‘నేను, నాది’ అన్న భావనను తగ్గించుకోవడానికి ఉదాహరణగా సద్గురు ఒక కథను చెప్తున్నారు. శివుణ్ణి అనుభూతి చెందడానికి అది ఎలా సాధనంగా ఉపయోగపడుతుందో కూడా చెప్తున్నారు.

యోగ గాథల్లో మంచికథ ఒకటి ఉంది. ఒకరోజు ఒక వ్యక్తి హిమాలయాల్లో నడుస్తున్నాడు. అది చాలా కష్టమైన ప్రయాణం. ఎవరైనా సరే, ఇలాంటప్పుడు తనకు సహాయం లభిస్తే బాగుండుననుకుంటారు. అతను, “ఓ శివా! నేను నడవలేకుండా ఉన్నాను. రా.., నాకు సహాయం చేయ్యి. కనీసం నా చేయి పట్టుకొని నడిపించు.” అని అన్నాడు.

శివుడు ప్రత్యక్షమయ్యాడు, “నువ్వు నడువు, నీతో పాటు నేనూ నడుస్తాను” అన్నాడు.

“నువ్వు నాతో నడుస్తున్నట్లు నాకెలా తెలుస్తుంది?” అని అడిగాడా భక్తుడు.

‘నేనెవర్ని, నాదేమిటి’ వంటివి మీలో మీరు తగ్గించుకుంటే మీ జీవితం ఎంతో అద్భుతంగా తయారవుతుంది.

శివుడన్నాడు, “పాదముద్రలకోసం చూడు. నీకున్నది రెండు కాళ్లు. అక్కడ నాలుగు పాదాల ముద్రలు కనిపిస్తూ ఉంటే, నేను నీతో నడుస్తున్నట్లు.”

భక్తుడు మాటిమాటికీ వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడు. తన అడుగు జాడలతో పాటు శివునివి కూడా కనిపిస్తున్నాయా అని చూడడానికి.

కొన్నిరోజుల తర్వాత అతను వెనక్కు తిరిగి చూస్తే ఒకే జత పాదముద్రలు కనిపించాయి. “ఓ. నువ్వు మళ్లీ నన్ను వదిలేశావా.” అన్నాడు

శివుడన్నాడు, “చూడు. అంతా తడిగా ఉంది, జారుతూ ఉంది. నీ కాళ్ల వైపు చూసుకో. అవి పొడిగా ఉన్నాయి. అందుకే ఒకే జత అడుగుజాడలు మాత్రమే కనిపిస్తున్నాయి. అవి నావే.” ఆ మూర్ఖుడు శివుడి భుజాల మీద ఉన్నాడు.

‘నేనెవర్ని, నాదేమిటి’ వంటివి మీలో మీరు తగ్గించుకుంటే మీ జీవితం ఎంతో అద్భుతంగా తయారవుతుంది. మీరెవరు అన్న సరిహద్దులను దాటడానికి ఇది అతి సాధారణ సాధనం. అప్పుడే మీకంటే చాలా పెద్దదేదో మీలో, మీ జీవితంలో భాగమవుతుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

pc: en.wikipedia.org