ఆనందాన్ని తెలుసుకోవడానికి బాధను రుచి చూడాల్సిన అవసరం లేదని, ఎల్లప్పుడూ ఆనందంతో ఉండడం సులభమేనని సద్గురు చెబుతున్నారు.

ప్రశ్న: మీరు ఒక స్థాయి ఆనందంలో నిలబడడం గురించి మాట్లాడారు. కానీ, ఆ ఆనందాన్ని అనుభూతి చెందాలంటే,  మీరు మరొకటి కూడా చూసి ఉండాలి కదా..? నాణేనికి మరొకవైపు కూడా చూడనిదే.. మీరు దానిని ఎలా అనుభూతి చెందగలరు..?

సద్గురు: మీరు బాహ్య వాస్తవాలను అంతర్వాస్తవాలకు పొడిగిస్తున్నారు. అందుకనే, మీకు చీకటి తెలిస్తే తప్ప వెలుగు తెలియదనుకుంటున్నారు. ఇది నిజమే..! మీకు బాధ తెలిస్తే తప్ప సుఖం తెలియదు. ఇది కూడా నిజమే..! కానీ,  ఆనందం తెలియాలంటే, దు:ఖం తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆనందం అనేది మీరు చేసేది కాదు, ఆనందం అనేది మీరు పొందేదీ కాదు. మీరే.. మీ స్వభావమే ఆనందం..!! మీరు కనుక, మీ మనసుతో ఎంటువంటి చిందరవందర చెయ్యకపోతే మీరు సహజంగా ఆనందంగానే ఉంటారు.. ఔనా..?కాదా..?

అందుకని, ఇది మీరు పొందే ఒక స్థితి కాదు. మీరే ఆనందం. మీరు దానిని కోల్పోకుండా చూసుకోవాలి..అంతే..!

మీరు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు,  సహజమైన మీ స్వభావం వల్లే మీరు ఎంతో ఆనందంగా ఉండేవారు. ఆ సమయంలో ఎవరో ఒకరు మిమ్మల్ని ఆనందంగా లేకుండా ఉండేలా చేయవలసి వచ్చేది. ఇప్పుడు, వేరే ఎవరో మిమ్మల్ని సంతోష పెట్టాలి. అందుకని, ఆనందం అనేది మీరు పొందేదీ కాదు, మీరు సాధించేదీ కాదు. అది కేవలం మీ సహజ స్వభావానికి మీరు చేరుకోవడం. ఇది మీరు తిరిగి మీ ఇంటికి రావడం లాంటిది....! మీకు గనుక దీనిని పాడు చేసుకోకుండా ఉండడం ఎలాగో  తెలుసుకుంటే, ఆనందం అనేది మీ సొంతం. ఇది, సహజంగానే ఉంటుంది. అందుకని, ఇది మీరు పొందే ఒక స్థితి కాదు. మీరే ఆనందం. మీరు దానిని కోల్పోకుండా చూసుకోవాలి..అంతే..!! అందుకే ఇది వైరుధ్యమైన వాటిమీద ఆధారపడదు. ‘మీకు ఆనందం తెలియాలంటే.. మీకు దు:ఖం తెలియాలి’ అనే మాట నిజమైనది కాదు. దు:ఖం అంటే తెలియకుండా సహజంగానే ఆనందంగా ఉండగల సామర్థ్యం మీకు ఉంది. జీవితంలో వివిధ స్థితులను అనుభూతి చెందలేకపోవడం, ఆనందం కాదు. మీరు వాటిని అనుభూతి చెందగలరు. మీరు ప్రతిదానినీ కూడా అనుభూతి చెందగలరు. మీరు ఒక సినిమాకి వెళ్తారు. అది ఎంతో విషాదకరమైన సినిమా అనుకోండి.. మీరు దానిని ఆనందిస్తారా..? మీరు ఏడుస్తారు..ఆ తరువాత దానిని ఆనందిస్తారు. మీరు ట్రాజడీని ఆనందిస్తారా..?..లేదా..? అయితే మీరు షేక్స్పియర్ రచనలు చదవాలి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు