా ఆనందంగా జీవించడం నేర్చుకోవడం అనేది జీవితంలో పెద్ద పాఠం.
ప్రపంచం మీ మీద ఏమి విసురుతుందో మీరు నియంత్రించలేరు. కానీ దాన్ని మీరు ఎలా మలుచుకుంటారు అనేది మాత్రం నూరు శాతం మీ చేతుల్లోనే ఉంటుంది. దీనికి శ్రీరాముడు ఉత్తమ తార్కాణం.
ఈ ప్రపంచంలో సమర్థవంతంగా పనిచేయాలంటే, జ్ఞానం ప్రధానాంశం కాదు, గ్రహణశీలతలోని స్పష్టతే ప్రధానమైనది.
జీవన్మరణాల గుండా మీరు మోసుకుపోగల ఏకైక నిజమైన సంపద అనుభూతుల ప్రగాఢతే.
మనుషులను వాడుకోవడం, వస్తువులను ప్రేమించడం అనేది జీవితాన్ని పూర్తిగా అపార్థం చేసుకోవడమే. వస్తువులున్నది వాడుకోవడానికి, ప్రజలున్నది ప్రేమించడానికి.