ఈ శరీరాన్ని, భావోద్వేగాలనూ, మనసునీ మీ జీవితానికి అవరోధాలుగా చేసుకుంటున్నారా లేదా మీ అభ్యున్నతికి వాటినే నిచ్చెన మెట్లుగా మలుచుకుంటున్నారా అనేదే ప్రశ్న. భావోద్వేగాల గురించి సద్గురు ఏమంటున్నారో ఈ ఏడు సూత్రాలా ద్వారా తెలుసుకుందాం.

  • భావోద్వేగాలు, ఆలోచనలు వేర్వేరు విషయాలు కావు. మీరు ఆలోచించే తీరే, మీరు అనుభూతి చెందే తీరు.

b1

 

  • మీ ఆలోచన, భావోద్వేగాల పరంగా మిమ్మల్నిమీరు ఈ ప్రపంచం నుండి ఎంత ప్రత్యేకం చేసుకుంటారో, మీరు జీవితం నుండి అంతగా దూరమై పోతారు.

b2

 

  • మనసు ఓ శక్తివంతమైన పరికరం. మీరు సృష్టించే ప్రతి ఆలోచనా, ప్రతి భావోద్వేగం అసలు మీ శరీర రసాయనికతనే మార్చేస్తుంది.

b3

 

  • మీరు ప్రతి విషయం గురించీ మరీ గంభీరంగా ఉంటే, మీకు కేవలం ఆలోచనలు, భావోద్వేగాలు మాత్రమే తెలుస్తాయి. మీకు జీవితం తెలియదు.

b4

 

  • మీ ఆలోచనలు, భావోద్వేగాలకు మించి జీవితం మరెంతో ఉంది. మానసిక పరిధి నుండి జీవితపు పరిధి వైపు కదలాల్సిన సమయం ఇదే.

b5

 

  • మీ ఆలోచనలనూ, భావోద్వేగాలనూ మీరు ఎక్కువగా పట్టించుకుంటే, మిగిలిన అస్థిత్వం నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకుంటారు.

b6

 

  • మీ ఆలోచనలు, భావోద్వేగాలు మీ మనసులో మీరు సృష్టించుకునే నాటకమే. దాన్నిఎక్కడో ఓ చోట మీరు ముగించగలగాలి.

b7