భౌతికం – అభౌతికం

physical-non-physical

ఈ వ్యాసంలో విజ్ఞానమయ శరీరం గురించి చెబుతున్నారు, ఇది భౌతికం-అభౌతికానికి మధ్య ఉన్న కోణం అని, దానిని మనం అవగాహన చేసుకోవాలంటే అందులో లయమైపోతే గాని జరగదు అని అంటున్నారు.

మీరు దీనిని సృష్టించలేరు ఎందుకంటే అది అక్కడ ఎప్పుడూ ఉంటుంది. మీరు, ఈథర్ అన్న పదాన్ని విన్నారా..? ఇది పూర్తిగా అభౌతికమైనది కాదు. ఇది భౌతికతకూ, అభౌతికానికీ మధ్య ఉన్న సంధి స్థితి. భౌతికమైన దానిని మీ అవగాహనలోనికి తీసుకుని రావచ్చు. ఏదైతే అభౌతికమైనదో దానిని మీ అవగాహనలోనికి తీసుకుని రాలేరు. మీరు దానిగా మారిపోవాల్సిందే..! ఇక్కడ, ప్రశ్నల్లా మీరు దానికోసం ఎంత సమయం, శ్రమ వెచ్చించగలరన్నదే. ఈ భౌతిక ప్రపంచంలో అన్నిటినీ మీ అవగాహనలోకి తీసుకురావడం సాధ్యమే..! కొంత సాధన చేస్తే, ఈ భౌతిక సృష్టిలో ఉన్నదానినంతా కూడా, మీ అవగాహనా పరిధిలోకి తీసుకురావచ్చు. ఇది మీ అవగాహనా పరిధి బయట ఉండే అవకాశం లేదు.

ఏదైతే అభౌతికమైనదో, అది మీ అవగాహనా పరిధిలోకి రాదు. మీరు అందులో లయమైపోవాల్సిందే..!

కానీ, ఏదైతే అభౌతికమైనదో, అది మీ అవగాహనా పరిధిలోకి రాదు. మీరు అందులో లయమైపోవాల్సిందే..! దీనికి మరో మార్గం లేదు. అందుకే ఎప్పుడూ కూడా భగవంతుడికి శరణాగతి వేడడం, భగవంతుడిని శరణు కోరడం అని మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎం చెప్పాలని చూస్తున్నారంటే – ఏదైతే భౌతికానికి అతీతమైనదో దానిని మీరు గ్రహించలేరు – అని. మీరు దానికి లొంగిపోవాలి. మరో విధానం లేదు. అందుగురించే ఈ మాటలన్నీ కూడానూ. ఇలా లొంగిపోవాలి, శరణు వేడాలి అన్న మాటలు ఎందుకు వచ్చాయి అంటే ఏదైతే భౌతికానికి అతీతమైనదో దానిని మీరు గ్రహించలేరు. మీరు కేవలం దానితో ఒక్కటైపోగలరు. మీరు అందులో కరిగిపోగలరు. శరణాగతి అన్నది సరైన పదం కాదు, కానీ దీన్ని మనం ఈ విధంగా వాడుకలోనికి తీసుకువచ్చాం. ఏదైతే భౌతికానికీ, అభౌతికానికి మధ్య సంధి స్థితి ఉందో దానిని మీరు కొంతవరకు గ్రహించగలరు. అది ఉన్న విషయమే.. ఇది మీరు సృష్టించేది కాదు.

చాలా కాలం క్రితం ఇది జరిగింది. ఒకసారి మా ఇంటికి పెయింట్ వేస్తున్నాను. నేను రంగులు వేయడంలో కొత్త-కొత్త విధానాలు కనిపెడుతున్నాను. ఎందుకంటే, అప్పుడు నా దగ్గర అంతగా సమయం లేదు. నేనొక్కడినే ఈ బిల్డింగ్ మొత్తం పూర్తిగా ఒంటి చేతితో రంగులు వేస్తున్నాను. అందుకని నా దగ్గర అంత సమయం లేదు. నేనేమి చేసేవాడినంటే,  ఆ బ్రష్ ని పెయింట్ లో ముంచి గోడకి ఒక ప్రక్కనుంచి మరొకప్రక్కకి నడుస్తూ వెళ్ళేవాడిని. మొట్టమొదటిసారిగా నేను ఈ పని చేసినప్పుడు ఇది గమనించాను. మొదలు పెట్టిన చోట రంగు దట్టంగా వచ్చింది. నేనలా నడుస్తూ వెళ్తున్నకొద్దీ, అది పలుచబారి, ఇంకా పలుచగా ఇంకా పలుచగా అయ్యి పూర్తిగా కనబడకుండా అసలు పూర్తిగా రంగు లేకుండా వచ్చింది.

ఏదైతే అభౌతికమైనదో దానినే మీరు దివ్యత్వం అంటారు. ఏదైతే ఎంతో స్థూలమైనదో దానిని రాయి అనవచ్చు.

అంతే, నేనక్కడ పారవశ్యంతో కూర్చుండిపోయాను. ఎందుకంటే, ఈ సృష్టి అంతా కూడా నాకళ్ళముందు అక్కడే ఆవిష్కృతమైంది. సృష్టిలో ఉన్నది ఇంతే..!  ఏదో ఒకటి స్థూలంగా మొదలౌతుంది. అది సూక్ష్మంగా, ఇంకా సూక్ష్మంగా తయారయ్యేసరికి అదే అభౌతికమైనది అవుతుంది. ఏదైతే అభౌతికమైనదో దానినే మీరు దివ్యత్వం అంటారు. ఏదైతే ఎంతో స్థూలమైనదో దానిని రాయి అనవచ్చు. మధ్యలో ఉన్నవన్నీ వివిధ స్థాయిల్లో ఉన్న సూక్ష్మతా లేదా స్థూలత. ఈ సృష్టి అంతా కూడా ఇంతే. ఇప్పుడు మీరు అడుగుతున్న (విజ్ఞాన మాయ) కోణం ఎక్కడ వస్తుందంటే, ఎక్కడైతే ఆ  రంగు మరీ పలుచగా అయిపోతుందో అక్కడన్న మాట.

ప్రేమాశీస్సులతో,
సద్గురు
Pexels.comఅనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *