మీరు ఈ మధ్య కాలంలో ఈశా యోగా కేంద్రాన్ని సందర్శించాలనుకుంటున్నారా..? అలా  అయితే మీరు ఉపయోగ నేర్చుకోవడానికి ఓ అరగంట కేటాయించ వలసిందే..! రాబోయే జూన్ 21 న,   2 వ  అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా  ఉచితంగా  ఉప యోగా క్లాస్ ఈశా యోగా కేంద్రంలో అందిస్తున్నారు .  అయితే, మీకు క్లాసు చెప్పడానికి వచ్చే టీచర్ మీరూ ఊహించినదాని  కన్నా ఎంతో తక్కువ వయస్సు కల వారని మీరు గమనిస్తారు!

తమిళనాడులో  ఉన్న 8 ఈశా విద్య పాఠశాలల నుండి ఎనిమిదవ , తొమ్మిదవ తరగతి విద్యార్ధులు కోయంబత్తూర్ లోని ఈశా యోగ సెంటర్ లో, ఆసక్తిగల సందర్శకులుకు  , స్వచ్ఛందకార్యకర్తలకు రోజువారీ ఉప యోగ క్లాసు  అందించే ప్రాజెక్టుని నిర్వహిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు . క్లాస్ నమోదు, ప్రచారం, ఏర్పాటు చేయడం, నిర్వహించడం వంటి అన్ని తరగతుల అంశాలను నిర్వహిస్తూ ఇంకా  మరిన్నిటి పట్లో జాగ్రత్తలు తీసుకుంటూ  కేవలం 13-14 సంవత్సరాల వయసు గల, చురుకైన, ఔత్సాహిక విద్యార్థులు టీచర్లు అవడానికి శిక్షణ పొందారు. ఈ తరగతులు ఆరోగ్యం, ప్రశాంత  జీవినం ఇంకా  అంతర్గత సంతోషాన్ని అందించడమే లక్ష్యంగా ఎంచుకున్నాయి.

ఏప్రిల్ 16 నుండి మే 29 వరకు ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి గంటలోని మొదటి అరగంట తమిళంలో నిర్వహించబడే ఈ కార్యక్రమమలో 30 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్నారు. ప్రత్యేక సెషన్స్ ఆంగ్లంలో కూడా నిర్వహించబడతాయి. ఇప్పటివరకు, ఈ ప్రాజెక్ట్ పట్ల ఉత్సాహాన్ని చూపిస్తూ, సెషన్స్ కోసం పాఠశాలల నుండి కేవలం 12 రోజుల్లో 7,000 నమోదుల వరకు చేరుకున్నాయి!

ప్రాజెక్ట్ లో పాల్గొనడం కోసం ఈశా విద్య విల్లుపురం పాఠశాల నుండి వచ్చిన విద్యార్థుల గ్రూపు వారి పాఠశాల సెలవులలోని ఖాళీ సమయంలో ఉత్సాహంగా సేవనందిస్తూ ఒక వారం ఈశా యోగ సెంటర్ వద్ద ఉంటున్నారు. 13 సంవత్సరాల వయసు గల సంధ్య తన అనుభవాన్ని ఇలా పంచుకుంది, “మేము ఇక్కడకు  వచ్చినప్పుడు, మేము స్వయంసేవ చేస్తామని తెలుసు కానీ మేము నిజంగా యోగ తరగతులు బోధిస్తామని తెలుసుకునే సరికి  చాలా ఆశ్చర్యపోయాము! మేము క్లాసు  నిర్వహించడం, ఎలా నిలబడి ఉన్నాము, ఎలా మాట్లాడుతున్నాము అన్న వాటితో పాటు ఎలా చేస్తున్నాము అన్న విషయం మీద ఒకరికొకరు అభిప్రాయం తెలియజేసుకోవటం గురించి నేర్చుకున్నాము. మొదట్లో అందరి ఎదురుగా నిలబడి నేర్పించడానికి భయం వేసేది కానీ ఇప్పుడు మైక్రోఫోన్ పట్టుకుని సూచనలు ఇవ్వగలమని, యోగా ప్రయోజనాలను వివరించగలమని విశ్వాసం వచ్చింది.” తరగతి బయట ఇతర విద్యార్ధులు నమోదు ఫారాలను నిర్వహించి, ఆశ్రమ సందర్శకులను క్లాసు కి హాజరు అవ్వవలసిందిగా ప్రోత్సాహిస్తున్నారు. “వారు వచ్చి యోగా నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రతివారూ మమ్మల్ని తరగతుల గురించి అడుగుతున్నారు, ” అంటోంది 13 సంవత్సరాల వినీత.

ఈ విద్యార్థులు బోధనలో ఆరంభకులే అయినప్పటికీ, యోగాభ్యాసానికి అపరిచితుల కారు. పాఠశాలలో, ఈశా విద్య పాఠ్యాంశాలలో ప్రతి ఉదయం యోగా పీరియడ్ ఉంటుంది. “మేము యోగా సాధన చేసినప్పుడు, నాకు మరింత చురుకుగా, తాజాగా అనిపిస్తుంది. ఆ తరువాత నేను నా పనిని బాగా, చిత్తశుద్ధితో చేస్తాను” అని వినీత చెప్పింది.

ఆశ్రమంలో ఒక వారం ఉన్న తరువాత, అమ్మాయిలు దీనిని “ఒక స్వర్గం” గా వర్ణించి వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడలేదు కానీ అదే సమయంలో, ఇంటికి తిరిగి వెళ్లి స్నేహితులుకు , కుటుంబానికి , సమాజం కోసం యోగ క్లాసు  అందించడాన్ని కొనసాగించడానికి ఉత్సాహంగా ఉన్నారు. “వారు మాకన్నా పెద్ద వారైనప్పటికీ, మేము చెప్పేది విని, మా నుండి నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు,” అంటుంది సంధ్య.

ఉప యోగా, మన  భౌతిక జీవితాన్ని పరిపోర్ణంగా ఆస్వాదించే  అవకాశమిచ్చే సరళమైన ప్రక్రియ. ఇదీ కీళ్ళు, కండరాలు ఇంకా  శక్తి వ్యవస్థని ప్రేరేపించే అత్యంత శక్తివంతమైన వ్యవస్థ. ఈ అభ్యాసాలు ప్రత్యక్ష సెషన్లు, ఆన్లైన్ వంటి వివిధ రూపాల్లో జూన్ 21, 2015 న మొదటి యోగా అంతర్జాతీయ దినోత్సవం నాడు అందించబడ్డాయి, ఇవి ఒక కోటి ఇరవై లక్షల మంది  ప్రజలను చేరాయి!

ఇటీవలే ఒక లేఖ లో, సద్గురు రాబోయే  అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆయన రచించిన  ప్రణాళికను పంచుకుంటూ ఇలా అన్నారు: “మేము మానవ జనాభా లో ఎంతో ముఖ్యమైన శ్రేణి అయిన బాలలని చేరాలనుకుంటున్నాము.” ఆయన భారత దేశం అంతటా కనీసం పది వేల పాఠశాలలను చేరే విధంగా ఈశా కోసం ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ ప్రణాళిక ఎనభై నుంచి తొంభై లక్షల  యువత జీవితాల్లోకి యోగాని తీసుకువస్తుంది. మీరూ ఈ ప్రయత్నంలో పాలుపంచుకోవలనుకుంటే , దయచేసి YogaYoga.org ని సందర్శించండి.