నదుల రక్షణ ఉద్యమంలోని మొట్టమొదటి కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరిగింది. కోయంబత్తూర్ లోని VOC  మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా ప్రతిస్పందించే పది వేలమందికి పైగా ప్రజలు పాల్గొన్నారు.

PicMonkey Collage

వేదిక మీద పంజాబు రాష్ట్ర గవర్నరు గౌ.వి.పి.సింగ్, కేంద్ర మంత్రి డా.హర్షవర్ధన్, తమిళనాడు గ్రామీణ వికాస మరియు మునిసిపల్ పరిపాలనా శాఖ కాబినెట్ మంత్రి తిరు. ఎస్.పి. వేలుమణి హాజరైనారు. ఇంకా వేదిక మీద క్రీడాతారలు శ్రీ. వీరేందర్ సెహ్వాగ్,  భారత మహిళా క్రికెట్ టీం కెప్టెన్ మిథాలి రాజ్, ఫార్ములా ఒన్ రేస్ డ్రైవర్ నారాయణ్ కార్తికేయన్ వీరేకాక రాలీలో భాగస్వామ్యం వహిస్తున్న మహీంద్రా గ్రూపుకు చెందిన విజయ్ రామ్ నక్రా,  ర్యాలీకి టెక్నికల్  భాగస్వామ్యం అందజేస్తున్న తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపాద్యక్షులు డా. కె. రామసామి, ఉన్నారు.

PicMonkey Collage2

కేంద్ర మంత్రి డా.హర్షవర్ధన్,‘‘ నేను ఇక్కడకు పర్యావరణ శాఖ మంత్రిగా రాలేదు, నేను ఈ ఉద్యమంలో పాల్గొనే సైనికునిగా వచ్చాను. నేను ఇక్కడకు రావడమే కాదు, ఢిల్లీలో అక్టోబరు 2న సద్గురుకు ఘన స్వాగతం అందజేస్తాను’’ అన్నారు. ఇంకా ‘‘ ఈ రోజు సద్గురు మన పిల్లల పట్ల మనకు ఉండవవసిన బాధ్యతను గుర్తుచేస్తున్నారు. ఈ ఉద్యమం మన పిల్లలకు, వచ్చే తరానికి. సద్గురు ఆశీస్సులతో ఈ ఉద్యమం మరి కొన్నేళ్ళల్లో పూర్తిగా ఎదిగినప్పుడు, భారత దేశంలోని 125 కోట్ల ప్రజానీకం ఈ ఉద్యమం గురించి గర్వంగా చెప్పుకుంటారు.’’ అన్నారు.

సద్గురు ‘‘ ఇది ఒక నిరసన కాదు, ఇది ఆందోళనా కాదు. మన నదులు క్షీణించి పోతున్నాయని ప్రజలకు అవగాహన కలిగించే ఉద్యమం. మీరు నీరు తాగే జీవం అయితే, ఈ ఉద్యమంలో చేతులు కలపాలి " అన్నారు. భావితరాల గురించి మాట్లాడుతూ ఆయన, ‘‘ భారతదేశ పౌరులుగా మనం మన బాధ్యతను నిర్వర్తించాలి, మన నదుల ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరచాలి. మన పెద్దలు మనకు నదులను ఎలా అందించారో, మనం వెళ్ళిపోయేముందు కనీసం ఆ స్థాయికన్నా తీసుకురావాలి. మన దేశ శ్రేయస్సుకు, మన తరానికీ, మన భావితరాలకోసం మనం ఒకటిగా నిలబడి ఇది జరిగేటట్లు చూడాలి’’ అన్నారు.

21272465_10156241014499947_2169577964282261876_n

కేంద్ర మంత్రి జెండా ఊపి లాంఛనంగా ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ పదహారు రాష్ట్రాల మీదుగా, 23 పెద్ద నగరాలలో కార్యక్రమాలు జరుపుకుని, 7000 కి.మీ ప్రయాణించి అక్టోబరు 2న పరిసమాప్తమౌతుంది.

సెప్టెంబర్ 4న కన్యాకుమారిలో జరిగే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడండి: నదుల రక్షణ కన్యాకుమారిలో..

మొదటి రోజు చిత్రాలు మరికొన్ని..

g1

g2

g3

g4

g5

g6

g7

g8

g9

వార్తల్లో...

V6 వార్తలు..

ఈ-టీవీ

ఈ-టీవీ - తెలంగాణా

Tv-5