ఇప్పటికే నదుల రక్షణ ఉద్యమం తెలుగు రాష్ట్రాలను దాటి మహారాష్ట్రా, ముంబై, మధ్యప్రదేశ్ మీదుగా ఉత్తర్ ప్రదేశ్ చేరుకుంటోంది. ఈ సందర్భంగా ఈ నదుల రక్షణ ఉద్యమ లక్ష్యాలేమిటో ఈ వ్యాసం ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము.

  • భారతదేశ నదుల ప్రస్థుత పరిస్థితులను అందరికీ తెలియజేయడం ద్వారా, రాబోయే విపత్తు గురించి అందరికి అవగాహన కలిగించాలి. ఆ పరిస్థితులను అరికట్టి, భూగర్భ జలం మరింత క్షీణించి పోకుండా ఆచరించ దగ్గ పరిష్కారాలను తెలియజేయడం.
  • భూగర్భ జలాన్ని దానితో అనుసంధానమైన నదీ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, తక్షణ కాలంలో ఇంకా దీర్ఘ కాలాలలో కూడా ప్రయోజనాలు అందించే ఆచరణీయమైన, ప్రభావవంతమైన పరిష్కారాలు కొన్ని అభివృద్ధి చేసి అందించడం. అవి ఏమిటంటే నదీ తీరాల మీద అడవులను పెంచడం, ప్రభుత్వ భూములపై ఆ ప్రాంతాల్లో పెరిగే స్వాభావికమైన చెట్లను పెంచడం, వ్యవసాయ క్షేత్రాలలో ఫలసాయం అందించే ఉద్యానవనాలను పండించడం.
  • నదుల రక్షణ ఉద్యమంలో పాల్గొనడానికి ఉత్పాహం చూపే వ్యక్తుల, సమాజాల, సంస్థల, దాతల, ప్రభుత్వాలకు సంబంధించిన వివరాలను సేకరించడం.
  • ప్రభుత్వాలు, సంస్థలు నడిపే ప్రణాళికలు కావలసిన ప్రయోజనాలను అందించే విధంగా సహకరించడం.

స్ఫూర్తి పరంగానూ, విషయ పరంగానూ ఈ ఉద్యమం అద్వితీయమైనది. ఇది ఎవరికో వ్యతిరేకంగా చేసే ఉద్యమం కాదు. సరైన ఆర్థిక ప్రయోజనాలు సిద్ధించుకోవడం కోసం అందరి సహకారాన్నీ కోరే ఉద్యమం.

ప్రణాళిక ఉద్దేశం

నది గట్ల మీద ఒక కిలోమీటరు, ఉపనది గట్ల మీద అర కిలో మీటరు వెడల్పున పచ్చదనాన్ని అందించే చెట్లను పెంచడంతో, చెట్ల వేర్లు కిందికి వెళ్ళునడం ఇంకా వర్షపాతం పెంపొందించడం ద్వారా భూగర్భ జలాన్ని అభివృద్ధిచేయడం. ఈ సులువైన, ప్రభావవంతమైన చర్య ద్వారా నదులను రక్షించి,అభివృద్ధిచేయడం.

ఈ ప్రణాళిక లక్ష్యం:

  • ప్రభుత్వ భూముల్లో ఆ ప్రాంతానికి సంబంధించిన, బహుళ ప్రయోజనాలు చేకూర్చే అటవీ మొక్కలను నాటటం.
  • ప్రవేటు భూముల్లో రైతుల జీవనానికి లాభదాయకమైన సేంద్రియ ఉద్యానవన పంటలు సాగు చేయడం.

ప్రణాళిక  అంశాలు

  • ఈశా యోగా సెంటరు, కోయంబత్తూరు నుంచి కన్యాకుమారి మీదుగా ఈ ర్యాలీ ఢిల్లీ చేరుకుంటుంది. 16 రాష్ట్రాలు, 21 ప్రముఖ నగరాల మీదుగా 4,100 మైళ్ళ ప్రయాణం.
  • ఈశా యోగా కేంద్రం వ్యవస్థాపకులు, ఈ ప్రణాళిక రూపకర్త అయిన సద్గురు ఈ ప్రయాణంలో ఆయా ప్రాంతాల నాయకులు, ప్రముఖ వ్యక్తులతో కలిసి పాల్గొంటారు.
  • ఒక్కొక్క నగరంలో, ఆయా నగరాలలోని  ప్రభుత్వ, వివిధ సంస్థల, విశ్వవిద్యాలయాల, క్లబ్, రైతుల, ప్రజా ప్రాతినిధ్యంతో కలిసి ప్రజలకు అవగాహన కలిగిస్తారు. ప్రస్తుత నదుల అధ్వాన్న స్థితిని గురించి దాన్ని మెరుగు పరిచే మార్గాల గురించి ఈ విధానాల్లో తెలియబరుస్తారు.
  1. స్కూళ్ళకు, విశ్వ విద్యాలకు, కార్పొరేటు సంస్థలను ఉద్దేశించబడిన ఈ కార్యక్రమాలు, స్థానిక ప్రముఖులతో సహా ప్రతి నగరంలో 10 వేల మందికి పైగా ప్రజలు ఇందులో పాలు పంచుకునే విధంగా వారిని ఆకర్షించేలా ఉంటాయి
  2. ఈ సమావేశాలలో కేవలం సమాచారమే కాకుండా డాక్యుమెంటరీలు, ప్రేరణ కలిగించే సంగీత కార్యక్రమాలు, ప్రముఖ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు జరుప బడతాయి.
  3. న్యూఢిల్లీ లో కేంద్ర ప్రభుత్వానికి ఈ నదుల పునరుజ్జీవన ప్రణాళిక ప్రతిపాదన అందించడం ద్వారా ఈ చైతన్య యాత్ర ముగుస్తుంది.

తదుపరి చర్యలు

సమాజంలో వచ్చిన అవగాహనని, ప్రజలందించిన సహకారాన్ని బట్టి, తరువాత ప్రభుత్వాలతోనూ, నిపుణులతోనూ, శాస్త్రవేత్తలతోనూ ఇంకా ఇతర వర్గాలతోనూ సంప్రదింపుల ద్వారా, దశలవారీగా వివిధ నదులను పునరుజ్జీవింప చేసే కార్యక్రమ అంచనాలు, పనులు నిర్వహించబడతాయి.

సహాయ, సహకారాలు అందించేవారు

ఈ ర్యాలీ ఇంకా  ఆ తరువాతి కార్యక్రమాలు  ఈ క్రింది వారితో చేసే సంప్రదింపులు, సకారాలతో నిర్వహించబడతాయి.

  • పర్యావరణ మంత్రిత్వ శాఖ
  • జలవనరుల, నది అభివృద్ధి, గంగానది పునరుజ్జీవన మంత్రిత్వ శాఖ
  • ఆయా రాష్ట్రాల నాయకుల భాగస్వామ్యం

మన ముందు ఉన్న అతి తీవ్రమైన ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైన ఎన్నో ఇతర కార్యక్రమాలకు స్ఫూర్తిని కలిగించి, వాటికి సహకరించడం కూడా ఈ కార్యక్రమ లక్ష్యమే.

మరిన్ని వివరాల కోసం చూడండి: RallyForRivers.org