ప్రశ్న: ఆధ్యాత్మిక జీవితానికీ, లౌకిక జీవితనికీ మధ్య సమతుల్యతను ఎలా తీసుకురావాలి ?

సద్గురు: మీరు దేనినీ సమతుల్యతలోనికి తీసుకురావాల్సిన అవసరం లేదు..! మీరు చెయ్యాల్సినదంతా.. మీ సమయాన్ని సానుకూలం చేసుకోవాలి. ఉదాహరణకు మీ ఆధ్యాత్మిక క్రియలను చేయడానికి రోజూ ఒక గంట సమయం పడుతుందనుకోండి. మీ పని మధ్య ఇంకా ఈ సాధన చేసే సమయం మధ్యలో ఉన్న సమయాన్ని మీరు సరిగ్గా నియంత్రించుకోవాలి. మరేదీ నియంత్రించవలసిన అవసరం లేదు. ఎందుకంటే.. ఏవీ ఒకదానితో ఒకటి ఘర్షణలో లేవు. మీ ఆధ్యాత్మిక ప్రక్రియకూ మీరు వీధిలోకి వెళ్ళి చేయవలసిన యుద్ధానికీ. ఎటువంటి ఘర్షణా లేదు, కొంచెం సమయాన్ని ఎలా సానుకూలం చేసుకోవాలో మీరు తెలుసుకోవాలి.

ఆధ్యాత్మికతకూ, ఇంకా మీరు లౌకికం అని దేనినైతే అంటున్నారో దానికీ ఎటువంటి ఘర్షణా లేదు అన్నప్పుడు, నేను ఆ రెండూ రెండు విభిన్నమైన విషయాలు కాదు అంటున్నాను.

మీరు ఒక సినిమా చూద్దాము అనుకున్నారనుకోండి - అప్పుడు మీ కుటుంబంతో గడిపే సమయాన్నో, లేదా మీ పనిలో కొంచం సమయాన్నో మీరు సానుకూలం చేసుకుంటారు కదా. ఈ రోజున మీరు ఇక్కడికి వచ్చి ఈ రెండు గంటలూ ఇక్కడ కూర్చోవాలన్నా కూడా మీరు మరొక చోట మీ సమయాన్ని ఎడ్జస్టు చేసుకోవాలి.  అవునా..కాదా..? ఇది ఎల్లప్పుడూ ఇలానే ఉంటుంది కదా..? మీరు ఒక చోట ఉంటే మరోకచోట సమయాన్ని కొద్దిగా ఎడ్జస్టు చేసుకోవాలి, లేదా ఆ పనులను మీరు సరిగ్గా చేయలేరు. ఇదే కదా ఉన్నది..? మీకు తెలిసిన నియంత్రణను మీకు తెలిసినంతవరకూ మీరు చెయాలి. ఎవ్వరూ నూటికి నూరు శాతం చేయలేరు. కానీ దీనిని మేనేజ్ చేయగలుగుతారు.

నేను మీకు ఇచ్చిన సాధనలు కూడా ఎంతో పరిమితమైనవే..! రోజులో కేవలం 30 – 40 నిమిషాలు పడతాయి. మీరు దీనిని నియంత్రించగల సామర్ధ్యం గలవారే..! వీటి ద్వారా మీరు క్రమంగా ఇంకా సున్నితంగా మారడాన్ని మీ చుట్టూ ఉన్న ప్రజలు గమనిస్తారు. మీకు కోపం రాదు అవునా..? అప్పుడు వారు, దీనివల్ల వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఇవన్నీ చెయ్యనిస్తారు. మీరు ఇందాక చెప్పినట్లు, మీ ప్రతి పెట్టుబడి కూడా మీకు ఫలాన్ని ఇవ్వాలి. లేకపోతే, అది కుదరదు.. అంతే కదూ..? ప్రతీ పెట్టుబడి కూడా మీకు ఫలితాన్ని ఇవ్వాలి లేకపోతే, అది మీకు నష్టం. మీరు ఆ పెట్టుబడిని తీసేస్తారు లేదా ఇంకా అందులో పెట్టుబడి పెట్టడం మానేస్తారు. ఆధ్యాత్మికతకూ, ఇంకా మీరు లౌకికం అని దేనినైతే అంటున్నారో దానికీ ఎటువంటి ఘర్షణా లేదు అన్నప్పుడు, నేను ఆ రెండూ రెండు విభిన్నమైన విషయాలు కాదు అంటున్నాను. వాటి మధ్య ఘర్షణ లేదని అంటున్నాను. అసలు మొదలుగా ఆ రెండిటి మధ్యా వ్యత్యాసమే లేదు. ఇక్కడ గీత ఎవరు గీస్తున్నారు..?

ప్రేమాశీస్సులతో,
సద్గురు