కావాల్సిన పదార్థాలు:

బాదం పప్పు        -          20

పాలు     -          1 లీటరు

చక్కెర    -          3/4 కప్పు

కుంకుమ పువ్వు  -   కొంచెం

సారపప్పు    - 2 టీస్పూనులు (నేతిలో వేయించాలి)

చేసే విధానం : -  బాదం పప్పు వేడి నీటిలో నానపెట్టి తొక్కలు తీసి కొంచెం చల్లని పాలు పోసి మిక్సీలో వెయ్యాలి. ఆ తరవాత పాలు బాగా మరిగించాలి. అప్పుడు మిక్సీలో ఉన్న పేస్టు వేసి స్టౌమీద సిమ్‌లో ఉంచాలి. ఆ తరువాత పంచదార కలియబెట్టి కరిగేదాకా వుంచాలి. గోరువెచ్చని పాలల్లో కుంకుమ పువ్వు నానపెట్టాలి. అది కరిగాక బాదం ఖీర్‌లో కలపాలి. వేయించిన సారపప్పు పైన చల్లుకోవాలి. ఇది అన్ని వయసులవారు ఎల్లప్పుడూ తాగవచ్చు.

చదవండి: ఊరూరా ఇన్ని దేవాలయాలు ఉండడానికి గల కారణం ఇదే