చాలా కాలం క్రితం దక్షిణ భారతములో  ఓ అవివాహిత యువతి ఉండేది. ఈ ప్రదేశం దక్షిణ భారతదేశపు కొనలో ఉంది. ఆవిడ శివుడి చేయి పట్టుకోవాలని ఆకాంక్షించింది. ఆయన కాళ్ళు కాదు... ఈవిడకి కొచ్చెం స్వాభిమానం ఎక్కువ. ఆవిడ, అయన భార్యగా ఆయన చేయి పట్టుకోవాలని కోరుకుంది. ఆవిడ , "నేను కనుక వివాహం చేసుకుంటే అది ఈయనే" అనుకుంది. మీకు పెద్ద పెద్ద కోరికలు ఉన్నప్పుడు మీరు మీ సామర్ధ్యాన్ని కూడా ఆ విధంగా పెంచుకోవాలి కదా! లేకపోతే ఈ కోరికలు మిమ్మల్ని చాలా నిరాశకు గురి చేస్తాయి. అందుకని ఆవిడ ఆయనకు తగ్గ భార్య కావడానికి , సామర్ధ్యం పెంచుకోవానికి ప్రయత్నం చేయడం మొదలు ప్టిెంది. ఆవిడ తపస్సు తారా స్థాయికి చేరుకుంది. ఆవిడ దృష్టి అంతా ఆయన మీదే కేంద్రీకృతమైంది. ప్రతి క్షణం ఆయన మీదే తపస్సు. ఇది శివుడిలోని కారుణ్యాన్ని కరిగించింది. ఆయనలో ప్రేమ పుట్టించింది. ఆయన దక్షిణ భారత దిశగా ప్రయాణం మొదలు ప్టోరు.

మీకు పెద్ద పెద్ద కోరికలు ఉన్నప్పుడు మీరు మీ సామర్ధ్యాన్ని కూడా ఆ విధంగా పెంచుకోవాలి కదా! లేకపోతే ఈ కోరికలు మిమ్మల్ని చాలా నిరాశకు గురి చేస్తాయి.

మిగతా దేవుళ్ళలందరూ దీనిపై కుట్ర చేశారు. వారికి, ఈయనకి  ఒక దక్షిణ భారతదేశపు యువతి, భార్య కావడం ఇష్టం లేదు. వీళ్ళు ఆయన్నాపడానికి ఎన్నో మాయలు చేశారు. ఆవిడ ఓ గడువు పెట్టుకుంది. "నేను ఈ సూర్యోదయం లోపల ఆయనని వివాహం చేసుకోకపోతే నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తా" నని అనుకుంది. శివుడికి ఈ విషయం తెలిసింది. ఆయన వేగంగా దక్షిణ దిశగా రాసాగారు. మిగతా దేవుళ్ళలందరు ఆయన ఇక్కడ వివాహం చేసుకున్నారంటే ఇక పైకి రారేమో, ఇక దక్షిణములోనే ఉండిపోతారేమో అనుకున్నారు. అందుకని వారు సూర్యోదయం అయినట్టు భ్రమ కల్పిదామని కుట్ర చేశారు. వెలుగు చూడగానే శివుడు సూర్యోదయం అయిందనుకున్నాడు. "అయ్యో, సూర్యోదయం అయిపోయింది. నేను ఈ గడువులోపల చేరుకోలేకపోయాను" అనుకున్నారు. ఆయన చాలా దగ్గరలోనే ఉన్నారు. కాని ఆయన గడువు అయిపోయిందనుకొని వెనుదిరిగారు. ఆవిడ అలా నిల్చోనే తన ప్రాణాన్ని వదిలేశారు.

ఎక్కడైతే శివుడు కాలుమోపుతారో, కొంత సమయం గడుపుతారో దాన్ని కైలాసం అంటారు. అందుకని దీనిని దక్షిణ కైలాసం అన్నారు. 

ఈరోజుకు కూడా ఆవిడ అక్కడ కన్యాకుమారిగానే నిల్చుని ఉంటుంది. మనకి దక్షిణ భారతదేశపు కొనలో ఓ దేవాలయం కూడా ఉంది. సరే శివుడు వెను తిరిగి, ఆయనమీద ఆయనే ఎంతో నిరాశ చెందారు. ఆవిడ భక్తికి ఆయన తగినట్టుగా ప్రవర్తించలేకపోయాను అనుకున్నారు. ఆయన గడువులోపు రాలేకపోయానన్న నిరాశతో వెనుతిరిగి నడవడం మొదలు పెట్టారు. ఆయన ఎక్కడో అక్కడ కూర్చొని ఈ నిరాశ తొలిగించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆయన ఈ పర్వత శిఖరం (వెల్లంగిరి) ఎక్కారు. ఆ శిఖరం మీద ఆయన  కూర్చున్నారు, ఎంత సేపు కూర్చున్నారో మనకి తెలియదు. కానీ ఎక్కడైతే శివుడు కాలుమోపుతారో, కొంత సమయం గడుపుతారో దాన్ని కైలాసం అంటారు. అందుకని దీనిని దక్షిణ కైలాసం అన్నారు. దీని ఎత్తులో,  రంగులో, వైశాల్యంలో, దీన్ని మనం హిమాలయాల్లో వున్న కైలాసంతో పోల్చలేమేమో, కానీ దీని సామర్ధ్యంలో, దీని అందంలో, దీని పవిత్రతలో ఇది దానికి ఏ మాత్రం తీసి పోదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు