ప్రతిరోజూ యోగా చేయడం కుదరటం లేదా??

nityam-yoga

ప్రతి రోజూ యోగా చేయాలని అనుకున్నా కూడా చేయడం కుదరడంలేదు అని ఒక సాధకుడు వేసిన ప్రశ్నకి సద్గురు సమాధానాన్ని చదవండి.

సాధకుడు: సద్గురూ నేను గతంలో కొన్ని యోగా ప్రోగ్రాంలు చేశాను. నా సమస్య ఏమిటంటే నేను దానిని ప్రతీరోజూ ఖచ్చితంగా చెయ్యలేకపోతున్నాను. ఒకానొక సమయంలో నేను ఉదయం 6-00 గంటలనుండి 9-30 / 10-00 గంటలవరకు రోజూ యోగాని చేస్తూ ఉండేవాడిని. సుమారు నాలుగు-ఐదు గంటలు. ఆ తరువాత అదంతా పూర్తిగా పోయింది. ఈ రోజుల్లో కనీసం నేను రోజువారీ సాధన కూడా చెయ్యడం లేదు. ఇటువంటి ప్రవర్తన ఎందుకు వస్తుంది?  నన్ను నేను ఎలా మార్చుకోవచ్చు?

సద్గురు: మీరు యోగాను ఎప్పుడూ ఖచ్చితంగా చెయ్యాలనుకోకూడదు. అది అలా పని చెయ్యదు. ఇంకో విషయం ఏమిటంటే; మీరు యోగాను జీవితకాలం పాటు చెయ్యలనుకోకండి. కేవలం, ఈ రోజు చెయ్యాలనుకోండి..అంతే! నేను జీవితాంతం చేస్తాను – అని మీమీద మీరు భారం వేసుకోకండి. కేవలం, ఈ రోజు చెయ్యండి. అదే సరిపోతుంది.  అవునా? జీవితం ఎంతో సరళమైనది. దానిని మీరు ఎందుకింత సంక్లిష్టంగా చేసుకుంటున్నారు?? నేను ప్రతిరోజూ యోగా చేస్తాను..అనుకుంటూ, మీరు జీవితంలో ప్రతిరోజూ యోగా చెయ్యనవసరం లేదు. కేవలం, దానిని నేడు చెయ్యండి. దీనికి ఎటువంటి ఖచ్చితమైన మతపరమైన నిబద్ధతా అవసరం లేదు. ఈరోజున నేను యోగా చేస్తాను –  అనుకోండి. అంతే,  ఇది ఎంతో సరళమైనది. ఒకరోజు మీరు చెయ్యగలిగినట్లే..కదా? మీరు చెయ్యవలసినది అంతే!!
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert