నదుల రక్షణ ఉద్యమం – మూడవ రోజు

Day-3-Feature-Image-1050x700

తిరువనంతపురం లోని కళల వీధి ‘మానవీయం వీధి’ లో పెయింటర్లు, వివిధ రకాలైన జానపద నృత్యకారులు, వేళకలి, తెయ్యం, పదయాని, కుమ్మటి కళ్ళి, అర్జున నృత్యం, పులిక్కళి….

ఇప్పటికే ‘ఓనం’ పండుగ వేడుకల్లో మునిగి ఉత్సాహంగా ఉన్న నగరంలోకి ‘నదుల రక్షణ’ ఉద్యమం వచ్చేస్తే ఎలా ఉంటుంది? ఒకటే సందడి…చేప్పలేనంతగా.

తిరువనంతపురం లోని కళల వీధి ‘మానవీయం వీధి’ లో పెయింటర్లు, వివిధ రకాలైన జానపద నృత్యకారులు, వేళకలి, తెయ్యం, పదయాని, కుమ్మటి కళ్ళి, అర్జున నృత్యం, పులిక్కళి…. ఇంకా మిఝావూ డప్పులు, లయ బద్ధంగా ఉరకలెత్తిస్తున్నాయి. డఫ్ మత్తు పాటలు పాడేవారు, ఇంకా నదుల రక్షణ జెండాలు పట్టుకుని పెద్ద ఊరేగింపు.. వాతావరణం అద్భుతం!

తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమం విజయవంతం కావడంతో, నదుల రక్షణ ఉద్యమానికి  ప్రభుత్వ సహకారం తెలుపుతూ ముందుకు వచ్చిన మొదటి రాష్ట్రం కేరళ అయింది. తిరువనంతపురంలోని మానవీయ వీధిలో జరిగిన అద్భుతమైన స్వాగత కార్యక్రమం తరువాత, ముఖ్య కార్యక్రమం సిటీ కల్చరల్ సెంటర్ లోని ఠాగూర్ ధియోటర్ లో జరిగింది. ప్రముఖ కవి శ్రీ కల్లవం శ్రీకుమార్ ఇంకా అనేక మంది సంగీత కళాకారులచే ‘నిల నాడి’ అనే నదులపై రచించిన కీర్తన ఆలాపించారు. కార్యక్రమానికి వచ్చి తమ మద్దత్తు తెలిపిన ప్రముఖులలో శ్రీ. మాథ్యూ.టి.థామస్, నీటివనరుల శాఖ మంత్రి, శ్రీ కడకంపల్లి సురేంద్రన్, పర్యాటక శాఖ మంత్రి, శ్రీ. రాజగోపాల్ M.P, శ్రీ. కె.జయకుమార్ మళయాళ యూనివర్సిటీ, ఉపాద్యక్షులు, ప్రముఖ సినీ నిర్మాత అదూర్ గోపాల కృష్ణన్

కేరళలో పారుతున్న 44 నదులలో చాలా నదులు తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కుంటుండగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల గత కొద్ది సంవత్సరాలలో కొన్ని నదులు పునరుజ్జీవించడం గురించి విన్నానని సద్గురు అన్నారు. అంటే నదులను పునరుజ్జీవింప చేయవచ్చనడానికి ఇది మంచి ఉదాహరణ అని ఆయన అన్నారు. కేరళను ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అంటానికి కారణం, అక్కడ ఉన్న పచ్చదనం, జలాశయాలనీ, మనం ఇదే మాట దేశం మొత్తం గురించి అనగలిగేలా చేయాలని, ఆయన అన్నారు.

మొత్తం కార్యక్రమాన్ని చూడండి: నదుల రక్షణ ఉద్యమం..కేరళలో 

మరిన్ని చిత్రాలు:

WhatsApp Image 2017-09-05 at 9.52.43 AM WhatsApp Image 2017-09-05 at 9.29.06 AM RfR-Triv-4 RfR-Triv-1 RfR-in-Triv-20 Rfr-in-Triv-19-400x303 Rfr-in-Triv-18 Rfr-in-Triv-17 Rfr-in-Triv-15 RfR-in-Triv-14 Rfr-in-Triv-13 Rfr-in-Triv-12 RfR-in-Triv-11 Rfr-in-Triv-10-400x283

 

 

 

 

 

 

 

 

 

 
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert