Sadhguruశివ అంటే, ఏదైతే లేదో, ఎదైతే లయం అయిపోయిందో - అది. ఎదైతే లయమైపోయిందో అది ఈ సృష్టి అంతటికీ కూడా మూలం. ఎదైతే అనంతమైనదో అది సర్వేశ్వరుడు. శంభో అనేది ఒక తాళం చెవి లాంటిది. ఒక మార్గం. మీరు మీ శరీరం ముక్కలైపోతుందేమో అనే విధంగా దీనిని ఉచ్చరించగలిగినప్పుడు మీకు ఆ మార్గం లభ్యం అవుతుంది. మీరు మిగతా అంశాలనన్నింటినీ నియంత్రించి అక్కడివరకు చేరుకోవాలి అంటే ఎంతో ఎక్కువ కాలం పడుతుంది. కానీ మీరు ఈ చిన్న దోవ తీసుకోవాలనుకుంటే వాటన్నిటినీ దాటి వెళ్లిపోవచ్చు. వాటిని అధిగమించడం ద్వారా కాదు. వాటినుంచి తప్పించుకోవడం ద్వారా.

మీకు అన్నిటిమీదా జ్ఞానం సంపాదించి నియంత్రణ సాధించాలనుకుంటే దానికి చేయవలసిన సాధన కొంత వుంటుంది.  కానీ మీరు వంగి పాక్కుంటూ వెళ్లిపోవాలనుకుంటే కేవలం “శంభో” అంటే చాలు.

నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడూ నాకు మైసూరు 'జూ' లో చాలా ప్రాణులు స్నేహంగా ఉండేవి. ఆ సమయంలో నా దగ్గర రెండు రూపాయలు ఉండేవి. నేను ప్రతి ఆదివారం పొద్దున్న చేపల మార్కెట్ కి వెళ్ళేవాడిని. బాగా లోపలికి వెళ్తే అక్కడ కుళ్ళిపోయిన చేపలు వుండేవి. రెండు రూపాయలకి ఒకోసారి నాకు రెండు – మూడు కిలోల చేపలు దొరికేవి. వాటిని ఒక ప్ల్లాస్టిక్ బ్యాగ్ లో వేసుకొని, మైసూర్ జూ కి వెళ్ళేవాడిని. నా దగ్గర అంతకంటే డబ్బులుండేవి కావు, అప్పట్లో జూ కు టిక్కెట్టు ఒక్క రూపాయి ఉండేది, ఇది మీరు తిన్నగా వెళ్లాలనుకుంటే. కానీ అక్కడ రెండు అడుగుల ఎత్తులో ఒక కడ్డీ ఉండేది. మీరు గనక దానిలోపల దూరి పాక్కుంటూ వెళ్లడానికి సిద్ధంగా వుంటే అప్పుడది ఉచితం. సరే నాకు సమస్య ఏమి వుంది. నేను కిందనుంచి పాకి  వెళ్ళేవాడిని. అక్కడ రోజంతా నా స్నేహితులతో గడిపి వాటికి ఆ కుళ్ళిపోయిన చేపలు తినిపించి వచ్చేవాడిని.

మీరు అలా తిన్నగా వెళ్ళాలి అనుకుంటే ఇది కొంత కష్టమైన మార్గం. దీనికి ఎంతో సాధన చేయవలసి ఉంటుంది. మీరు గనక అలా వంగి పాక్కుంటూ వెళ్లడానికి సంసిద్ధంగా వుంటే తేలిక మార్గాలున్నాయి. ఎవరైతే అలా వంగి వెళ్లగలరో వాళ్ళు దేనిమీదా నియంత్రణ సాధించడం గురించిన చింత పెట్టుకోవక్కరలేదు. మీకెంత కాలం కావాలంటే అంతా కాలం జీవించవచ్చు. మీరెప్పుడైతే మరణిస్తారో అప్పుడు మీరు ముక్తిని పొందవచ్చు. చాలా సరళమైనవాటిని నియంత్రణ చేయడంలో ఒక రకమైన అందం వుంటుంది. ఉదాహరణకి ఒక ఫుట్బాల్ సంగతే తీసుకోండి. ఒక చిన్న పిల్లవాడు కూడా ఇది ఆడగలడు. కానీ ఎవరైనా దీనిని బాగా సాధన చేసి ఆ బంతిని తన్నారనుకోండి అది ఎంతో అందంగా వుంటుంది. అప్పుడు, ప్రపంచంలో సగం మంది లేచి కూర్చొని వాళ్ళు బంతిని ఎలా తంతున్నారో చూస్తారు. ఔనా..? మీకు అన్నిటిమీదా జ్ఞానం సంపాదించి నియంత్రణ సాధించాలనుకుంటే దానికి చేయవలసిన సాధన కొంత వుంటుంది.  కానీ మీరు వంగి పాక్కుంటూ వెళ్లిపోవాలనుకుంటే కేవలం “శంభో” అంటే చాలు.

https://soundcloud.com/soundsofisha/shambho-1-hr

ప్రేమాశిస్సులతో,
సద్గురు