మహాశివరాత్రి వేడుకలో లక్షల మందిని ఉర్రూతలూగించిన రాకీస్ బృందం అందించిన ప్రదర్శన, అందరిలోనూ ఇది ఇంకా కావాలి అన్న భావనను మిగిల్చింది. రాకీస్ బృందం వారికి ఉగాండాలో కాకుండా వేరే ప్రాoతానికి వెళ్ళవలసిరావటం ఇదే మొదటిసారి. వారి వద్ద అందుకు కావలసిన డబ్బు లేదు, ప్రోగ్రాంకు అవసరమైన బట్టలూ లేవూ!

బృందంలోని ప్రతిభగల నిరుపేద యువకుల్లోని ఒకరైన బ్రియన్, వారు ఎలా హిందూ మహా సముద్రాన్ని దాటి తమ కలను సాకారం చేసుకున్నారో ఆ వివరాలు చెబుతున్నారు.

“నేను కల కంటున్నానా అని నాకు అనిపించింది. ఎందుకంటె, కొద్దిరోజుల క్రితం వరకూ కూడా మాలో ఎవరికీ ఉగాండా దాటి అవతల వేరే ప్రపంచం ఉంది అని కూడా తెలీదు. ఇప్పుడు మేము ఇండియాలో, సద్గురు ఎదుట, ఇంకా లక్షల మంది ముందు ప్రదర్శననిస్తున్నాము..! జనంలో కొంత మంది మా ప్రదర్శనను చూస్తూ ఆశ్చర్యంతో నిలబడిపోయారు, మిగిలినవారు ఆనందంగా కేకలు వేస్తూ మా డప్పు శబ్దానికి నాట్యం చేయసాగారు. అన్నిటికంటే అద్భుతమైన విషయమేంటంటే, సద్గురు స్వయంగా మా బృందంతో కలుస్తూ స్టేజి పైకి రావటం! నాకు ఒక్కసారిగా మేమంతా సినిమా స్టార్లు అయిపోయినట్లుగా అనిపించింది!

మమ్మల్ని “ది రాకీస్ ట్రూప్” అంటారు, ఆ రాత్రి నేను మా బృందంలోని సభ్యుల వంక చూశాను, కొందరు అనాధలు, కొందరు ఒంటరి తల్లులచే విడిపోబడినవారు లేదా స్కూల్ మధ్యలో చదువు నిలిపేసినవారు, మిగితా వారు పునరావాస కేంద్రాల నుంచి వచ్చిన వారు. ఈ సభ్యులంతా అంతకుముందు ఎటువంటి ప్రోగ్రాము చేయలేదు పైగా వారికి సద్గురు ఎవరో కూడా సరిగా తెలియదు. ఇప్పుడు వాళ్ళంతా ఇక్కడ వారి ప్రదర్శన తర్వాత ఆశ్రమంలోని వారు ఇంకా ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన జనం పంచిన ప్రేమతో ముగ్ధులై ఉన్నారు. వారందరూ ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని ఎప్పటికీ నిలిచిపోయే నూతనోత్తేజంతో ఇళ్ళు చేరటాన్ని నేను చూశాను.

మనం నిజంగానే ఇండియా వెళ్తున్నామా?

జనవరిలో, మేము ఒక నెలలో ఆశ్రమంకి వచ్చి ప్రదర్శన ఇవ్వగలమా అని అడుగుతూ నాకు కాల్ వచ్చింది. క్రితం జూన్లో ఉగాండాలో ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాం జరిగినప్పుడు సద్గురు ఎదుట ప్రదర్శన చేశాం, సద్గురుతో సహా అందరూ మా ప్రదర్శనను అభినందించారు.

వారు నన్ను అడిగిన వెంటనే నేను “వస్తాం” అని చెప్పేశాను. కానీ ఇది సాధ్యపడటానికి మేము బోలెడన్ని అవాంతరాలను ఎదురుకోబోతున్నామని నాకు అప్పటికే తెలుసు.

మా భారతదేశ ప్రయాణం

ముందు ఊహించినట్లే మా బృందం సభ్యులంతా ఈ విషయం తెలియగానే ఆనందంలో మునిగిపోయారు. కాని మొదట  మేము కొన్ని సమస్యలను ఎదురుకోవాల్సి ఉంది..

మొదటిది..విమానం టికెట్లు కొనటానికి మా దగ్గర డబ్బు లేదు. రెండవది.. చాలా మంది సభ్యులు ఎన్నడూ ఉగాండా దాటి ఎక్కడికీ వెళ్ళనందువలన వారికి పాస్ పోర్ట్ లేవు. మూడవది...అంతర్జాతీయ వేదికపై ప్రదర్శనకు అవసరమైన మెరుగైన వాయిద్యాలు కాని ఆఫ్రికన్ దుస్తులు కాని ఏమీ మా వద్ద లేవు. దానిపైన, మేము ఇండియా విసాకి అర్హత పొందటానికి యెల్లో ఫీవర్ వ్యాధి నుంచి టీకా వేయించుకోవటానికి డబ్బు సేకరించాల్సి ఉంది.

మాకెవరికీ ఆర్ధికపరంగా సహాయాన్ని అందించే బంధువులు లేరు, మేము చాలా క్లిష్టపరిస్థితిలో ఉన్నాం అని మాత్రం చెప్పగలను.

కానీ మేము వెళ్లాలనుకుంటున్నాం అని మాత్రమే మాకు తెలుసు!

అయితే ఇప్పుడు కాకపోతె ఎప్పటికీ లేదు!

ఈ కొద్దిరోజుల్లో నేను పని చేసినంత అంతకుముందు ఎప్పుడు చెయ్యలేదు. అన్నిటికంటే మొట్టమొదటి పని డబ్బు సేకరణ. ఇదంతా సాధ్యపడటానికి ఉగాండాలోని 'లులు' అనే ఈశా మెడిటేటర్ పెద్ద పాత్ర పోషించారు. తను డబ్బు సమీకరణ కొసం ఉగాండాలోని ఈశా మెడిటేటర్స్ కి అనధికారిక లేఖ రాశారు. దానికి అమోఘమైన స్పందన వచ్చింది. తక్కువ ఇంకా మధ్యస్తంగా సంపాదన ఉన్న వారు కూడా మాకు సహాయం చేశారు. అయినప్పటికీ, ఆ డబ్బు మా అవసరాలు అన్నింటికీ సరిపడే అంత కాదు. అప్పుడు ఉగాండాలోని మా ఈశా టీచెర్ మమ్మల్ని పేరున్న కుటుంబాలకి పరిచయం చేశారు, ఆయన ఈశా మెడిటేటర్ కానప్పటికీ మా 20 మంది బృంద సభ్యులకు టికెట్లుకు సరిపడే అంత చెక్ రాసి ఇచ్చారు. మేము చాలా సంతోషపడ్డాము.

చెక్ మా చేతికి వచ్చేసరికి మేము టికెట్లు కొనటానికి అప్పటికి మాకు మిగిలిన వ్యవధి 24 గంటలు మాత్రమే. మాకు పేర్లు కూడా లేవు. కొంచెం విచిత్రమే అయినా ఉగాండాలోని ప్రజలు వారి పేర్లను తరచూ మారుస్తుంటారు. 13 సంవత్సరాల వయసుకి వచ్చేసరికి అప్పటికి వారి పేర్లను 5 సార్లు మార్చి ఉంటారు! కాబట్టి టికెట్లు కొనటానికి నేను పేర్లు పంపగానే, పాస్పోర్ట్లలో ఉన్న పేర్లు అవేనా ఆ పేర్లతో టికెట్లు కొనటం సాధ్యపడుతుందా అని 'లులు' కంగారుపడింది.

మొదటిసారి ఫ్లైట్ ఎక్కిన థ్రిల్!

మేము ఫ్లైట్ ఎక్కి కూర్చునే దాకా మేము ఇండియాకి వెళ్తున్నామని మేమే నమ్మలేకపోయాము. మాలో ఎవ్వరం మునుపెన్నడూ ఫ్లైట్ ఎక్కలేదు. కొంతమంది సభ్యులు కిటికిలోంచి బయటకి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. మిగిలినవారు వారి టివి సెట్స్ తో ఆడకుండా ఉండలేకపోయారు. మాకు ఇండియాలో ఆతిధ్యం ఇవ్వబోయే వారిపై గౌరవ సూచకంగా మేము శాఖాహార భోజనం ఆర్డరు చేశాము.

చాలా సార్లు విమానం కిందికి వంగి తిరిగి గాల్లోకి వచ్చింది. అప్పుడు నేను “అరె! ఆకాశంలో కూడా చిన్న రంద్రాలున్నాయే,” అని అనుకున్నాను

ఈశా యోగా కేంద్రంలో కొన్ని మరపురాని సంఘటనలు

పాములు!

మేము ఆశ్రమానికి రాగానే గమనించిన మొదటి విషయం, ఇక్కడంతా పాముల చిహ్నాలు ఉండటం. చాలా మంది సభ్యులు సువార్తా క్రిస్టియన్లు, అక్కడ పాముని దెయ్యానికి చిహ్నంగా సూచిస్తారు. కొందరు ఈశా అంటే భయపడిపోయి కాసేపు అంతా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. తర్వాత, వారంతా స్థిమితపడ్డారు- మేము అక్కడనుంచి వెళ్ళేలోపు 'లులు' మాకు పాము చిహ్నంలోని ఆధ్యాత్మక ప్రాముఖ్యతను వివరించింది.

చివరిలో, ఒక పాము ఉంగరము..

అక్కడ తల్లిలా మా యోగక్షేమాలు చూస్కున్న పెద్దావిడ మేము తిరుగు ప్రయాణమయ్యేటప్పుడు జ్ఞాపికగా మాకు పాము ఉంగరం ఇవ్వడం చాలా ఫన్నీగా అనిపించింది.

“ఓహ్! వీళ్ళకి ఇవ్వడానికి మనం వేరే ఏదైనా చూడాల్సింది,” అంటూ కంగారుగా లులు పెద్దావిడతో చిన్నగా అంది. అదివింటూనే మా బృందంలో ఒకరు లులుని పక్కకు పిలిచారు.

ఇది ఆమె ప్రేమ, కరుణకు చిహ్నం, లులు. దీన్ని తీస్కోవటం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది,” అని అతను చెప్పాడు.

వారి మర్యాద పూర్వకమైన వీడుకోలుకు నేను నిశ్శబ్దంగా వారిని చూసి నవ్వాను.

గురువుని కౌగిలించుకోవటం

ఒక విషయం మాత్రం నేను ఎన్నటికీ మరిచిపోలేను. మా ప్రదర్శన ముగిసిన అనంతరం, సద్గురు వచ్చి నన్ను కౌగిలించుకొని, అశ్రంలోని రెసిడెంట్స్ కొసం చిన్న ప్రదర్శన ఇవ్వమని అడిగారు. నేను ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాను.

జాగ్రత్తగా దాచిపెట్టి ఉంచిన రహస్యం

ఆఫ్రికాలో మా బృందం లోని ఒక సభ్యురాలు సద్గురు పెయింటింగ్ చేసింది, అది ఆయనకు బహుమతిగా ఇవ్వమని మాకు చెప్పింది. మేము అది లులు దగ్గర కూడా రహస్యంగా ఉంచాం. దాంతో, లులు, ఈశా టీచెర్ మేము దాన్ని డప్పుల హోరు మధ్య సద్గురు కొసం వేదికపైకి తీసుకువెళ్ళేటప్పుడు వారు చాలా ఆశ్చర్యపడ్డారు.

6-20170225_IQB_1282-e

మాతో ఇంటికి తీస్కెళ్ళిన జ్ఞాపకాలు

మేము సుర్యకుండ్ లో ఉత్సాహంగా తీస్కున్న మొదటి మునకను నేను ఎప్పటికీ మరచిపోలేను. బృందంలోని సభ్యుడు న్దుల ముహామాద్ ఇలా చెప్పారు:

మేము మామూలుగా ఈతకొట్టే లాంటి సాధారణ నీరు అని మొదట అనుకున్నాము, కానీ చాలా చల్లగా ఉన్నాయి, మేము గడ్డ కట్టిపోతున్నామా అన్నట్లుగా అనిపించింది. కాని మేము బయటకి వచ్చిన తర్వాత చాలా ప్రత్యేకమైన అనుభూతి చెందాము. నేను ఎంతో శక్తిని, కదలికను పొందినట్లు అనిపించింది. కొంచెం విచిత్రంగానే అనిపించింది, కానీ ఆ అనుభూతి అద్భుతం.”

చివరిగా, మా బృందంలో అత్యంత చిన్నవాడైన 7 సంవత్సరాల యోవసి ఇబ్రహీం చెప్పినవి:

ఇక్కడ ఇంగ్లిష్ మాట్లాడటం తెలియని తెల్ల వాళ్ళని చూడటం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది!

తెల్లగా ఉండే వారంతా ఇంగ్లిష్ మాట్లాడగలరు అని అతని భావన. మేము భోజనానికి వెళ్ళిన ప్రతిసారి అతనికి చాలా ఆహారం వడ్డించారు అని కూడా అతను చెప్పాడు. అక్కడి వారు అతన్ని ఎత్తుకొని, అతని నాట్యం చేయటం.. అందరూ అతన్ని అంత ప్రేమగా చూడటం అతనికి చాలా ఆనందం కలిగించింది.

మా మొదటి విమాన ప్రయాణంలో ఉన్న పెర్సనల్ టివి నుంచి వాడు చేతులు తీయనేలేదు! ( యోవసి కన్న తల్లితండ్రులు వాడి బాగోగులు చూడలేనంత పేదవారు అవటం చేత, అతను బ్రియాన్ తో జీవిస్తున్నాడు.)

ఆశ్రమంలోని అందరిచే వారు పొందిన ప్రేమానురాగాలను బృందం అంతా ఎప్పటికీ గుర్తుచేసుకుంటారు. మేము ఇంటికి వెళ్ళేటప్పటికి, కృతజ్ఞతా భావంతో నిండిపోయి ఉన్నాము. మేము అక్కడ సద్గురు మొదలు మిగితా వారందరూ   అందించిన ప్రేమను మాతో తీసుకువెళ్ళాము.

రాకీస్ బృందం 2012 ముతున్ద్వే, లుబగాలో స్థాపించబడిన లాభాపేక్షలేని సాంస్కృతిక బృందం. వీరి సంకల్పం, ప్రతిభ గల నిర్భాగ్య పిల్లలలో స్పూర్తిని రగిలించి వారికీ ఇష్టమైన కళల్లో రాణించేలా చేయటం. బృందం వారి పూర్తి సామర్ధ్యాల్ని గ్రహించటానికి, వారి కాళ్ళపై వారు నిలబడటానికి వారి ప్రతిభను, చదువును, నివాసాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొనేందుకు చూస్తుంది.