మంగళసూత్రం విశిష్టత ఏమిటి??

mangalasutram

Sadhguruభారతదేశంలో వివాహం జరిగినపుడు “మంగళసూత్రం” కడతారు. ఇది ఒక పవిత్రమైన సూత్రం, దారం. దీని అర్థం ఏమిటంటే మీరు ఈ సూత్రాన్ని ఒక విధానంలో తయారు చేయాలి. మీరది మరచిపోయినట్లైతే, మీరు ప్రతి సంవత్సరం ఈ మంగళసూత్రాన్ని మార్చి కట్టుకోవాలి. మీరిప్పుడు ఆ పని చేస్తున్నారా…? ఈ మధ్యకాలంలో ఆ పని చేయడంలేదు. ఎందుకంటే ఇప్పుడది ఓ లావుపాటి బంగారు గొలుసు కాబట్టి. మంగళసూత్రం, ప్రత్తి నుంచి తీసిన దారంతో గానీ, పట్టునుంచి వచ్చిన దారంతో గాని చేయవలసి ఉంది. దీనికి ఒక సంపూర్ణమైన శాస్త్రమే వుంది. దీనిని ఒక తాంత్రిక విధానంతో, ఒక నాడిని మీ వ్యవస్థ లోంచి, మరొకటి మీకు నిశ్చితార్థం అయినవారి దగ్గరనుంచి తీసి, ఈ సూత్రాన్ని తయారుచేసి కడతారు. ఈ విధంగా సూత్రాన్ని తయారు చేసాక, ఎప్పుడైతే భౌతిక సాన్నిహిత్యం కలుగుతుందో అప్పుడు శక్తిపరమైన సాన్నిహిత్యం కూడా కలుగుతుంది. ఈ దంపతులు ఎంతగా ఒక్కటైపోతారంటే, ఇంక ఆ బంధాన్ని విడదీయలేరు. ఒకరి నుంచి ఒకరిని విడదీయడమన్నది ఎంతో కష్టమైనది.

వారికి కనీసం “నా భర్త ఏదైనా చేస్తూవుండివుండవచ్చా..? నా భార్య ఏదైనా చేస్తూవుండివుండవచ్చా.. ?” – అన్న ఆలోచన కూడా వచ్చేది కాదు.

పిల్లలకి చిన్న వయసులోనే వివాహం చేసేవారు. ఎనిమిది, తొమ్మిది, పదకొండు సంవత్సరాల వయసు ఉన్నపుడే వివాహం చేసేవారు. కానీ, వీళ్ళకి ఎప్పుడూ మరొకరి వైపు చూడాలి అన్న ఆలోచన ఎప్పుడూ వచ్చేది కాదు. ఇది, ఈనాటి మనసుతో ఆలోచిస్తే; అదేంతో భయానకంగా అనిపించొచ్చు. కానీ, వారికున్న స్థిరత్వం ఎటువంటిదంటే, వారికి ఎంత శక్తిని కలిగించేది అంటే, వారి జీవితంలో వాళ్ళకి ఏమి కావాలంటే వారది చేసుకోవచ్చు. ఎందుకంటే భావపరంగా అభద్రత అన్నదే వీరికి తెలీదు. భారతదేశంలో, అభద్రతా భావం అనేదొక కొత్త విషయం. వారికి కనీసం “నా భర్త ఏదైనా చేస్తూవుండివుండవచ్చా..? నా భార్య ఏదైనా చేస్తూవుండివుండవచ్చా.. ?” – అన్న ఆలోచన కూడా వచ్చేది కాదు. ఎందుకంటే, వారు ఆ విధంగా ముడి పెట్టబడ్డారు – ఒక విధంగా, అంతర్ముఖంగా. ఇప్పుడదంతా వట్టి తంతుగా మారిపోయింది.

రెండు కాళ్ళు అంత  స్థిరంగా వుండవు, నాలుగైతే మరింత స్థిరంగా వుంటాయి అని ఆలోచించి, ఈ రెండు – రెండు కాళ్లని ఒక్కటిగా జతపరిచాం అన్నమాట

మేము చేసే కొన్ని వివాహాల్లో ఈ విధంగా చేశాము.  వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం, అన్యోన్యత – అద్భుతంగా వుంటుంది. ఇద్దరు మనుషులు ఒక్కరుగా పని చేయడం అంటే ఎంత గొప్ప శక్తి..! అందుకని, రెండు కాళ్ళు అంత స్థిరంగా వుండవు, నాలుగైతే మరింత స్థిరంగా వుంటాయి అని ఆలోచించి, ఈ రెండు – రెండు కాళ్లని ఒక్కటిగా జతపరిచాం అన్నమాట. మనం, ఒక సైకిలు నుంచి కారుకి మారాము కదా…! ఎందుకంటే, సైకిలు కంటే కారు ఎక్కువ స్థిరంగా వుంటుందని. ఇది ఎక్కువ చోటు తీసుకున్నప్పటికీ, ఇది ఎక్కువ ఖరీదైనప్పటికీ, ఇది వాతావరణాన్ని కలుషితం చేస్తున్నప్పటికీ, మనం ఒక కారు స్థిరంగా వుంటుందని దానిని ఎంపిక చేసుకున్నాము. మనం కారునైతే, ఎప్పుడూ దీనిని ఎలా సమతుల్యంలో పెట్టాలా అని ప్రయత్నించక్కర్లేదు. అందుకే “వివాహం”. లేదంటే, ఎప్పుడూ మీరు ఈ స్థిరత్వం గురించి ఆలోచిస్తూ వుండాలి, ఎప్పుడూ మీ చుట్టూరా వున్నవారి పట్ల భావావేశపరమైన సంబంధాల గురించి మీరు అభద్రత అనుభూతి చెందుతూ వుండాలి. వీటన్నిటివల్ల ఏమి జరుగుతుందంటే; మీరు మీ జీవితంతో ఏమి చేయవచ్చునో – దానిమీద మీరు దృష్టి పెట్టలేకపోతారు. అందుకే “వివాహం”.

ప్రేమాశిస్సులతో,
సద్గురు
freewebs.comఅనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *