ఈశా వంటగదిలో తయ్యరయ్యే ఈ పాలకూర, ఫ్రూట్ సలాడ్ తయ్యరీ విధానం మీకోసం అందిస్తున్నాము. రుచికరమైన ఈ సలాడ్ ని మీ ఇంట్లోనే తయ్యారుచేసుకొని ఆనందించండి!

సలాడ్ కోసం కావలసిన పధార్ధాలు:

పాలకూర ఆకులు    - కడిగి, చిన్న ముక్కలుగా తరిగినవి: 3 కప్పులు
1 చిన్న దోసకాయ    - కడిగి,చిన్న చతురస్రాలుగా తరగాలి
1 చిన్న ఆపిల్       - కడిగి,చిన్న చతురస్రాలుగా తరగాలి
వేయించిన వేరుశనగ  - బద్దలుగా చేసినవి: ¼ కప్పు
జీడిపప్పు            -  బద్దలుగా చేసినవి: ¼ కప్పు
తాజా కొత్తిమీర        - తరిగినది 2-3 కొమ్మలు 
1 చిన్న కమలా పండు - ఒలిచి, చిన్న ముక్కలుగా తరగాలి
ఎండుద్రాక్ష           - ¼ కప్పు
డ్రెస్సింగ్ కోసం

కమలా పండు - 1
నిమ్మకాయ - 1
తేనె 2 టేబుల్ స్పూన్లు
ఆలివ్ ఆయిల్: ½ కప్పు
రుచికి కావలసినంత నూరిన నల్ల మిరియాలు, ఉప్పు

తయారుచేసే విధానం: 

కమలా ముక్కలు ఇంకా ఎండుద్రాక్ష తప్ప, మిగిలిన అన్ని సలాడ్ పదార్థాలు పెద్ద బౌల్లో ఉంచండి. 
డ్రెస్సింగ్ కోసం: ఒక చిన్న గిన్నెలో, కమలా, నిమ్మ రసం లో తేనె, ఉప్పు, మిరియాల పొడి - అన్నిటినీ బాగా కలపండి.
ఒక సన్నని ధారలా ఆలివ్ నూనెను ఈ మిశ్రమంలో బాగా కలిసేంతవరకు కలపండి. 
పెద్ద బౌల్ లో ఉన్న సలాడ్ పదార్థాలతో ఈ డ్రెస్సింగ్ ను కలపాలి. 
చివరగా, ఎండుద్రాక్ష ఇంకా  కమలా ముక్కలు పైన అందంగా అమర్చండి. బాగా కలిపి అందరికి వడ్డించండి..అంతే..!