సద్గురు: కోపం అనేది ఒక స్థాయి అసంతృప్తి, మీలోనూ మీ చుట్టూ ఉన్న వారిలోనూ ఉంటుంది. చాలాసార్లు మీ కోపానికి గురయిన వ్యక్తికంటే మీరే ఎక్కువ బాధపడతారు. మీకు కోపం వచ్చినప్పుడు మీ జీవితంలో ఎప్పుడూ చేయనంత మూర్ఖమైన పనులు చేస్తారు. ఆ విధంగా జీవించడం అంత తెలివైన పద్ధతేమీ కాదు.

కోపానికి సంబంధించి సద్గురు ఎం చెప్తున్నారో తెలుసుకుందాం.

  • భయం, కోపం అనేవి నిర్భంధతల నుండి ఉత్పన్నమైనవే. మీరు కృషి చేయాల్సింది నిర్భంధతా స్వభావం పైనే.

1

 

  • చీకాకు, కోపం, ద్వేషం, ఆగ్రహం అనేవి కేవలం తీవ్రతా స్థాయిలే. మీకు ఏకొంచెమైనా చీకాకు అనిపిస్తే, మీరు దానిపైనే కృషిచేయాలి.

2

 

  • మీపై కోపాన్ని ప్రయోగిస్తే, అది మీకు నచ్చదు, కానీ ఇతరులపై ప్రయోగించడం ఒక పరిష్కారమని మీరనుకుంటారు.

3

 

  • భయం, కోపం, బాధ, నిరాశ, నిస్పృహ, మనోవ్యాకులత ఇవన్నీ, నియంత్రణలో లేని మీ మనసు నుంచి జనించినవే

4

 

  • మీ కోపం మీ సమస్యే - దాన్ని మీ వరకే ఉంచుకోండి.

5