అనేక సంవత్సరాల తరువాత నేను కొన్ని కార్యక్రమాల కోసం ప్యారిస్‌లో ఉన్నాను. ప్రాజెక్ట్ గ్రీన్ హాండ్స్ లో మన భాగస్వామి అయిన వైవెస్ రోచె ఫౌండేషన్ వారు 5 కోట్ల చెట్లు నాటడం పూర్తవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నేను తప్పక రావాలని వారు ఒత్తిడి చేయడం వల్ల నేను ఈ పర్యటనకు వెళ్లినప్పటికీ, వేరే చాలా కార్యక్రమాలు జరిగాయి. వాటిలో ఒకటి వేయి మందితో నిండినటువంటి సభ ఒక రోజు సాయoత్రం జరిగింది.పారిస్ ప్రజలు చాలా తక్కువ సమయంలో ఒక అద్భుతమైన పద్ధతిలో స్పందించారు.దాదాపు 30% ఐరోపామొత్తం నుండి వచ్చారు.
దాదాపు 8 సంవత్సరాల క్రితం,ఆంగ్లం మాట్లాడే దేశాలలోనే పని చేయాలని నేను ఒక విధమైన నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే ఆంగ్లయేతర భాషలు మాట్లాడే దేశాలలో పనిచేయాలంటే అనువాదం చేయాలి. అందుకు ఎక్కువ సమయం, కృషి పడుతుంది. కానీ ఇప్పుడు ఉత్సాహంతో ఉరకలేస్తున్న స్వచ్ఛంద కార్యకర్తల వల్ల గత నిర్ణయాన్ని తిరిగి మార్చుకోవాల్సి వచ్చింది. ఐరోపా, చైనా వారు భాష పరిమితులుబద్దలు కొట్టటం ద్వారా తిరిగి నన్ను వారి దగ్గరికి రప్పించుకుంటున్నారు.

కేప్ కాడ్‌లో రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ ఫౌండేషన్ వారి 26వ వార్షికోత్సవానికి నేరుగా వెళ్తున్నాను. వారు 'మానవ హక్కుల' విషయంలో విశేషమైన కృషి చేస్తున్నారు. వారు దానికి ఒక ఆహ్లాదకరమైన గోల్ఫ్ కార్యక్రమాన్ని కూడా జోడించారు. సరే, సరే, మీ ఊపిరిబిగబట్టుకుని వినండి! మా జట్టుకు టోర్నమెంట్లో 3వ స్థానం దక్కింది. ఖచ్చితంగా అదంతా నా వల్లే కాదు.

భారతీయ విద్యా భవన్ వారు న్యూయార్క్ లో35 వ వార్షికోత్సవం కోసం ఆహ్వానించారు. నాకూ, దీపక్ చోప్రాకూ మధ్య జరిగినసంభాషణకి చంద్రికా టాండన్ సంచాలకుగా ఉంది.  ప్రవాస భారతీయ ప్రముఖులు అందరూ వచ్చారు. సైన్స్, మానవ చైతన్యం రంగాలలో తన భాగస్వామ్యం గురించి దీపక్ మాతో పంచుకున్నాడు. మిగతా రెండు రోజులు కేవలం పుస్తక బృందంతో రోజుకి దాదాపు 20 గంటలు వెచ్చించ వలిసి వచ్చింది.
ప్రస్తుతం ఒక్క ఇంజన్ ఉన్న పైపర్ మాలిబు విమానంలో 26000 అడుగుల వద్ద ఉన్నాను – ఐఐఐ టెన్నెస్సీకి వెళ్తున్నాను. ఇప్పుడు ఆది యోగి నివాసమైన ఆశ్రమంలో కేవలం ఒక రోజు గడుపుతాను. ఆ తరువాత హౌస్టన్(1 రోజు), శాన్ ఫ్రాన్సిస్కో (2 రోజులు), ఐఐఐ (3 రోజులు), డెట్రాయిట్ (1 రోజు), న్యూ యార్క్ (1 రోజు), న్యూ జెర్సీ, ముంబైలను సందర్శిస్తాను.  నేనొక ఒక ట్రావెల్ ఏజెంట్‌లా ప్రయాణిస్తున్నాను, అవునా, కాదా?

ప్రేమతో,
సద్గురు