మరింత అనుభావించాలనే వాంఛ మానవునిలో సహజం అని, కాకపొతే దానిని ఎరుకలో లేకుండా ప్రయత్నిస్తున్నప్పుడు అది డబ్బు,అధికారం ఇలా వివిధ రూపాలలో అభివ్యక్తం అవుతూ ఉంటుంది అని సద్గురు చెబుతున్నారు..

Sadhguruకోట్లమంది ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారు. ఈ రోజున ఎంతోమంది కనీసం వారి కడుపు నిండా భోజనం చేయలేక పోతున్నారన్నది నిజం. ఇది ఎందుకంటే,  కొద్ది మంది ప్రజల దగ్గర ఎంతో ఎక్కువ ధనం మూలుగుతోంది కాబట్టి. ఈ ప్రపంచ ధనంలో సుమారు 90-95 శాతం కేవలం 4-5 శాతం ప్రజల దగ్గర ఉన్నది. అంటే, మిగతా 90-95 శాతం ప్రజలు ఎలా అయినా పేదరికంలో ఉండవలసినదే..! మరో మార్గం లేదు. మీ మనుగడ తత్వం ఎలాంటిదంటే.. మీలో మరింత కావాలి అన్న వాంఛ కలిగే కాంక్ష ఏదో ఉంది. ఈ మరింత కావాలన్నది గనుక భౌతిక అభివ్యక్తిని పొందిందంటే ఈ విధంగానే - ప్రపంచంలో ఏదీ సరిసమానంగా పంచుకోలేము. ఇదే మరొక రకమైన ఆధ్యాత్మికతగా అభివ్యక్తం చెందిందంటే, నిజానికి మీరు కోరుకొనేది కూడా ఈ అనంతమైనదాన్నే.

మీరు భౌతికతలో ఎంత గొప్పగా ఉన్నసరే.. మీరు గనక జీవితంలోని ఆ కోణంతో సరిగ్గా లేకపోయినట్లైతే, అది మీకు ద్వారాలు తెరవదు.

మీరు ఈ భౌతిక తత్వం ద్వారా అనంతంగా మారలేరు. మీరు, ఇక్కడికి ఈ మానవ శరీరం పొంది వచ్చిన తరువాత, ఆధ్యాత్మికత అనేది ప్రతివారి జీవితంలోనూ ఒక భాగం అయి ఉంటే, ఇచ్చి పుచ్చుకోవడం, వస్తువులను పంచుకోవడం - అన్నది ఎంతో సహజమైన విషయంగా ఉండేది. సరే!.. ఒకరు ఎక్కువ కాలం జీవిస్తారు, బాగా జీవిస్తారు, చక్కగా జీవించి చక్కగా మరణిస్తారు, మరొకరు ఘోరంగా జీవించి ఘోరంగా మరణిస్తారు, ఒకరు చిన్నతనంలోనే మరణిస్తారు, మరొకరు పండు ముసలి అయిన తరువాత మరణిస్తారు - ఈ విధంగా ఎందుకు జరుగుతోంది? ఈ సృష్టిలో ఒక భాగం భౌతికమైనది.  మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. భౌతికత అన్నది భౌతిక నియమాల ప్రకారంగా పని చేస్తుంది. మీరు దానితో అనుసంధానమై ఉంటేనే, ఈ భౌతిక అంశాలలో రాణించగలరు. ఇప్పుడు మీరు ఒక గొప్ప భక్తులని అనుకొందాం. కానీ, మీకు కారు ఎలా నడపాలో తెలియదు. మీరు ఊరికే అక్కడ కూర్చొని “శివా” అని ఏక్సిలేటర్ తొక్కితే మీరు మరణిస్తారు.  ఔనా..?  ఔనా.. కాదా..?

ఈ భౌతిక సృష్టిలో మీరు వాటితో అనుసంధానమై ఉండాలి. ఈ సృష్టిలో మరొక కోణం, అభౌతికమైనది. మీరు భౌతికతలో ఎంత గొప్పగా ఉన్నసరే.. మీరు గనక జీవితంలోని ఆ కోణంతో సరిగ్గా లేకపోయినట్లైతే, అది మీకు ద్వారాలు తెరవదు. జీవితంలోని ఆ కోణం మీకు తెరుచుకోవాలనుకుంటే, మిమ్మల్ని మీరు.. దానితో పరిచయం చేసుకోవాలి. మిమ్మల్ని మీరు కేవలం ఎదైతే భౌతికమో దానితో మాత్రమే పరిచయంలో ఉంచుకుంటే ఏదైతే అభౌతికమైనదో, అది మీకు ద్వారాలు తెరువదు. మీరు దానితో గనుక సంభాషణలోకి వస్తే, అప్పుడు ఆ కోణం కూడా మీకు అనుభూతిలోకి వస్తుంది.

మీరు ఈ భౌతికంలో ఎన్ని విషయాలు సరి చేసినప్పటికీ, ఆ కోణం మీతో సహకరించదు. దానిని, మీరు మరొక విధంగా సరిచేయవలసి ఉంటుంది. అందుకని ఎవరో ఒకరు వారి జీవితాన్ని బాధతో అనుభూతి చెందుతూ ఉంటారు. మరొకరు, వారి జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు.  అసలు విషయం ఏమిటంటే..  ఒక విషయం భౌతికమైనది, ఒక విషయం అంతర్ముఖమైనది. చాలావరకు మానవులకు ఉన్న బాధలు 95 శాతం లోపలివే..! కేవలం కొద్దిమంది ప్రజలు మాత్రం, ఏదో బాధతోనో.. ఏదో రోగంతోనో.. బాధపడుతున్నారు. వారి శరీరం, వారిని బాధ పెడుతోంది. మిగతావారందరి బాధలు లోపలినుంచి వస్తున్నవే..!! దీనిని మీరు తలుచుకుంటే,  ఇప్పటికిప్పుడు మార్చేసుకోవచ్చు. మీ మనస్సు మీలోపల సృష్టిస్తున్న బాధని.. మీరు గనక ఇప్పటికిప్పుడు.. మీ మనస్సు మార్చుకుంటే.. మీరు దానిని ఆపేయవచ్చు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు