అంబేద్కర్ జయంతి సందర్భంగా సద్గురు ఇచ్చిన సందేశం

ambedkar-message

అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాకిరణం. నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా సద్గురు ఆ మహనీయుడి గురించి ఇలా ప్రస్తావించారు (తెలుగు అనువాదం).

Sadhguruడా. భీంరావ్ రాంజీ అంబేద్కర్ ఒక దార్శినికుడు – భారత దేశంలో వెనుకబడిన వర్గాల్లోని ప్రజలకు కనీస హక్కులు, సమాజిక హోదా కల్పించడానికి విశేష కృషి చేశారు. సామాజిక స్థితి మరింత బాగుపడాల్సిన అవసరం ఉన్నా, అనాదిగా దళిత ప్రజలపై సాగుతున్న అరాచకాన్ని తెరపైకి తీసుకొచ్చి కనీసం చట్టం దృష్టిలో వారికి సమానత్వాన్ని కల్పించగలిగారు. మేథస్సు వంశపారంపర్యంగానే రానక్కరలేదని చెప్పడానికి అతను ఒక గొప్ప ఉదాహరణ. మన ప్రజాస్వామ్య మనుగడకు కారణమైన ఈ మేధావికి, మనం ఋణపడి ఉన్నాం. ” ప్రజాస్వామ్యం అంటే కేవలం ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచడం కాదు. సాటి మనుషుల పట్ల గౌరవ, పూజ్య భావం కలిగి ఉండడమే అసలైన ప్రజాస్వామ్యం” అని చెప్పిన కరుణాహృదయుడు, గొప్ప దార్శినికుడు, మహా మనీషి డా|| అంబేడ్కర్.

మనది రాజకీయంగా  ప్రజాస్వామ్యం అయినా పరిపూర్ణమైన సామాజిక ప్రజాస్వామ్యం కాదు. అంబేద్కర్ కలగన్న సామాజిక ప్రజాస్వామ్యం సాధించడంలో మనం ఇంకా సఫలం కాలేదు. ఈ తరం బాధ్యత ఏమిటంటే  పంశపారంపర్య హక్కులు, గౌరవాల స్థానంలో మనిషి సామర్ధ్యం, కార్యదక్షతలకు విలువ కలిగేలా చూడడం.

పుట్టుకతో అందరూ సమానులే. మన ఆశల దేశానికి రూపుకల్పించిన మహనీయుడు శ్రీ భీంరావ్ రాంజీ అంబేద్కర్ కు, ఈ రోజున శిరస్సువంచి నమస్కరిస్తున్నాము.

ప్రేమాశీస్సులతో,
సద్గురుఅనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert