గత జన్మల గురించి తెలుసుకునే విధానం ఏదైనా ఉందా? వాటిని తెలుసుకోవడం వల్ల లాభమేమిటి అనే ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు.

మీరు గతం గురించి తెలుసుకోవాలనుకుంటే, మిమ్మల్ని మీరు ఎంతో ఉన్నత స్థాయి ఎరుకలోనికి పెంపొందించుకోగలగాలి. అది మీ జ్ఞాపకశక్తిని చీల్చేలా ఉండగలగాలి. కానీ దీనివల్ల ఉపయోగం ఏముంది..? ఈ జన్మలో జరుగుతున్న దానినే మీరు నిర్వహించలేకపోతున్నారు. పది సంవత్సరాల క్రితం ఏం జరిగిందో, దాని గురించి మీరు ఇంకా బాధ పడుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో, పది జన్మల అనుభవాలు మీకు గుర్తు వచ్చాయనుకోండి, అది మిమ్మల్ని పిచ్చివాళ్లను చేస్తుంది. అందుకని దీనివల్ల ఉపయోగమేమీ లేదు.

మీరు వేటినైతే గత జన్మ స్మృతులు అంటున్నారో, అవి మీ మనసులో అచేతనంగా ఉన్న జ్ఞాపకాల పొరలు. మీ చైతన్య  స్థాయిని పెంపొందించుకోగలిగితే, మిమ్మల్ని లోపలినుంచి ఏలుతున్న వాటన్నింటినీ కూడా మనం తొలగించవచ్చు. మేము నిర్వహించే సంయమ మేడిటేషన్ గురించి మీకు చెబితే మీకు నమ్మశక్యం కాదు. ఇది ఎనిమిది రోజులు జరిగే కార్యక్రమం. ఇది ఎంతో తీవ్రమైన ప్రక్రియ. ఇందులో మీరు ధ్యానం చేద్దామని కూర్చున్నారనుకోండి, మీ శరీరం ఒక పాములాగా పాక్కుంటూ వెళ్తూ ఉండడం మీరు గమనిస్తారు. ఇక్కడ మీరు పూర్తి ఎరుకతో ఉంటారు. మీరు, ధ్యానం నుంచి బయటికి వచ్చిన తరువాత; మీరు మామూలుగానే ఉంటారు. కానీ, మీరు ధ్యానంలో కూర్చోగానే, మళ్ళీ అలా మొదలుపెడతారు.

మీ చైతన్య  స్థాయిని పెంపొందించుకోగలిగితే, మిమ్మల్ని లోపలినుంచి ఏలుతున్న వాటన్నింటినీ కూడా మనం తొలగించవచ్చు.

మీ శరీరం ఒక పక్షిలాగా ఎగరవచ్చు.. లేదా ఒక కుక్కలాగా, ఒక పులిలాగా, మరో దానిలాగానో.. ఎన్నో రకాల రూపాలు తీసుకోవచ్చు. ఇలా ఎందుకు జరుగుతోందంటే, మీ మనస్సులో అచేతనంగా ఉన్న పొరలు ఎన్నో కోణాల్లో ఉన్నాయి. ఇవి మీకు అందుబాటులో లేవు. కానీ  మీరు చేస్తున్న ప్రతీ పని మీద ప్రభావం చూపిస్తున్నాయి. అందుకని మీరు మీ చైతన్య  స్థాయిని పెంపొందించే ఒక ప్రక్రియను అవలంభిస్తే.. మీరు, మీ మనసులో ఉన్న ఈ నిద్రాణ పొరలను మీ చైతన్య స్థితిలోనికి తీసుకునిరాగలరు. జ్ఞాపకాల రూపంలో కాదు, ఒక శక్తి రూపంలో, ఒక అనుభవ రూపంలో..! ఇలా అయితే  మీరు వీటితో పని చేస్తూ కూడా.. మిమ్మల్ని మీరు ఎంతో స్వేచ్ఛగా అట్టి పెట్టుకోగలుగుతారు. అటువంటి సందర్భంలో ఇది ఉపయోగమే..! కానీ, దేనినో కేవలం జ్ఞాపకశక్తి పరంగా గుర్తు తెచ్చుకోవడం అన్నది ఎటువంటి ఉపయోగం లేనిది. అది మీ జీవితాన్ని మరింత సంక్లిష్టంగా, మరింత గందరగోళంగా తయారు చేస్తుంది.

ఉదాహరణకి,  మీ ప్రక్కింట్లో ఉన్న కుక్క గత జన్మలో మీ భర్త అని మీకు తెలిసింది అనుకోండి, అయితే దానిమీద రాళ్ళు విసురుతారు లేదా ముద్దాడతారు. మీరు దానిమీద రాళ్ళు విసిరితే;  మీ పొరుగింటాయనతో మీకు గొడవ ఏర్పడుతుంది.  లేదా మీరు వెళ్ళి దానిని ముద్దాడాలని చూస్తే.. అది మిమ్మల్ని ఊరుకోదు. అందుకని ఏ విధంగా అయినా సరే, ఇది మీకు ప్రమాదమే. కానీ, మరో కోణంలో మీరు దానిని మీ అనుభవంలోనికి తీసుకురాగలుగుతూ;ఈ జ్ఞాపక ప్రక్రియను ప్రక్కకు పెట్టగలిగితే.. అది, ఒక విధంగా మీకు ముక్తిని కలిగిస్తుంది.

ఎన్నో రకాల సంయమాలు ఉన్నాయి. మనం ఇక్కడ చేసేది కర్మ సంయమ. ఇక్కడ, గతం యొక్క పొరలు మీ మనస్సులో నుంచి బయటికి వచ్చి, ఇక దానంతట అదే జరగాల్సింది జరుగుతుంది. మీరు గనుక మీ ఎరుక స్థాయిని ఒక నిర్దిష్టమైన విధానంలో పెంపొందించగలిగినప్పుడు; ఇది దానంతట అదే పని చేస్తుంది. మీకు, ఎటువంటి సూచనలూ ఇవ్వబడవు. మీరు, ఏమి చెయ్యాలో మీకు ఎవరూ చెప్పరు. కేవలం మీ లోని ఎరుక పెరగడంతోనే,  మీ శరీరం అంతా కూడా ఇలా ప్రవర్తించడం మీరు చూస్తారు. మీ మనస్సులో ఏమి జరుగుతోందో దానిని మీరెప్పటికీ నమ్మలేరు.  మనస్సు, మిమ్మల్ని ఎన్నో లక్షల విధాలుగా మోసపుచ్చుతూ ఉంటుంది. మీ శరీరం మీకు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. అందుకే మేము అన్ని విషయాలూ కూడా శారీరికంగా.. లేదా శక్తిపరంగా జరగాలని చూస్తాము. అంతేకానీ  మానసిక స్థాయిలో కాదు.  ఎందుకంటే;  మనస్సు కు ఎన్నో విషయాలను ఊహించుకోగల సామర్థ్యం ఉంది.   అది;  దేనినో ఊహించుకుని..అదే నిజమని మీరు నమ్మేలాగా చేస్తుంది.  ఇలా ఎన్నో విషయాలు జరిగాయి.

మీ మనస్సులో ఏమి జరుగుతోందో దానిని మీరెప్పటికీ నమ్మలేరు.  మనస్సు, మిమ్మల్ని ఎన్నో లక్షల విధాలుగా మోసపుచ్చుతూ ఉంటుంది.

ఒకసారి, ఒకావిడ బొంబే నుంచి వచ్చింది. ఈ కుటుంబం అమెరికాలో స్థిరపడింది. వీళ్ళు అక్కడ విపరీతంగా డబ్బు సంపాదించారు. ఇప్పుడు ఆవిడకి హాలీవుడ్ అంటే ఎంతో ఇష్టం. అక్కడ,  ఆమె అతీంద్రియ శక్తి ఉన్నదని చెప్పుకునే వారిని కలుసుకొంది. వీళ్ళు ఫోన్లో మాట్లాడడానికి గంటకి తొంభై డాలర్లు తీసుకుంటారు. వాళ్ళు చెప్పింది ఈవిడ గట్టిగా నమ్ముతోంది. టాం క్రూయిస్ గత జన్మలో నీకు భర్త, రిచర్డ్ గేరే మీ నాన్న , ఇవాళో-రేపో వాళ్ళు మిమ్మల్ని చూసి గుర్తు పడతారని చెప్పారు. ఇదంతా ఆవిడ భర్తని పిచ్చివాడిని చేస్తున్నాయి. ఈ విషయం నా దగ్గరకు వచ్చింది. ఇది ఈవిడలో ఎంతో బలంగా నాటుకుపోయిందని నాకు అర్థం అయ్యింది. నేను దానికి.. సరే..! అలా జరిగితే జరిగి ఉండవచ్చు. కానీ  టామ్ క్రూయిస్ గత జన్మలో ఎలా ఉండేవాడో నీకు తెలుసా..?  అతను, అందరికంటే ఎంతో అసహ్యంగా ఉండేవాడు అని చెప్పాను. అతనికి అప్పుడు మరో దేహం ఉండి ఉండవచ్చు.. అని ఊహించలేకపోయింది కూడానూ..! అతను ఇప్పటిలానే ఉండి ఉండుంటాడు అనుకుంది. నాకతను గత జన్మలో చాలా బాగా తెలుసు. అతను, ఎంత ఛండాలంగా ఉండేవాడంటే, మనం  భరించలేకపోయెవాళ్లం. నీకు గుర్తుందా.. అని అన్నాను. దీనితో ఆవిడకి మతి పోయింది. గతజన్మల గురించి ఆలోచించడం అన్నది ప్రజలని ఇలా పిచ్చివాళ్లను చేస్తోంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు