Sadhguruఎన్నో వేల సంవత్సరాల క్రితం, ఎన్ని వేలో మనకి తెలియదు. తోకచుక్కలు, ఉల్కాపాతాలని, వాటి కదలికల్ని పరిశీలిస్తే బహుశా 15000 సంవత్సరాల నుండి 40000 సంవత్సరాలు అయ్యుండచ్చు అని అంచనా. ఆదియోగికి ఆత్మసాక్షాత్కారం కలిగింది. ఈయన ఎంతో పారవశ్యంతో హిమాలయాలలో ఆనంద తాండవం చేస్తున్నారు. ఆయన పారవశ్యం ఇంకా ఎక్కువైనప్పుడు ఆయన నిశ్చలంగా మారిపోయారు. ప్రజలు, ఎవరికీ తెలియనిదేదో ఆయన తెలుసుకుని అనుభూతి చెందుతున్నారని తెలుసుకున్నారు. ప్రజల్లో కుతూహలం మొదలైంది. వాళ్ళు వచ్చారు, ఎదురుచూశారు వెళ్ళిపోయారు. ఎందుకంటే, ఈయన వేరే వారిని పట్టించుకునే స్థితిలో లేరు. ఈయన అయితే పారవశ్య నృత్యం చేస్తున్నారు లేదా నిశ్చలంగా ఉన్నారు. కేవలం ఏడుగురు మాత్రం మిగిలారు. ఈ ఏడుగురు ఆయన దగ్గర నేర్చుకోవాలని పట్టుబట్టారు. వాళ్ళు ఆయన్ని బతిమాలారు, వేడుకున్నారు, మీకు తెలిసినదేదో మాకు తెలియజేయండి అని అడిగారు.

ఈయన అయితే పారవశ్య నృత్యం చేస్తున్నారు లేదా నిశ్చలంగా ఉన్నారు

శివుడు వారిని "ముర్ఖులారా: ఇప్పుడు మీరున్న స్థితిలో దీన్ని గ్రహించలేరు, వెళ్ళిపొండి. దీనికి ఎంతో సాధన అవసరం, ఇది వినోదం కాదు" అన్నాడు. వాళ్ళు సాధన చేయడం మొదలుపెట్టారు: రోజు తరవాత రోజు, నెల తరవాత నెల, సంవత్సరం తరవాత సంవత్సరం. ఇలా వాళ్ళు సంసిద్ధం అవుతూనే ఉన్నారు, ఆయన వాళ్ళని విస్మరిస్తూనే ఉన్నారు. ఇలా 84 సంవత్సరాల తరవాత ఒక రోజున ఆయనంతం జరుగుతున్నప్పుడు, అంటే ఆ రోజున సూర్యుడికి భూమితో ఉండే సంబంధం మారుతుంది. ఇది ప్రతి ఆరు నెలలకు జరుగుతుంది. ఈ సంస్కృతిలో దానిని మనం ఉత్తరాయనం, దక్షిణాయనం అంటాం.

వాళ్ళు ఆయన దృష్టిని ఆకర్షించారు. తరువాత 28రోజులు ఆయన వారిని పరిశీలించారు.

జూలైలో ఉత్తరాయనం నుంచి దక్షిణాయనం లోనికి సూర్యుడు మారుతున్నప్పుడు, ఆ తరువాత వచ్చిన మొదటి పౌర్ణమి రోజు తరవాత అంటే అప్పటికి 84 సంవత్సరాలు అయ్యింది కాబట్టి, వారు అప్పటికే 1008 పౌర్ణముల పాటు సాధన చేశారు. ఆ రోజున ఆదియోగి వారిని చూసారు, వారు ఎంతో తేజోపాత్రులుగా ఈ జ్ఞానాన్ని గ్రహించేందుకు అనుకూలంగా ఉన్నారు. ఆయన ఇంక వారిని విస్మరించలేకపోయారు. వాళ్ళు ఆయన దృష్టిని ఆకర్షించారు. తరువాత 28రోజులు ఆయన వారిని పరిశీలించారు. మళ్ళీ వచ్చే పౌర్ణమి రోజున గురువుగా మారాలని ఆయన నిశ్చయించుకున్నారు. ఆదియోగి ఆది గురువుగా పరిణామం చెందారు. ఆరోజున మొదటి గురువు ఉద్భవించారు.

ప్రేమాశిస్సులతో,
సద్గురు

సంపాదకుడి ద్వారా:

  • ఈశా యోగా కేంద్రంలో ఫిబ్రవరి 20 నుండి 23 వరకు సద్గురు యోగేశ్వర లింగ ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఇదే సమయంలో యక్ష మహోత్సవం కూడా ఆరంభమవుతుంది, దీనిని ప్రత్యక్ష ప్రసారంలో ఇక్కడ చూడవచ్చు.
  • మహాశివరాత్రి నాడు జరిగే కార్యక్రమాలని ప్రత్యక్ష ప్రసారంలో ఇక్కడ చూడవచ్చు.
  • మహాశివరాత్రికి మిమ్మల్ని మీరు తయారుచేసుకోవడానికి ఒక సరళమైన సాధన చేయవచ్చు. 3 రోజుల సాధన 22 ఫిబ్రవరి నుండి మొదలవుతుంది. మరిన్ని వివరాలకోసం ఇక్కడ చూడండి.