"ఆదియోగి, సాక్షాత్తు శివుడే యోగానికి మూలం అని ప్రపంచానికి తెలియాలని నా ఆకాంక్ష” – సద్గురు

ఫిబ్రవరి 24, 2017 మహాశివరాత్రి పర్వదినాన,  112 అడుగుల ఆదియోగి శివుని ముఖం - ప్రపంచంలో అతిపెద్ద ముఖం - ఈశా యోగ సెంటర్, కోయంబత్తూర్, తమిళనాడు, భారతదేశంలో సద్గురుచే ప్రతిష్టి చేయబడుతుంది.

ఆదియోగి  అద్భుతమైన ముఖం, మనందరికీ యోగ శాస్త్రమే ముక్తి మార్గం అన్న స్మృతి, ప్రేరణని కలుగచేస్తుంది. ఇటువంటి ఒక సరూపమైన ముఖం సృష్టించే ఆలోచన కేవలం మరో విగ్రహాన్ని తయారుచేయడం కాదు. మనకు తెలియని విషయాన్ని నమ్మడం అన్న ప్రస్తుత స్థితి నుంచి సత్యాన్వేషణ చేసే స్థితికి ప్రపంచాన్ని పరిణామం చెందించగల అద్వితీయమైన శక్తి ఇది. సద్గురు ఆకాంక్షించిన విధంగా ఈ విగ్రహం ప్రపంచాన్ని ఆధ్యాత్మిక సముద్రంలో ముంచేసే ఓ మూలస్తంభం అవుతుంది.

"ప్రేమ, వెలుగు, ఆనందంతో నిండిన ప్రపంచం, దానికి ఇదే సమయం. రండి, మనం దీన్ని సాకారం చేద్దాం” ~ సద్గురు

ఇందులో పాలుపంచుకోవడానికి ఇతర మార్గాలు :

1. పరివర్తన కోసం ఈ  5 నిమిషాల యోగా టూల్స్ ద్వారా మన జీవితంలో యోగా ఒక భాగం చేసుకుందాం. యోగా శరీరాన్ని కష్టమైన భంగిమలలో తిప్పడమో,  తలపై నిలబడడమో లేదా శ్వాసను బిగబట్టడమో కాదు. ఈ జీవితం ఏ విధంగా సృష్టించబడిందో, దాని ఆవశ్యక స్వభావం ఏమిటో అన్వేషించడానికి యోగా ఒక శాస్త్రం మరియు సాంకేతికత .

2. మీరు ఫేస్బుక్, ట్విట్టర్ మరియు సోషల్ మీడియా పై షేర్  చెయ్యడం ద్వారా, లేదా వ్యక్తిగతంగా మీ స్నేహితులు, కుటుంబ సభ్యలకు తెలియచెయ్యడం ద్వారా సహకరించవచ్చు.

మరిన్ని వివరాలకోసం: mahashivarathri.org