కృష్ణుడు గోవర్ధన పర్వతం పైకి ఎత్తిన సన్నివేశం, దానికి  కారణమైన సంఘటనలు, అది కృష్ణుడి జీవితంలో కీలకమైన అంశం ఎలా అయిందన్న విషయాలు సద్గురు మనకు వివరిస్తారు.

 

కృష్ణుడికి అయన  జననం, జీవిత లక్ష్యం గురించిన సత్యాన్నిచెప్పినప్పటికీ, ఆయనకు గోకులం మీద, గోపికలు, గోపాలకుల మీద ఉన్న  ప్రేమ వల్ల  ఆయన మనసులో ఎక్కడో మధన పడుతూనే ఉన్నాడు. “నేను నిజంగానే నేను ప్రేమించేదాన్ని, నాకు తెలిసిందాన్నంతా వదిలేసి ఎదో లక్ష్యం కోసం వెళ్ళాలా?” అనే సందిగ్ధావస్థలో ఉన్నాడు. ఇది ఆయనకు నిర్ధారణ అయ్యే విధంగా తనలోనే ఏదైనా  సంకేతం  గోచరిస్తుందేమోనని చూస్తూనే ఉన్నాడు. ఆయనకు ఆత్మా జ్ఞానం కలగడం, జీవితం లక్ష్యం స్ఫురణకు రావడం ఇవన్నీ,  ఆయన ప్రేమించిన ప్రతి దాన్ని వదులుకునేంత విలువైనవా అని నిర్ధానిరించుకోలేక పోతున్నాడు.

ఈ సమయంలోనే గోకులంలో ఒక భయంకరమైన తూఫాను వచ్చింది. ఇది కృష్ణుడు విప్లవాత్మకంగా ఇంద్రోత్సవానికి బదులుగా గోపోత్సవం చేసిన కొద్ది రోజులకే వచ్చిది. ఈ తుఫాను మరీ ఉదృతంగా మారి, భారీ వర్షాలు కురిసాయి. యమునా నది పొంగటం వల్ల గోకులం వరదలో మునిగిపోయింది. సాధారణ ప్రజలు, వారు ఇంద్రోత్సవం జరుపుకోకపోవటం వల్ల, వర్షానికి అధిపతి అయిన ఇంద్రుడికి కోపం వచ్చి వాళ్ళను తన భారీ వర్షాలలో ముంచేస్తున్నాడనే ఆలోచన వారికి కలిగింది. యమునా నది నీరు మరీ ఎక్కువగా పొంగటం వల్ల ఇది అందరికి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిగా మారింది.

కృష్ణుడు, బలరాముడు, ఇంకా కొంత మంది స్నేహితులు కలిసి ప్రజలందరినీ సురక్షితంగా ఉంచటానికి ఒక అనువైన ప్రదేశం కోసం వెతకటం మొదలు పెట్టారు. కృష్ణుడికి గోవర్ధన పర్వతం బాగా తెలియటం వల్ల అక్కడ భూమి ఎలా ఉంటుందో బాగా తెలుసు. అక్కడ పర్వతంలో కొన్ని రంధ్రాలు మనించాడు. అక్కడి యువకులంతా వెళ్లి దానిలో ఎక్కువ చోటు వచ్చేలా కొండరాళ్ళను కదుపుతుండగా అక్కడ ఒక పెద్ద గుహ కనిపించింది.

అతి కష్టం మీద, ముఖ్యంగా బలరాముడి సహాయంతో ఒక్కొకటిగా ఆ బండ రాళ్ళను తొలిగించి గుహను తెరిచారు. చురుకుగా చేస్తున్న ఈ పనులను చూడటానికి వచ్చిన గోకులవాసులు అక్కడ ఒక గుహ ఉండటం చూసారు. అది వారికి ఒక అద్భుతమైన రక్షణా స్థానం అయింది. అందరితోపాటుగా జంతువులు కూడా దానిలోకి వెళ్ళాయి. కాని ఈ గుహ అందరికి సరిపోయేంత పెద్దది కాదు.

రాధ పరమానంద స్థితికి చేరుకుంది. ఆమె సాధారణ భావోద్వేగ పరిమితులను అధిగమించి ఇక ఏది పట్టన్నంత ఆనందభరిత స్థితికి చేరుకుంది.

ఆ క్షణంలో పర్వతమంతా భూమి నుంచి ఆరు అడుగుల ఎత్తుకు లేచింది. మొదట్లో అక్కడ జరుగుతున్న బ్రహ్మండాన్ని గ్రహించడం కష్టమైందని కృష్ణుడు స్వయంగా అంటాడు. ఈ గుహ ప్రజలందరితో పాటు, పశువులకు కూడా సరిపోయేంత పెద్దది అయింది. వరద తగ్గే వరకూ అందరూ అక్కడ కొద్ది రోజులు సౌకర్యంగా ఉన్నారు. ఈ సంఘటనతో గోకులంలో వారికి కృష్ణుడు దేవుడే అని 100% దృవీకరణ అయింది. కృష్ణుడు కూడా ఈ సంఘటన తరువాత ఇక జీవితంలో వెనుతిరిగి చూసుకోలేదు. ఆయన తన జీవితంలో ఏం చేయాలో ఆయనకు స్పష్టంగా తెలిసిపోయింది. ఇదే ఆయన తను అమితంగా ప్రేమించేవారిని, ముఖ్యంగా పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్న రాధను వదిలిపెట్టి తన జీవిత లక్ష్యం దిశగా సాగిపోయే శక్తినిచ్చింది.

ఆ తర్వాత ఎప్పుడూ కృష్ణుడు వేణుగానం చేయనేలేదు. . 

ఒకసారి వెళ్ళిపోవాలని నిశ్చయించుకోగానే ఉన్నపళంగా ఓ ఆఖరిసారి రాసలీలను ఏర్పాటు చేశాడు. ఆ రోజు పౌర్ణమి కాకపోయినా తన వారితో ఆఖరి సారిగా పాటలు పాడి, నాట్యం చేయాలని అనుకున్నాడు. రాధ పరమానంద స్థితికి చేరుకుంది. ఆమె సాధారణ భావోద్వేగ పరిమితులను అధిగమించి ఇక ఏది పట్టన్నంత ఆనందభరిత స్థితికి చేరుకుంది. కృష్ణుడు ఆమె దగ్గరికి వెళ్లి తన వేణువుని తీసి అమెకిచ్చాడు. “ఈ వేణువు నీకోసం మాత్రమే. ఇక నాకు ఇది అవసరం లేదు.” కృష్ణుడికి ఆయన వేణువంటే ఎంతో గర్వంగా ఉండేది, అది ఎంతో సమ్మోహనంగా ఉండేది. ఆయన వేణుగానం చేయగానే మనుషులు, ఆవులు, జంతువులు అన్నీ అక్కడికి చేరేవి. ఆయన చిన్నతనంలో ఎంతో గర్వంగా, “ఈ గ్రామంలో అందరికంటే బాగా  వేణుగానం చేసేది నేనే” అని అనేవాడు. ఎలాంటి వారినైనా కరిగించి, సమ్మోహనపరచగలిగే వాడు, జంతువులు కూడా ఆయన వేణుగానానికి స్పందించేవి. కాని ఆయన తన వేణువును రాధకు ఇచ్చేసాడు, అప్పటి నుంచి కృష్ణుడిలా రాధ వేణుగానం చేసేది. ఆ తర్వాత ఎప్పుడూ కృష్ణుడు వేణుగానం చేయనేలేదు. .

ప్రేమాశీస్సులతో,
సద్గురు

Pc: Abee5