సద్గురు వాక్యాలను తెలుగులో అనువాదించిన పుస్తకాల గురించి పూర్తి వివరాలు ఇందులో తెలుసుకోండి. వీటిని లోగిలి, ఈశా షాప్పి, అమెజాన్, కొనుగోలు చేసుకోవచ్చు.

హిమాలయ రహస్యాలు

సద్గురు - యోగి, మర్మజ్ఞుడు, దార్శనిక వేత్త అయిన సద్గురు ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక గురువు. మంత్రముగ్ధులను చేసే వారి ప్రగాఢ జ్ఞానం - కార్యసాధనా శైలీ, వారి జేవితం - వారి కార్యకలాపాలు, "యోగా" అంటే ఎదో పురాతన నిగూఢ శాస్త్రం కాదని, ఈ రోజుల్లో కూడా మనకు చాలా ఉపయోగపడే ఒక సమకాలీన శాస్త్రమని గుర్తుచేస్తాయి. సద్గురు ప్రసంగాలు ఆయనకు ఒక గోప్ప వక్తగా, అభిప్రాయ నిర్మాతగా(opinion-maker) అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. అందరికీ తక్షణ, అలాగే శాశ్వత శ్రేయస్సులను అందించాలనే ధ్యేయంతో సద్గురు ఈశా ఫౌండేషన్(www.ishafoundation.org) అనే స్వచ్చంద సంస్థను స్థాపించి, దాని ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

w4

ప్రతి సంవత్సరం ఈశా ధ్యానులు జట్టుగా కలసి హిమాలయ యాత్రకు వెళతారు. శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు చేపడుతూ వస్తున్నా యాత్ర ఇది. ఈ యాత్రికులు హిమాలయాల పట్ల ఒక నిర్భంధ వ్యామోహానికి లోనౌతారు. ఈ వ్యామోహం పురాతన కాలం నుంచీ ఉంది. ఈ వ్యామోహం సాహసం చేయడం కోసం కావొచ్చు, అత్యత్భుతమైన అతి స్ఫూర్తిదాయకమైన ప్రకృతితో ముఖాముఖీ కావడం కోసం కావచ్చు. నిర్జనారణ్యపు హృదయంలోని స్తబ్దతను రుచి చూడడం కోసం కావచ్చు, లేదా వీటన్నిటి కోసం కావచ్చు. పర్వతారోహకులు, అన్వేషకులు, భక్తులు, సాధువులు, సంచార జాతుల వాళ్ళు, యోగులు - అందరిలో ఆకాశాన్నంటే ఈ అధ్భుత భూభాగాన్న్ని అనుభూతి చెందాలనే బలమైన ఆకాంక్ష ఉన్నట్లు అనిపిస్తుంది.

ఈ పుస్తకం కేవలం హిమాలయాలను గురించే కాదు. ఎయినా హిమాలయాలు లేకపోతె ఈ పుస్తకం ఉండేదికాదు. ఒకసారి విషయంగా, ఒకసారి ప్రేరణగా, ఒకసారి అలంకారంగా, ఈ రచనలో పర్వతాలు ఒక్కొక్కసారి ఒక్కోపాత్రను నిర్వహిస్తాయి. అవి లేకుండా ఈ పుస్తకంలో కొన్ని ప్రశ్నలకు తావేలేదు. కొన్నిసార్లు అవి మనం అడుగుతున్నా దానితో సంబంధం లేనివిగా తోచవచ్చు, అయినా అవి అంతర్లీనంగా ఈ పుస్తకానికి ఆధారంగా నిలిచాయి.

మర్మజ్ఞ విలాసంw3

అంతుపట్టని మర్మజ్ఞుడైన సద్గురు ఈ పుస్తకంలో జీవితం, మరణం, పునర్జన్మ, బాధ, కర్మ, ఇంకా ఆత్మజ్ఞానం కోసమై సాగించే ప్రయాణాల గురించి వివరిస్తూ పాఠకులను  ఉత్కంట భారితులను చేస్తారు.

సద్గురు నిర్మొహమాట, నిష్కపట, నిరాడంబర రీతిలో ధర్మం, మతం, నైతికతల పట్ల సాధారణంగా మనకు ఉండే అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ, పిరికివారు ఏ ప్మాత్రం ఆలోచించలేని విషయాల గురించి ఆలోచించేలా పాఠకులను ప్రేరేపిస్తారు.

మర్మజ్ఞ విలాసం ఆలోచనలను రేకెత్తించే, స్ఫూర్తినిచ్చే ఒక మనోహర పఠనం. ఒకరు తన అస్తిత్వం మధ్యలోకి చేసే తీర్ధయాత్రకు ఇది ఆరంభం. - డి. ఆర్. కార్తికేయన్, మాజీ డైరెక్టర్ జనరల్  (CBI & National Human Rights Commission)

సద్గురుని కలిసిన ఆ క్షణం నా జీవితాన్ని నిర్వచించిన క్షణం. అది జీవితం పట్ల, దానితో ఎదురయ్యే సవాళ్ళ పట్ల నాకున్న దృక్పధాన్ని మార్చేసింది. సద్గురు జ్ఞాన, వివేక సారాల అందమైన సమాహారమే ఈ మర్మజ్ఞ విలాసం - రవి వెంకటేశన్, మాజీ చైర్మన్, మైక్రోసాఫ్ట్ ఇండియా

మీ పిల్లలకు స్ఫూర్తినివ్వండి - ప్రపంచాన్ని చైతన్యం చెయ్యండి

w2'చదువు' పై ఈనాటి త్వరితగతి జీవనంలో విద్యార్థులు(పిల్లలు). వాళ్ళ తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యల్ని, ఎన్నో అభిప్రాయ భేదాల్ని, ఆలోచనల్ని సద్గురు పరీక్షిస్తున్నారు. ఈ ప్రయత్నాలో అనన్యమైన ఒక కొత్త మార్గాన్ని సద్గురు సూచిస్తున్నారు. ఆయన చెప్పే 'కీలకల్మైన పరిష్కారం' పసివాళ్ళలోని అత్యంత మౌలికమైన ఆసక్తిని పునరుద్ధరించటమే. "నేర్చుకోవాలన్న తపనను పసివాళ్ళలో ఉద్దీపింప జేయగలిగితే అతడు నేర్చుకుంటూనే వుంటాడు".

 

వాటితోపాటు మౌలికంగా విద్యార్జనలో ఈనాడు చోటు చేసుకుంటున్న మౌలికమైన అభివ్యక్తి దోషాల పట్ల సద్గురు స్పందిస్తున్నారు.

 

 

ఆనందలహరి

జీవితంలోని కుటుంబం, వృత్తి, సంబంధాలు, బాధ్యతలు వంటి వివిధ అంశాలను నిర్వహించడంలో,  అలాగే ఒత్తిడి, దుర్ఘటనలు ashinchuవంటి వివిధ జీవిత పరిస్థితులను నెగ్గుకురావడంలో తలమునకలై ఉన్న ఓ సామాన్య వ్యక్తికి ఈ పుస్తకం ఒక సమర్పణ! ఒక వ్యక్తి తన జీవితాన్ని హుందాగా, సునాయాసంగా జీవించటానికి కావలసిన చిట్కాలను, లోగుట్టులను అందించే పుస్తకం ఇది.

సద్గురు తన ప్రగాఢ జ్ఞానం, వాడి తర్కాలకు ఆసక్తికరమైన పిట్టకథలను, హాస్యోక్తులను జతచేసి ఇచ్చిన సందేశాల సంకలనమే ఈ పుస్తకం. సద్గురు ఈ సందేశాల ద్వారా మన రోజువారీ సమస్యలకు సరికొత్త పరిష్కారాలను చూపుతూ, ఆ సమస్యల పట్ల మనకున్న పాతకాలపు దురభిప్రాయాలను నిర్దాక్షిణ్యంగా త్రుంచివేస్తున్నారు.

జీవితాన్ని అన్ని విధాలుగా శోధించి, సంపూర్ణంగా అనుభవించమని ఈ పుస్తకం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఒక వ్యక్తి తన జీవిత ప్రయాణాన్ని ఆనందంగా కొనసాగించడానికీ, తన లక్ష్యాలను చాలా సునాయాసంగా  సాధించడానికీ దోహదపడే సరళం, శక్తిమంతమైన రెండు సాధనలు (ఈశా క్రియ, కల్ప వృక్ష ధ్యానాలు) ఈ పుస్తకం చివరలో అందించబడ్డారు. జాతి, మత, కుల, భాషా భేదాలు లేకుండా అందరికీ కనీసం ఒక చుక్క ఆధ్యాత్మికతనైనా ఈ పుస్తకం అందిస్తుందని మేము నమ్ముతున్నాం.

ఆసక్తికరమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించడానికీ, ప్రేమ, వెలుగు, ఆనందాలతో నిండిన ప్రపంచాన్ని సృష్టించడానికి మేము చేసే ప్రయత్నంలో మాతో చేతులు కలపడానికీ ఈ పుస్తకం ఒక ప్రేరణ అవుతుందని ఆశిస్తున్నాం.

 

బాధలెందుకు

Badalenduku coverఈ పుస్తకంలో సద్గురు 'బాధలెందుకు?' అన్న విషయం మీద ఒక కొత్త దృక్కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ విషయాన్ని గురించిన ప్రశ్న మానవాళిని అనాదిగా బాధిస్తూనే వుంది. ఆ సమస్యను పరిష్కరించడానికి, మనిషి ఎన్నో కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూనే వున్నాడు. పరిష్కారమార్గాలు ఎంతగా అన్వేషించినా ఈ ప్రపంచంలో 'బాధ'కు అంతం లేదు. అది అడుగడుగున కనిపిస్తూనే వుంది.

'బాధ అనేది అంతం లేనిది' అన్న విషయం ప్రసిద్ధ చర్చనీయాంశంగా వుండగా సద్గురు ఆ విషయం మీద కొత్త కోణంలో చర్చ సలుపుతున్నారు.

 

సద్గురు సుభాషితాలుw1

'ఆశామోహములు దరిరానీకోయి' అన్నా - అలా వాటిని దగ్గరికి రానీయకపోవడం కష్టం. అందుకే ఆశపడటంలో తప్పు
లేదు. ప్రతిఒక్కరూ ఆశను పెంచుకోవాలి. ఆశ లేనిదే ఈ ప్రపంచం లేదని  గుర్తించాలి.

సంతోషమే స్వర్గతుల్యం అంటారు. అలాంటి  సంతోషాన్ని ఎవరికోసమో ఎందుకోసమో పణంగా పెట్టొద్దు. మీ సంతోషం మీదే. ఆ సంతోషం హాయిగా అనుభవించండి. అలాగే స్వార్థం కూడదంటారు కానీ స్వార్థం లేకపోతే నీవు ఎదగలేవు. నీకంటూ ఏదీ మిగలదు కనుక మనకు స్వార్థం కావాలి.   పరభాగ్యోపజీవి అనే పేరుకన్నా, స్వార్థపరుడనే బిరుదు మిన్న. అందువల్ల హాయిగా సుఖపడతాం.

ఇలాంటి నిత్యసత్యాల అనుభవసారాల నుంచి ఉదహరించ బడిన చిన్న చిన్న కథలతో సద్గురు సుభాషితాలు.

మరి కొన్ని..

భలే రుచి - బోలెడంత ఆరోగ్యం

w5

 

 ఆనందం 24 x 7

Anandam 24 X 7 - Joy Telugu