1998 వ సంవత్సరంలో, తమిళనాడులో... వచ్చే 25 సంవత్సరాలలో ఏమి జరుగబోతోందన్న దాని గురించి ఎంతో ప్రతికూలంగా అంచనాలు వేశారు. నాకు, సహజంగానే అంచనాలు అంటే నచ్చవు. ఎందుకంటే, ఎవరైతే అంచనాలు వేస్తారో వారికి ఒక ప్లాన్ కానీ, దానిని నిర్వహించే సామర్థ్యంగానీ ఉండదు.

నేను మొదటి ఆరేళ్లు అంటే 1998 నుంచి మొదటి ఆరేళ్లూ... ప్రజల హృదయాలలో చెట్లను నాటడం మొదలు పెట్టాను. ఇక్కడ నాటడం ఎంతో కష్టమైన పని. 2004 లో జూన్ 2వ తేదీన అధికారికంగా “ప్రాజెక్టు గ్రీన్ హ్యాండ్స్ ని మొదలు పెట్టాం. మేము ఇప్పటికి 13 సంవత్సరాలు పూర్తి చేశాము. ఈ పదమూడు సంవత్సరాల్లో, తమిళనాడులోని ఫుల్ టైమ్ వాలంటీర్స్, స్కూల్ పిల్లలు, రైతులు, స్త్రీలు, పిల్లలు... అందరూ కలిసి 30 మిలియన్ల చెట్లను తమిళనాడులో నాటారు. ఇది తమిళనాడు పచ్చదనాన్ని ఎంతగానో పెంచింది. ఈ సంవత్సరం, మేము మరో 4 మిలియన్ చెట్లను నాటాలనుకుంటున్నాము.

వేలకొద్దీ ప్రజలు వారి వివాహాల్లో, వచ్చిన వారికి మొక్కలను బహుమతులుగా ఇస్తున్నారు.

అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, చెట్లను సంరక్షించడమనేది సంస్కృతిగా మారడం మొదలైంది. వందలకొద్దీ, వేలకొద్దీ ప్రజలు వారి వివాహాల్లో, వచ్చిన వారికి మొక్కలను బహుమతులుగా ఇస్తున్నారు. స్వీట్స్.. ఏవైతే ప్రజల ఆరోగ్యాలను పాడుజేస్తాయో అటువంటివి కాకుండా.. ఈరోజు ఎన్నో వివాహాల్లో చెట్లను ఇస్తున్నారు. చెట్లను సంరక్షించడం, తమిళనాడులో ఒక సంస్కృతిగా మారింది. ఇది ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ వల్లే..!వందలకొద్దీ స్కూళ్ళు, ఇందులో నిమగ్నమై ఉన్నాయి. వేలకొద్దీ పిల్లలు, “గ్రీన్ కార్ప్స్” గా ఇందులో పాలుపంచుకుంటారు .

మనమందరమూ కూడా, ఈ గ్రహంనుంచే అన్నీ గ్రహిస్తున్నాం..కాబట్టి మనకి, దీనిపట్ల బాధ్యత కూడా ఉందన్న ఎరుక తమిళనాడులో ఎంతో ప్రముఖంగా పెరిగింది. పల్లెటూళ్లలో ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ అన్నది - ఎంతో అద్భుతంగా జరిగింది. ఇక్కడ ప్రజలు, ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. వీళ్ళందరూ పర్యావరణవేత్తలు కాదు. వీరికి గ్లోబల్ వార్మింగ్ గురించిగానీ, వాతావరణంలో మార్పులగురించి గానీ.. చాలా కొద్దిపాటి జ్ఞానం మాత్రమే ఉంది. కానీ ఇక్కడి ప్రజలు వారి చుట్టూరా జరుగుతున్న చిన్నపాటి మార్పులను గమనించి, వారు ఏమి చేస్తే అవి మెరుగు పడతాయో - అన్నది గుర్తించారు. ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ ఎంతో అసాధారణ విజయాన్ని సాధించింది. ఇది ఈ ప్రజల, శ్రమనూ, మనస్సునూ చూరగొన్నది.

ఈ గ్రహం మీద మనం నడుస్తున్నప్పుడు, ఈ భూమీ, మన శరీరం అన్నవి ఈ పర్యావరణంలో ఒక భాగం మాత్రమే..! అందుకని, మనం దీని పట్ల కొంచెం సున్నితంగా, ఔనత్యంతో వ్యవహరించాలి.

నేను ప్రతివారికి చేసే విన్నపము ఏమిటంటే -  మీలో ప్రతిఒక్కరూ కూడా, మీకు పిల్లలు పుటినప్పుడు ఒక చెట్టు నాటండి, వాడు నుంచుంటే ఇంకో చెట్టు నాటండి, వాడు స్కూల్ కి వెళ్తే మరొక చెట్టు నాటండి. అతను లేదా ఆమెకు వివాహం జరిగితే ఒక చెట్టు నాటండి, ఎవరైనా మరణిస్తే ఒక చెట్టు నాటండి. ఏదో ఒక కారణం వెతుక్కొని చెట్లని నాటండి. ఎందుకంటే, మనం ఎదైతే శ్వాసిస్తున్నామో అది అక్కడినుంచే వస్తుంది కాబట్టి. ఇంకో మాటలో చెప్పాలంటే, మనం దేనినైతే పర్యావరణం అంటున్నామో అది కేవలం పర్యావరణం కాదు. అది మన జీవితాల్లో ఒక భాగం. ఈ గ్రహం మీద మనం నడుస్తున్నప్పుడు, ఈ భూమీ, మన శరీరం అన్నవి ఈ పర్యావరణంలో ఒక భాగం మాత్రమే..! అందుకని, మనం దీని పట్ల కొంచెం సున్నితంగా, ఔనత్యంతో వ్యవహరించాలి. తమిళనాడు ప్రజలూ, ఇంకా దేశంలోని ప్రజలూ, ఈ ప్రపంచం అంతా కూడా, తమిళనాడులో సాధారణమైన ప్రజలు చేసిన ఈ పనిని, అది తీసుకు వచ్చిన ప్రముఖమైన మార్పుని, తమిళనాడులో పచ్చదనాన్ని పెంచిన వైనాన్ని, చూసి స్ఫూర్తిని తెచ్చుకోవాలి.

మేము అటవీ శాఖకీ, గవర్నమెంట్ అధికారులకీ, ఇంకా ఇది జరిగేందుకు ఎవరెవరైతే మాకు సహకరించారో, వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.

మన జీవితంలో ప్రతి క్షణం..

అవి ఏవైతే వదిలేస్తున్నాయో

వాటిని మనం శ్వాసిస్తున్నాము

మనం ఎదైతే వదిలిపెడుతున్నామో

అవి వాటిని శ్వాసిస్తున్నాయి

లావాదేవీ ఎల్లప్పుడూ జరుగుతోంది.

 ఇది ఒక భాగస్వామ్యం.

  ఇది ఒక అనుబంధం

ప్రేమాశీస్సులతో,
సద్గురు