తమిళనాడు ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కు విరాళం ఇవ్వండి….

Chennai-flood2-1050x698

చెన్నై ఇంకా తమిళనాడులోని ఇతర తీరప్రాంతాలు అకాల వర్షాల వల్ల వరద బారిన పడ్డాయి. డిసెంబర్ 1వ తారీకున ఒక్కరోజులోనే చెన్నైలో 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది, ఇది డిసెంబర్ నెలలో కురిసే సగటు వర్షానికి రెండింతలు. ఇది నవంబర్ నెలలో తమిళనాడులో కురిసిన వర్షం వల్ల ఇప్పటికే కుంటుపడిన రాష్ట్రానికి అదనపు భారం అయ్యింది. వాతావారణ శాఖ వారు రాన్నున్న రోజుల్లో మరింతగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలియచేశారు. కొన్ని లక్షల మంది ఇళ్ళని వదిలి వలిసి వెళ్ళటంతో వారికి సహకారం వెంటనే అందించవలిసి వుంది. ఈశా ఫ్లడ్ రిలీఫ్ కార్యక్రమాలలో పునరావాస చర్యలు, వైద్య సహాయం, ప్రాధమిక అవసరాలు , ఆహార మంచి నీటి సరఫరా ఇంకా బట్టల పంపిణీని వరద బాధిత ప్రాతాలలో చేయనున్నారు.
ఈశా ఫ్లడ్ రిలీఫ్ కార్యక్రమం దశల వారీగా జరుగుతుంది. ప్రతీ దశలో అవసరాలు మారుతూ ఉండటమే దీనికి కారణం.

ఆరోగ్య సంరక్షణ
మొబైల్ హెల్త్ క్లినికులలో డాక్టర్లు మరియు పారామేడిక్స్ వరద ప్రాతం నుంచి కదలలేని వారి వద్దకే వెళ్తారు. వీరు ఉచిత కన్సల్టేషన్ మరియు చికిత్సను అందిస్తారు.

రిలీఫ్ శిబిరాలు
డాక్టర్లు మరియు పారామేడిక్స్ ప్రజలు తిరగగిలిగే పరిస్థితి ఉన్న చోట్ల కన్సల్టేషన్ మరియు చికిత్స ను అందిస్తారు.

రోజువారీ కన్సల్టేషన్
డాక్టర్లు చెన్నై మరియు పరిసర ప్రాంతాలలో ఉండి వైద్య సహాయం అవసరమైన ప్రజలకు చికిత్సను అందిస్తారు.

ప్రాధమిక అవసరాలు
తమిళనాడు రాష్టం మొత్తాన్ని జోన్ల కింద విభజిస్తారు. బట్టలు, వంట గిన్నెలు మరియు ఆహారాన్ని దాతల దగ్గర నుంచి సేకరించి ట్రక్కులలో వరద బాధిత ప్రాంతాలకు తరలిస్తారు.

మీరు విరాళంగా ఇవ్వగలిగినవి

తువ్వాళ్ళు
దుప్పట్లు
చొక్కాలు
పాంట్లు
చూడిదార్లు
చీరలు, ఇతర వస్తువులు.

మా సహాయ కార్యక్రమాలకు మద్దతునిచ్చి అవసరంలో ఉన్నవారిని ఆదుకోవాలని మా విజ్ఞప్తి. మీరు వాలంటీర్ చేసినా లేక విరాళం ఇచ్చినా, ఏ సహాయం అయినా కూడా ఆపదలో ఉన్నవారికి ఎంతో పెద్ద సహాయంగా మారుతుంది.

సంప్రదింపు సమాచారం
ఏ రకమైన దానం లేదా ఫ్లడ్ రిలీఫ్ పనిలో సహాయం చేయగలిగిన వైద్యులు ఈ నెంబరు సంప్రదించవచ్చు: +918300011111, +918300051000, +918300052000

బ్యాంకు బదిలీలు ద్వారా విరాళం కోసం హెల్ప్లైన్: +919442139000
ఆన్లైన్ విరాళాలను: http://www.ishafoundation.org/Donate
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert