దేవుడు ఉన్నాడా లేదా అన్న ప్రశ్నకి గౌతమ బుద్ధుడి సమాధానం మనల్ని ఆలోచించేలా చేస్తుంది. ఇంతకీ బుద్ధుడు సమాధానమేంటి? ఎందుకలా ఇచ్చాడో ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.

మీరు గౌతమ బుద్ధుడి గురించి విన్నారా..? ఒకసారి గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కూర్చొని ఉన్నాడు. అది తెల్లవారు ఝామున...సూర్యుడు ఇంకా ఉదయించలేదు. ఇంకా చీకటిగానే ఉంది. అక్కడికి ఒక మనిషి వచ్చి నిలుచున్నాడు. అలా మూలగా నీడ చాటుగా నిలుచున్నాడు. ఆయన రాముడికి గొప్ప భక్తుడు.

భక్తులు వాళ్ళు జీవితాల్లో ఏమి చేసినా సరే ప్రతిదానిని రాముడిగానే మార్చేస్తారు. వాళ్ళు భగవంతుడి నామం తప్ప మరొకటి ఉచ్చరించరు. మిమ్మల్ని రమ్మని చెప్పాలంటే రామ-రామ అంటారు. మిమ్మల్ని వెళ్ళమని చెప్పడానికి కూడా రామ-రామ అంటారు. వాళ్ళకి ఏమి కావాలన్నా సరే రామ-రామ అంటారు. వారు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలని అనుకుంటే రామ-రామ అంటారు. వాళ్ళు ఏమి చేసినా సరే, రాముడు మాత్రమే..! రాముడు తప్ప మరేదీ లేదు. వాళ్ళు భాగవన్నామం తప్ప ఇంకేదీ ఉచ్చరించరు. ఈ మనిషి భగవంతుడిని ఎంతో గంభీరంగా తీసుకున్నాడు. ఆయన జీవితంలో కేవలం రాముడే. మరొకటి లేదు.

అసలు భగవంతుడు ఉన్నాడా..? అని. గౌతముడు ఈ మనిషిని చూసి, “లేడు” అని నిక్కచ్చిగా చెప్పారు.

సరే..! వయసు మీద పడిపోతుంది. ఇప్పుడాయనకు ఒక సంశయం కలిగింది. ఒకవేళ భగవంతుడు లేడనుకో అప్పుడు నా జీవితమంతా రామ-రామ అని అంటూ వృధా అయిపోతుంది కదా....? ఆయనకి భగవంతుడు ఉన్నాడని తెలుసు. ఆయన ఆలయాలను కూడా నిర్మించారు. అయినా..ఎక్కడో ఒక చిన్న సంశయం. ఆయన దానిని తేల్చుకోవాలనుకున్నాడు. ఇప్పుడు, ఇక్కడ ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఉన్నారు. అందుకని ఈయనని, ఆ విషయం అడగడం కోసం ఇక్కడికి వచ్చి అలా మూలగా నిలుచుని ఈ ప్రశ్న అడిగాడు. అసలు భగవంతుడు ఉన్నాడా..? అని. గౌతముడు ఈ మనిషిని చూసి, “లేడు” అని నిక్కచ్చిగా చెప్పారు. ఈ మాట వినేసరికి శిష్యులందరూ కూడా “ష్..హమ్మయ్య.. ఎంత పెద్ద ఉపశమనం” అనుకున్నారు. నిజంగానే ఎంతో పెద్ద ఉపశమనం కదా..? మొట్టమొదటి సారి బుద్ధుడు ఖచ్చితంగా భగవంతుడు లేడని చెప్పారు. అంతటా సంతోషం నిండిపోయింది. ఒకసారి ఊహించుకోండి, భగవంతుడు లేడు అంటే ఎంత స్వేచ్చ..! మీ జీవితమంతా మీదే. అంతా సంతోషంతో నిండిపోయింది. సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు.  సరే, సాయంత్రం అందరూ మళ్ళీ గొప్ప ఆనందంతో సమావేశం అయ్యారు.

మరో మనిషి వచ్చి మూలగా వెళ్ళి అక్కడ నిలుచున్నాడు. ఇతను ఒక చార్వాకుడు. మీరు, చార్వాకులగురించి విన్నారా..? చార్వాకులంటే పూర్తిగా లౌకికవాదులు. వాళ్ళు దేనినీ పూర్తిగా చూస్తే తప్ప నమ్మరు. ఈ చార్వాకుడు ఎంత గొప్ప నిపుణుడు అంటే, మీరు ఏ నమ్మకానికి చెందినవారైనా, మీరాయనతో కనుక పది నిముషాలు మాట్లాడితే, ఆయన మీకు, “భగవంతుడు లేడు” అని నిరూపించగలడు. ఎన్నో వేల మంది ప్రజలకు ఈయన “దేవుడు లేడు..దేవుడు లేడు....” అని నిరూపించాడు. ఆయనికి వయసు మీద పడుతోంది. ఒక సంకోచం వచ్చింది. “ఒకవేళ దేవుడు ఉంటే..” అనే సంశయం కలిగింది..! ఒకవేళ దేవుడు ఉంటే, ఈ దేవుడిని నమ్మేవాళ్ళందరూ - ఒక నరకం ఉంటుంది, అక్కడ చాలా హింసలు పెడతారు అని చెబుతారు. ఒకవేళ నేను గనక అక్కడికి వెళితే, నేను దేవుడు లేడు..అని చెబుతున్నాను కాబట్టి, ఆయన నన్ను ఊరికే వదిలేస్తాడా..? అన్న ఒక చిన్న సంశయం వచ్చింది. దానిని నిర్ధారణ చేసుకోవాలనుకున్నాడు.

నేను భగవంతుడు ఉన్నాడని నమ్మవచ్చు లేదా లేడనీ  నమ్మవచ్చు.

సరే..! ఇక్కడ ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఉండడంతో ఈయన వచ్చి బుద్ధుడిని ఆ ప్రశ్న అడిగాడు, “అసలు భగవంతుడు ఉన్నాడా..? “ అని. గౌతముడు ఆయనని చూసి “ఔను ”  అన్నాడు. మళ్ళీ శిష్యులందరూ ఒక రకమైన అయోమయంలో పడిపోయారు. పొద్దున్న ఈయన లేరు - అని చెప్పారు. అప్పుడు ఎంతో ఆనందం నిండిపోయింది. ఇప్పుడు ఉన్నాడు అంటున్నారు. ఈయన ఏమైనా ఆట ఆడుతున్నాడా..? అనుకున్నారు. నిజానికి మీరు ఒక విషయాన్ని నమ్మినా, నమ్మకపోయినా....నేను నమ్మవచ్చు. నేను భగవంతుడు ఉన్నాడని నమ్మవచ్చు లేదా లేడనీ నమ్మవచ్చు. ఈ రెండూ, రెండు ప్రత్యేకమైన స్థానాలు కావు. రెండిటిలోనూ మీరు, దేనినో నమ్ముతున్నారు. మీకు నిజమేమిటో తెలియదు. మీ సమస్య ఏమిటంటే  మీకు తెలియనిది, “నాకు తెలియదు” అని ఒప్పుకునేంత నిజాయతీ మీలో లేకపోడమే..!! అదే మీ సమస్య. ఔనా..? కాదా..?

మీరు నిజంగా ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, మొట్టమొదటి అడుగు ఏమిటంటే, మీకు తెలియనిది మీకు తెలియదు అని చూడగలగడం. ఒకసారి మీరు నాకు తెలియదు అని చూడగలిగిన తరువాత మీకు తెలుసుకోవాలి అని ఆకాంక్ష కలుగుతుంది. ఈ తృష్ణ వచ్చిన తర్వాత, నిజంగా మీకు తెలియనిది ఏదో తెలుసుకోవడం - అన్నది జరగవచ్చు. ఔనా ..? కాదా ..? మీకు ఏదైతే తెలియదో, దానిని మీరు నమ్మారనుకోండి..మీరు ఆ తృష్ణని పాడు చేసుకుంటున్నట్లే..! “నాకు తెలియదు” అనే విషయాన్ని తెలుసుకోవడం ఎంత శక్తివంతమైనదో, ఎంత గొప్పదో మీకు తెలియడం లేదు. మీ సమస్య అంతా అదే..!

ప్రేమాశీస్సులతో,
సద్గురు