బూడిద గుమ్మడి హల్వా

ashgourd-halwa-1090x614

ఆరోగ్య విలువలున్న ప్రాణిక ఆహారమైన, బూడిద గుమ్మడి హల్వా రుచికరమైన మిఠాయి. రోజూ బూడిద గుమ్మడిని తినడం ద్వారా అది మన మేధా సామర్థ్యాలను పెంపొందిస్తుంది.

కావలసిన పదార్ధాలు

300 – 400 గ్రాములు బూడిద గుమ్మడి – చెక్కు తీసి, తురిమినది.

1 కప్పు నేయి

10 జీడిపప్పులు

1 కప్పు చక్కెర

1 టీ స్పూను ఏలకి పొడి

తయారుచేసే పద్ధతి

  1. తురిమిన బూడిద గుమ్మడి చేతితో పిండి ఎక్కువగా ఉన్న నీటిని తొలగించాలి, లేదా బట్టలో కట్టికాని, వడపోసి కాని నీళ్లు పోయేటట్లు చేయాలి.
  2. నేయి వేడిచేసి జీడిపప్పు బంగారు రంగు వచ్చేట్లు వేయించాలి. వాటిని చిల్లులున్న గరిటెతో తీసి పక్కన ఉంచుకోవాలి.
  3. అదే నేతిలో బూడిద గుమ్మడి తురుమువేసి 3, 4 నిమిషాలు వేయించాలి. చక్కెర, ఏలకిపొడి కలపాలి.
  4. గరిటెతో ఆపకుండా తిప్పుతూ ఉడికించాలి. హల్వా బాండ్లి మధ్యకు చేరుకొని ఒక ముద్దలాగా తయారవుతుంది. వేయించిన జీడిపప్పు కలపాలి.
  5. చల్లార్చి, వడ్డించాలి.అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert