లండన్ లో సద్గురు


3600 మందితో నిండిన ఎక్సెల్ (ExCel), లండన్  హాలు సద్గురుకి స్వాగతం పలికింది.

నవంబరు 13 సాయంత్రం, 3600 మందితో కిటకిటలాడిన ఎక్సెల్ (ExCel) లండన్ హాలులో సద్గురు, ఆయన తాజా పుస్తకం “Inner Engineering: A Yogi’s Guide to Joy” ని విడుదలచేశారు. ఈ పుస్తకం ఇప్పటికే ఉత్తర అమెరికన్ పాఠకులలో చాలా ప్రచారం పొంది, అనేక విభాగాలలో న్యూయార్క్ టైమ్స్ అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకాల జాబితాలో చేరింది.

పశ్చిమదేశాల పాఠకులకోసం గతనెల మొదటిసారిగా చేపట్టిన తన పుస్తక విడుదల పర్యటనని ఉత్తర అమెరికాలో 17 నగరాలలో సద్గురు విజయవంతంగా పూర్తిచేశారు. ప్రతి కేంద్రమూ “పుస్తకాలన్నీ అమ్ముడైపోయాయి” అన్న బోర్డుతో స్వాగతించింది. 3 వారాల వ్యవధిలో, 26 వేలమందికి పైగా శ్రోతలు ఎంతో ఉత్సాహంతో ఆయన ప్రసంగాలు విన్నారు.

పుస్తకం గురించి మాటాడుతూ, ఈ పుస్తకాన్ని విడుదల చెయ్యాలని ఆయనకు 20 సంవత్సరాల నుండి మనసులో ఉందని చెప్పారు. “మీకు ఆనందం శాశ్వతమైన చేదోడుగా చెయ్యాలన్న లక్ష్యమే  ఈ పుస్తకాన్ని విడుదలచెయ్యాలన్న సంకల్పానికి వెనుకనున్న కారణం. అది సాధ్యం చెయ్యడానికి ఈ పుస్తకం మీకు ఏ ఉపదేశాలూ చెయ్యదు, ఒక్క శాస్త్ర విషయాలు తప్ప; ఇది బోధనకాదు, సాంకేతిక పరిజ్ఞానం; ఇదొక ఆదేశం కాదు, మార్గాన్ని సూచించడం.  మిగతా పుస్తకాలన్నీ మీకు కేవలం ప్రేరణ నిస్తాయి. ఈ పుస్తకం మీలో పరిణామాన్ని తీసుకువస్తుంది,” అన్నారు. ఇన్నర్ ఇంజనీరింగ్ పాఠకుడికి తనను తాను శక్తిమంతునిగా చేసుకుని అంతరంగ సుస్థిరతకు ఒక ప్రణాళికని రూపకల్పనచేసుకోగలిగేలా యోగశాస్త్రము మీద ఆధారపడిన అధునాతనమైన మార్గదర్శకత్వాన్నిస్తుంది.

ఈశా సంస్థ  వ్యవస్థాపకులు, సద్గురు ప్రపంచంలోనే అత్యున్నతస్థాయి చర్చా వేదికగా పేరుపడ్ద ఆక్స్ఫోర్డ్  యునియన్ కి  చెందిన విద్యార్థులూ, పూర్వ విద్యార్థులూ, విద్యావేత్తలని ఉద్దేశించి నవంబరు 15న, లండనులో ప్రసంగించారు.

సమాజ సంక్షేమానికి, ప్రాచీన సాంకేతికతలూ, వాటి ప్రాముఖ్యత వాటి వెనకనున్న శాస్త్రీయత, ఆధునిక సమాజాలకి వాటి ప్రయోజనమూ గురించి ఉపన్యసించారు. మనిషి మెదడు, వివేకమూ ఎలా పరిణామక్రమంలో అభివృద్ధిచెందుతూ వచ్చాయో ప్రత్యేకంగా చెబుతూ, మనుషులకి ఈ శక్తులని ఎలా వినియోగించుకోవడం చేతకావడం లేదో,  పర్యవసానంగా ఎలా బాధపడుతున్నారో చెప్పారు.  మానవ మేధస్సుయొక్క పరిమితినీ, అన్ని వేళలా కేవలం వివేచన ద్వారానే అన్నీ ఎలా తెలుసుకోలేమో వివరించేరు.

అంతేగాక, జ్ఞానం ఎప్పుడూ పరిమితమేననీ, అజ్ఞానానికి పరిమితిలేదనీ  చెప్పారు. “యోగ సంస్కృతి అజ్ఞానానికి విలువ ఇస్తుంది,  ఒక వ్యక్తి ఈ అజ్ఞానంతో తనని తాను  గుర్తించుకోగలిగితే, సహజంగా అతను, జిజ్ఞాసువుగా మారుతాడు. వ్యక్తి తనను తన విజ్ఞానంతో గుర్తించుకుంటే అతను నిరంకుశుడుగా మారతాడు” అని అన్నారు.

భారత-ఐరోపా వ్యాపార వర్గం ఏర్పాటు చేసిన ప్రపంచ వ్యాపార సమేళనంలో నవంబరు 16 న సద్గురు  యోగ శాస్త్రం ద్వారా ప్రపంచంలో లక్షలమంది జనానీకానికి ఆయన చేసిన అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా “భారత-ఐరోపా వ్యాపార వేదిక” వారి Excellence Award  అందుకున్నారు.  హర్యానా మంత్రిమండలి సభ్యులైన శ్రీ బిలాస్ శర్మ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా  హాజరయ్యారు.

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ఇటీవల సద్గురు ఆధ్వర్యంలో ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమాన్ని చేసారు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – ఇన్నర్ ఇంజనీరింగ్ 
అనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *